న్యాయవిచారణ జరిపించాలి: సీపీఐ
సాక్షి, హైదరాబాద్ : హెచ్సీయూలో గత రెండురోజులుగా చోటుచేసుకున్న ఘటనలపై వెంటనే న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేసింది. వీసీ అప్పారావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని, అలాగే విద్యార్థులపై ఎలాంటి కేసులు వద్దని డిమాండ్ చేసింది. కొందరు కేంద్రమంత్రులు దళిత, బలహీనవర్గాల వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తింది.
సోమవారం 28 మంది విద్యార్థులపై అక్రమకేసులు పెట్టడాన్ని ఖండించింది. అప్పారావు వీసీ బాధ్యతలను చేపట్టి ఉండకపోతే ఈ ఘటనలు జరిగి ఉండే వి కావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.