Infrastructure Accommodation
-
చలో వియన్నా
పారిస్: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం–విజ్ఞానం–సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లండ్ (న్యూజిలాండ్)ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చినట్టు ఎకనామిస్ట్ పత్రిక ప్రచురించింద కరోనా దెబ్బకు ఆక్లండ్ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా 2018, 2019 ల్లో నూ తొలి స్థా నంలో నిలిచింది. కరో నా వచ్చిన కొత్తల్లో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్ 19 స్థానంలో, లండన్ 33, మిలన్ (ఇటలీ) 49, న్యూయార్క్ 51వ స్థానంలో నిలిచాయి. టాప్ 10 నగరాలు 1. వియన్నా (ఆస్ట్రియా) 2. కోపెన్హగెన్ (డెన్మార్క్) 3. జ్యురిచ్ (స్విట్జర్లాండ్) 4. కాల్గరీ (కెనడా) 5. వాంకోవర్ (కెనడా) 6. జెనీవా (స్విట్జర్లాండ్) 7. ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) 8. టొరంటో (కెనడా) 9. ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) 10. ఒసాకా (జపాన్) మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) -
ప్రాథమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యారంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం‘మన బడి–నాడు నేడు’ కింద పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతూ.. సంస్కరణలు సత్ఫలితాలిచ్చేలా కార్యాచరణ దిశగా అడుగులేస్తోంది. పాఠశాల విద్యలో దశల వారీగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ పద్ధతుల్లో బోధన చేసేలా ఉపాధ్యాయులనూ సిద్ధం చేయిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన సామర్థ్యాలను మెరుగుపర్చేలా సీబీఎస్ఈ పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ బోధన కొనసాగించడంతో పాటు మూల్యాంకన రీతులను అనుసరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీమ్యాచ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా ‘స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్’ (సీమ్యాట్) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న దాదాపు 90 వేల మంది టీచర్లను ఈ శిక్షణలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన చేసేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తారు. తద్వారా విద్యార్థులకు ఉత్తమ పరిజ్ఞానం అందించి వారి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని సర్కారు నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ బోధనా విధానం (టీచింగ్ మెథడాలజీ), మూల్యాంకన పద్ధతులపై తర్ఫీదు ఇస్తారు. కరోనా నేపథ్యంలో దీక్షా డిజిటల్ వేదిక ద్వారా ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి జూలై 3వ తేదీ వరకు కొనసాగే శిక్షణ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. శిక్షణ ముఖ్యోద్దేశాలివీ.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం 1–6వ తరగతి వరకు పుస్తకాలను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నూతన పాఠ్య పుస్తకాల నేపథ్య పరిజ్ఞానం, కార్యాచరణ ఆధారిత, ప్రయోగాత్మక అభ్యసనాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను లక్ష్యాలను సాధించేలా సీబీఎస్ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దనున్నారు. అభ్యసన ఫలితాలు సాధించడంపై కంటెంట్ అనాలసిస్‌తోపాటు సృజనాత్మక రీతుల్లో బోధనాభ్యసన విధానాలను అనుసరించేలా తర్ఫీదునిస్తారు. మూల్యాంకన విధానాలు, సాధనాలు, మూల్యాంకన ప్రాసెస్‌లపై శిక్షణ ఇస్తారు. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన సామర్థ్యాలతో విద్యార్థులకు బోధన చేసేలా శిక్షణ ఇస్తారు. తెలుగు మాధ్యమంలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమ బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇలా.. ► ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ బోధనపై శిక్షణ ఉంటుంది. ► దీక్షా ప్లాట్ఫారం ద్వారా నిర్వహించే ఈ కోర్సు నిడివి 12 గంటలు. ఆన్లైన్లో రోజుకు గంట చొప్పున మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 12 రోజుల పాటు దీనిని నిర్వహిస్తారు. ► ఎన్సీఈఆర్టీ–న్యూఢిల్లీ, రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ), మైసూర్‌కు చెందిన ప్రొఫెసర్లు, కేంద్రియ విద్యాలయాల బోధనా సిబ్బంది రిసోర్సు పర్సన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదీ షెడ్యూల్ ఇంగ్లిష్: జూన్ 21 నుంచి 24వ తేదీ వరకు, మేథమెటిక్స్: జూన్ 25 నుంచి 29వ తేదీ వరకు, ఈవీఎస్: జూన్ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు. నూతన పాఠ్య పుస్తకాలు రెడీ.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పంపిణీకి సిద్ధమైన నూతన పాఠ్య పుస్తకాలు సంఖ్య తరగతి పాఠ్య పుస్తకాల సంఖ్య 1వ తరగతి 29,10,424 2వ తరగతి 30,96,822 3వ తరగతి 39,46,165 4వ తరగతి 39,40,938 5వ తరగతి 38,68,931 6వ తరగతి 35,38,818 7వ తరగతి 36,43,742 8వ తరగతి 41,19,992 9వ తరగతి 39,58,521 10వ తరగతి 37,93,110 -
శిలాఫలకాల్లోనే అభివృద్ధి
