inner clothes
-
అండర్‌వేర్‌తో మాజీమంత్రి ఆత్మహత్యాయత్నం!
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నవేళ.. రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హైయున్ అండర్‌వేర్‌తో ఆత్మహత్యాయత్నం చేశారు. విచారణ అధికారుల అదుపులో ఉన్న ఆయన.. కారాగారంలోనే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.కిమ్ యోంగ్ హైయున్.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు అత్యంత సన్నిహితుడు. సైనిక పాలన విధింపు ప్రకటన వెనుక ఈయన ప్రమేయమే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ అభియోగంపై ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సరిగ్గా అరెస్ట్‌కు ముందు బాత్రూంకు వెళ్లిన ఆయన.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అధికారులు తలుపులు బద్ధలు కొట్టి చూశారు.అండర్‌వేర్‌తో ఆయన ఉరివేసుకునే ప్రయత్నం చేయగా.. అధికారులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని న్యాయ శాఖ తాజాగా పార్లమెంట్‌కు నివేదించింది.South Korean ex-defense minister Kim Yong-hyun Wednesday attempted suicide at detention facility, Yonhap news agency reported, citing a correction official. #SouthKorea https://t.co/QbHxSw64PA https://t.co/3Mat8pNHh2— 贺亮 (@HeLiang74893) December 11, 2024సైనిక పాలనపై నిర్వహించిన ఓటింగ్‌కు చట్ట సభ్యులు హాజరుకాకుండా వాళ్ల మీదకు భద్రతా బలగాలను ప్రయోగించాడనే అభియోగమూ ఉంది.దక్షిణ కొరియా డిసెంబర్ 3వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హఠాత్తుగా టీవీ ఛానెల్స్ ముందు ప్రత్యక్షమై.. అత్యవసర సైనిక పాలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు దాయాది దేశం ఉత్తర కొరియాతో చేతులు కలిపి కుట్రలకు తెర తీశాయని, అందుకే పరిస్థితి అదుపు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే దేశంలో అలజడి రేగింది. మరోపక్క.. ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని చట్ట సభ్యులూ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సంక్షోభం తలెత్తే ప్రమాదంతో.. చేసేది లేక కొన్నిగంటల తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆయన దేశానికి క్షమాపణలు చెప్పారు.అయితే ఈ అంశంపై ప్రత్యేక మండలి విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం చట్ట సభ్యులంతా ఆ కౌన్సిల్‌కు అనుమతులు జారీ చేశారు. సైనిక పాలన విధింపు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది యూన్‌పై అభియోగం. అది గనుక రుజువైతే.. ఆయనకు మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: తప్పైంది.. నన్ను క్షమించండి -
Dr. Neelima Arya: ‘షి నీడ్స్’ నీలిమ!
ఉరుకుల పరుగుల జీవితంలో మన ప్రయాసలే కనిపిస్తాయి. ఒకసారి ఆగి చుట్టూ చూస్తే.. ఇన్నాళ్లూ మనం మన కోసమే తప్ప చుట్టూ ఉన్న వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే స్పృహ కలుగుతుంది. కొందరు మనకెందుకులే అని మళ్లీ తమ పనుల్లో మునిగిపోతారు. డాక్టర్ నీలిమా ఆర్య లాంటివాళ్లు మాత్రం సున్నితమైన సమస్యలపై దృష్టి పెట్టి వాటికి సరైన పరిష్కారాలు వెదుకుతారు. హైదరాబాద్ వాసి నీలిమా ఆర్య నిరుపేద అమ్మాయిలకు లో దుస్తులను అందిస్తూ, శుభ్రతపైన అవగాహన కల్గిస్తూ వారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఏడాదిలో రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నీలిమా ఆర్యను కలిసినప్పుడు ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘మా సొంతూరు బాపట్ల. అమ్మానాన్నలకు పెద్ద కూతురిని. ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ చేశాను. మా నాన్నగారు ఆర్మీ ఉద్యోగి కావడంతో నా చదువు అంతా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా భోపాల్‌లో జరిగింది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ పదేళ్లపాటు ఇంగ్లిష్ లెక్చరర్‌గా వర్క్ చేశాను. ఆ తర్వాత తిరిగి భోపాల్‌కి వెళ్లాను. అక్కడ నుంచి సౌదీ గవర్నమెంట్‌కు ఆంగ్ల ప్రొఫెసర్‌గా వర్క్ చేశాను. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి, మీడియా రంగంలో ఉండటంతో చాలా సామాజిక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే తపన అప్పుడే మొదలైంది. అమ్మానాన్నల దేశ సేవ స్ఫూర్తి కూడా నాలో ఉండటం అందుకు కారణమై ఉంటుంది. ► ఐదు ప్రాజెక్ట్స్‌తో సేవా రంగం ఐదేళ్ల క్రితం ఐదు ప్రాజెక్ట్స్‌తో ‘యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా’ ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీంట్లో భాగంగా ఎవరూ ఆకలితో పడుకోకూడదు అనే ఆలోచనతో మొదటిది ఫీడ్ ద నీడ్ ప్రాజెక్ట్ చేశాను. రోడ్‌సైడ్ ఫ్రిడ్జ్‌లను ఏర్పాటు చేసి, నిరుపేదలకు ఆహారం అందేలా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ‘షీ నీడ్’ ద్వారా ముఖ్యంగా గ్రామీణ అమ్మాయిలకు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేశాం. ‘మిషన్ భద్రత’ పేరుతో ఒక్కో సెట్లో ఆరు నాణ్యమైన ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన లో దుస్తులను ఉంచి, ఏడాది నుంచి నిరుపేద అమ్మాయిలకు అందజేస్తున్నాం. వచ్చే ఏడాది వరకు రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రముఖ డిజైనర్ రవిత మేయర్ ఈ లో దుస్తులను డిజైన్ చేస్తున్నారు. కొన్ని సేవాసంస్థల సహకారంతో ఇండియా మొత్తంలో ఎవరికి అవసరం ఉందో గుర్తించి, వారికి లో దుస్తులను అందజేస్తాం. వీటితర్వాత రైతులు, నిరుద్యోగులు, వయసుపైబడినవారి కోసం సాయం అందించాలనేది మా ఉద్దేశ్యం. ► లో దుస్తుల ప్రాముఖ్యత.. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని, వారికి అత్యవసరంగా కావాల్సినవి ఏమిటి అనే ఆలోచనలు ఎప్పుడూ చేస్తుంటాం. షీ నీడ్ ప్రాజెక్ట్ లో భాగంగా భవన నిర్మాణాలు జరిగే చోట, స్లమ్స్‌లలో, కూలీల పిల్లలను చూసినప్పుడు వారికి లో దుస్తుల సమస్య ఉన్నట్టు గుర్తించాం. 3 నుంచి 13 ఏళ్ల అమ్మాయిల వరకు లో దుస్తుల గురించి సరైన అవగాహన చేయగలిగితే వారిలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలం. అలాగే, శానిటరీ ప్యాడ్స్ వాడాలన్నా సరైన లో దుస్తులు ఉండాలి. నిజానికి గ్రామీణ అమ్మాయిలు, మహిళలకు సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్, లో దుస్తులు అందుబాటులో ఉండవు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని పదే పదే ఆ కుటుంబాలకు తెలియజేయడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ►సాధికారతలో భాగంగా.. ఆర్య రసోయి–క్లౌడ్ కిచెన్ ద్వారా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తున్నాను. ఎడ్యుకేటర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా, ఆంట్రప్రెన్యూర్‌గా, ఇద్దరు పిల్లల తల్లిగా నా బాధ్యతలు కొనసాగిస్తూనే సమాజానికి నా వంతు సహకారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగతున్నాను. ధనం కన్నా ముందు జీవితాన్ని క్రమశిక్షణాయుతంగా మలుచుకోవడంలోనే విజయం దాగుంది అని నమ్ముతాను. ఆ క్రమశిక్షణే నన్ను నడిపిస్తుందని నమ్ముతాను’ అని వివరించారు నీలిమా ఆర్య. – నిర్మలారెడ్డి -
NEET: లోదుస్తుల వివాదం.. బాధిత అమ్మాయిలకు మళ్లీ ‘నీట్’ పరీక్ష
