నేను అమాయకుడిని..
స్వాతి హత్యతో సంబంధం లేదు ప్లేటు ఫిరాయించిన నిందితుడు రామ్‌కుమార్
సాక్షి ప్రతినిధి, చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్యతో తనకు సంబంధంలేదంటూ నిందితుడు రామ్‌కుమార్ చెన్నై సెషన్స్‌కోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. గత నెల 24న చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో స్వాతి హత్యకు గురికాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రామ్‌కుమార్‌ను నిందితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు.
స్వాతిని హత్య చేసినట్లు పోలీసుల వద్ద అంగీకరించిన రామ్‌కుమార్, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించాడు. తాను అమాయకుడినని, గొంతుకోసుకున్న మాట కూడా నిజం కాదని, నిజమైన నిందితుడిని కాపాడేందుకు తనను బలిచేస్తున్నార ని పిటిషన్లో పేర్కొన్నాడు.