సాక్షి, గరిశపూడి(కృష్ణా) : పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు గాంధీజీ. అటువంటి గ్రామాల్లోని ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కృత్తివెన్ను మండలంలోని గరిశపూడి గ్రామంలో కాగిత వెంకట్రావు (కేవీఆర్) కాలనీని 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయినా నేటికీ కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1986వ సంవత్సరంలో కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయితీలో దాదాపు 5.60 ఎకరాల విస్తీర్ణంలో అప్పటి శాసన సభ్యులు కాగిత వెంకట్రావు కాలనీ ఏర్పాటు చే శారు. దీనిలో సుమారు 76 ప్లాట్లు కేటాయించి దీనికి కాగిత వెంకట్రావు పేరుతో కేవీఆర్ కాలనీగా నామకరణం జరిగింది. ఇది జరిగి దాదాపు 33 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ కాలనీలో అంతర్గత రహదారుల సౌకర్యం లేదు. అధ్వానంగా వీధి కుళాయిలు, ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోక ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు కాలనీ వాసులు. 2014 ఎన్నికల తరువాత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులతో మారుమూల గ్రామాలకు సైతం అంతర్గత రహదారులను అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం కనీసం ఒక్కరోడ్డు కూడా నిర్మించలేదు. చిన్నపాటి చినుకు పడితే కాలనీ మొత్తం మడుగును తలపిస్తుంది. వర్షం నీరు వారాలపాటు నిల్వ ఉండి దోమలు, పాముల భయంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అంతే కాలనీలో మేము పడుతున్న బాధలు భగవంతుడికే తెలియాలి. సరైన రహదారులు లేక నరకం చూస్తున్నాం. వర్షం వస్తే మా బాధలు చెప్పనలవికావు. వీధి దీపాలు కూడా సక్రమంగా వెలగవు. రోడ్లు లేక చాలా మంది ఇళ్లు నిర్మించుకోవడానికి కూడా భయపడుతున్నారు. కాలనీ కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలి. -బొర్రా పోతురాజు, కాలనీవాసి -
నిధుల లభ్యత సులభం కావాలి
* ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టులకు ప్రత్యేక చ ట్టం చేయాలి * స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటు అవసరం * ఇన్ఫ్రా రంగ సంస్కరణలపై కేల్కర్ కమిటీ సిఫార్సులు న్యూఢిల్లీ: అరకొర మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక వృద్ధికి అవరోధాలుగా మారిన నేపథ్యంలో ఇన్ఫ్రా రంగానికి ఊతమిచ్చేలా తీసుకోవాల్సిన పలు చర్యలను అత్యున్నత స్థాయి కేల్కర్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టే ప్రాజెక్టులకు (పీపీపీ) నిధుల లభ్యత సులభతరంగా ఉండేలా చూడాలని పేర్కొంది. వైద్యం, పట్టణ ప్రాంతాల్లో రవాణా తదితర విభాగాల్లో చేపట్టే ఇటువంటి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక చట్టం చేయాలని సూచించింది. అలాగే వివాదాల పరిష్కారానికి ట్రిబ్యున ల్‌నూ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన విజయ్ కేల్కర్ కమిటీ గత నెల సమర్పించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసింది. మోడల్ కన్సెషన్ ఒప్పందాలను సమీక్షించాలని, జీరో కూపన్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకునేందుకు అనుమతులివ్వాలని కమిటీ ఇందులో సూచించింది. అలాగే, ఆయా ప్రాజెక్టులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ ప్రాజెక్ట్ రివ్యూ కమిటీ (ఐపీఆర్సీ)ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం అయ్యేందుకు ఇన్ఫ్రా రంగ పీపీపీ ప్రాజెక్టులు కీలకపాత్ర పోషించగలవని కేల్కర్ కమిటీ వివరించింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగిన వ్యవస్థను రూపొం దించడం అత్యవసరమని పేర్కొంది. రిస్కులు ఎదురైతే ఏ పక్షం ఎంత భరించాల్సి ఉంటుందనేది స్పష్టంగా ముందుగానే గుర్తించాలని, పీపీపీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు ఆర్థిక ప్రయోజనాలు కాకుండా సేవలను అందుబాటులోకి తేవడమే కీలకం కావాలని కమిటీ సూచించింది. మరిన్ని సిఫార్సులు.. * మాజీ సుప్రీం కోర్టు జడ్జి లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ సారథ్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ అడ్జుడికేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఇందులో సాంకేతిక, ఆర్థిక నిపుణులు ఉండాలి. * ఐపీఆర్‌సీలో ఆర్థిక శాస్త్ర నిపుణులతో పాటు రంగానికి సంబంధించిన నిపుణులు (ఇంజినీర్లు), న్యాయ శాస్త్ర నిపుణులు ఒక్కొక్కరు చొప్పున ఉండాలి. * పీపీపీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే విషయానికి సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జీరో కూపన్ బాండ్లను జారీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతివ్వాలి. -
ప్రభుత్వ కాలేజీలకు మహర్దశ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అన్ని కళాశాలలకు సొంత భవనాలు, ల్యాబ్‌ల సౌకర్యం, ల్యాబ్ పరికరాల కొనుగోలుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. బుధవారం సచివాలయంలో పాలీసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ముందుగా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆ తరువాత బోధనా సిబ్బంది నియామకం చేపడుతామన్నారు. 25 కళాశాలలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.142.42 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. 19 పాలిటెక్నిక్ కాలేజీల్లో బాలికల హాస్టళ్ల నిర్మాణం కోసం రూ. 19 కోట్లు ఇచ్చామని, ఇందులో 15 హాస్టళ్ల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. అలాగే వికారాబాద్‌లో రూ. 8 కోట్లతో పాలిటెక్నిక్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ. 34 కోట్లతో 23 పాలిటెక్నిక్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వివరించారు. గతేడాది ప్రారంభించిన 8 పాలిటెక్నిక్‌లలో బోధన సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు. ఇదిలాఉండగా, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ఉచితంగా ప్రవేశాలు కల్పించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉప కడియం శ్రీహరి స్వయంగా ఈ అంశంపై పరిశీలన జరుపుతున్నారు.