న్యూఢిల్లీ: కేరళలో నీట్ పరీక్షకు హాజరైన సందర్భంగా ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థినులతో లోదుస్తులు విప్పించి.. ఆ తర్వాతే పరీక్ష రాయడానికి వెళ్లాలని సిబ్బంది ఆదేశించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద అవమానం ఎదుర్కొన్న బాధిత అమ్మాయిలు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది ఎన్టీఏ. వారికి సెప్టెంబరు 4న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి విద్యార్థినులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం చేరవేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 17న నీట్ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దాంతో అది పెను దుమారం రేపింది. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్‌లో గల మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు. విద్యార్థినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కళాశాల సిబ్బందిపై చర్యలకు డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై నిజ నిర్ధారణ కమిటీని నియమించింది ఎన్టీఏ. ఈ కేసులో కేరళ పోలీసులు తనిఖీలు చేపట్టిన ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: NEET Dress Code Controversy: ఇదంత ‘నీట్’ కాదేమో!? -
నీట్ రాయడానికి లోదుస్తులు విప్పించారు
పాలక్కడ్: వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌కు హాజరైనప్పుడు లోనికి అనుమతించే ముందు తన లోదుస్తులు విప్పించారని కేరళ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 6న కొప్పాలోని లయన్స్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. బాధితురాలితో పాటు మరికొందరు లోదుస్తుల్లో కూడా లోహపు భాగాలున్నాయంటూ వాటిని విప్పించటం వివాదాస్పదమైంది. పరీక్ష రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్ వ్యవహరించిన తీరు కూడా తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని ఆమె ఆరోపించింది. ‘ఇన్విజిలేటర్ చాలాసార్లు ఆమె ముందు నిలబడి ముఖాన్ని కాకుండా ఛాతీని చూస్తూ ఉన్నాడు. ఆమె ప్రశ్నా పత్రంతో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పరీక్ష రాయడం తనకు ఇబ్బందిగా మారింది’ అని బాధితురాలి సోదరి మీడియాకు వెల్లడించింది. కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని, ఇదే పాఠశాలలో పరీక్షకు హాజరైన ఇతర విద్యార్థులతో మాట్లాడుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి తరుణ్ కుమార్ చెప్పారు. దేశవ్యాప్తంగా మే 6న నీట్‌ను సీబీఎస్ఈ నిర్వహించింది. -
లో దుస్తుల్లో బంగారు తీగలు
శంషాబాద్‌లో ఓ వ్యక్తి నుంచి 467 గ్రాములు పట్టివేత మరో వ్యక్తి నుంచి 465 గ్రాముల ఆభరణాలు స్వాధీనం శంషాబాద్, న్యూస్‌లైన్: దుబాయ్ నుంచి లో దుస్తుల్లో బంగారు తీగలు తెచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 467 గ్రాముల బంగారు తీగలు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడు అనుమతి లేకుండా తీసుకొచ్చిన 465గ్రాముల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. కేరళకు చెందిన మహ్మద్ ఇక్బాల్(28) ఏఐ 952 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజీలో పన్నెండు బ్రాలు కనిపించడంతో వాటిని నిశితంగా పరిశీలించారు. వాటిల్లో 24 తెలుపు రంగు తీగలను గుర్తించారు. ఇక్బాల్ బంగారు తీగలకు వెండి పూత పూసి లో దుస్తుల్లో చొప్పించాడని గుర్తించారు. 467 గ్రాముల బరువున్న ఆ బంగారు తీగలను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే విమానంలో వచ్చిన షేక్ జలీల్ సుమారు 465 గ్రాముల బరువున్న ఆభరణాలను ధ రించాడు. వాటికి సంబంధించి అతడి వద్ద ఎలాంటి రశీదులు లేకపోవడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. రెండు ఘటనల్లో సుమారు రూ.28 లక్షలు విలువ చేసే 932 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.