ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం
నాచారం : హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఇంక్ తయారు చేసే ఓ కంపెనీలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.