డివైడర్‌ను ఢీకొన్న బైక్
అడ్డాకుల : గద్వాల పట్టణానికి చెందిన తెలుగు ప్రవీణ్‌కుమార్ (21) ప్రస్తుతం హైదరాబాద్‌లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఇటీవల వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో తల్లిదండ్రులతో గడపాలని ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం మళ్లీ కళాశాల మొదలు కావడంతో గద్వాలకు చెందిన స్నేహితులు మోయిజ్, ఎజాజ్‌తో కలిసి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలోని అడ్డాకుల మండలం జానంపేట మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రవీణ్‌కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి అటు నుంచి ఎస్వీఎస్కు తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ ముస్తాక్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో బాధిత తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.