Inspector Narender
-
12 గంటలపాటు ప్రశ్నల వర్షం!
హైదరాబాద్: పబ్ యజమానిని మామూళ్ళ కోసం పీడించి వేధించిన ఘటనలో ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిని శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 12 మంది సభ్యులతో కూడిన ఏసీబీ బృందం ప్రశి్నంచింది. పలు రికార్డులను, ఫోన్ కాల్, వాట్సాప్ రికార్డులు వారి ముందే పరిశీలించారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు ఏకధాటిగా వీరిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. తనను వేధిస్తున్నట్లు ఆరోపించిన బంజారాహిల్స్‌లోని రాక్ క్లబ్ పబ్ యజమానిని అర్ధరాత్రి ఒంటిగంటకు స్టేషన్‌కు పిలిపించారు. గత శనివారం పబ్ నుంచి తనను ఎలా తీసుకొచ్చింది, ఎలా నిర్బం«ధించింది పబ్ యజమాని లక్ష్మణ్ రావు ఏసీబీ అధికారులకు పూసగుచ్చినట్లుగా వివరించారు. అకారణంగా తనను పబ్‌నుంచి తీసుకొచ్చారని, అంతకు కొద్ది రోజుల ముందు నుంచే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చాటింగ్ వివరాలను ఆధారాలతో సహా ఏసీబీకి అందజేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్‌రెడ్డి వాట్సాప్ మెసేజ్‌లతో పాటు వాట్సాప్ కాల్స్ వివరాలను కూడా అధికారులు తెప్పించి..వారి ముందే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఈ ముగ్గురినీ ఏసీబీ కార్యాలయానికి తరలించి 41ఏ నోటీసులు అందజేశారు. ఈ నెల 9వ తేదీన తదుపరి విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించారు. అక్కడి నుంచే సీఐతో పాటు ఎస్ఐ క్యాబ్‌లు బుక్ చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మొదలైన పైరవీలు.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్‌పై ఏసీబీ ఆరోపణలు రావడంతో దాదాపు ఆయనను పదవి నుంచి తొలగించడం ఖాయంగా కనిపిస్తున్నది. అప్పుడే ఈ పోస్టు కోసం కొందరు సీఐలు పైరవీలు మొదలు పెట్టారు. సమర్ధుడైన అధికారిని రాజకీయాలతో సంబంధం లేకుండా పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రలోభాలతో స్టేషన్ పరువు ప్రతిష్టలు దిగజారుతున్నట్లుగా అధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతో పోస్టింగ్‌లు దక్కించుకుంటున్న సీఐలు తమను ఎవరూ ఏమి చేయలేరనే ధీమాతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో బంజారాహిల్స్ పోస్టింగ్ నేరుగా ఇవ్వాలని, రాజకీయ నాయకులకు తలొగ్గద్దని భావిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఇన్స్పెక్టర్లు ఇక్కడికి వచ్చేందుకు పోలీసు అధికారులతోనే పైరవీ చేస్తున్నట్లు సమాచారం. -
ఎన్నికల్లో అలాగే..!
సుబేదారి స్టేషన్ సీఐ తీరే వేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ వారికి స్వాగతం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సహకారం ఇప్పటికీ చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు వరంగల్ : గ్రేటర్ వరంగల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసుల కోసం బలవంతంగా వాహనాలను సేకరించిన సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేందర్ తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన నరేందర్ విషయంలో పోలీసులు ఉన్నతాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయన ఎన్నికల సమయాల్లో విధులు నిర్వహించే తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంటోంది. 2015 నవంబరులో జరిగిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ నేతలు నిబంధలను ఉల్లంఘించడానికి కారణమై విమర్శలపాలయ్యూరు. ఉప ఎన్నికల సమయంలో కలెక్టరేట్లో జరిగిన నామినేషన్ దాఖలు ప్రక్రియ శాంతిభద్రతలను సీఐ నరేందర్ పర్యవేక్షించారు. ఎన్నికల నియమావళి అమలయ్యేలా చూడాల్సిన నరేందర్.. గుంపుగా వచ్చిన కాంగ్రెస్ నేతలకు స్వాగతం చెప్పినంత పని చేశారు. అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశమైంది. సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా నవంబరు 2న నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు పొన్నాల లక్ష్మయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్, గండ్ర వెంకటరమణారెడ్డి, మరో 25 మంది నేతలతో కలిసి వచ్చి రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ఐదుగురు నేతలే వెళ్లినప్పటికీ మిగిలిన 25 మంది నేతలు కలెక్టరేట్ ఆవరణలోకి వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ మొదటి గేటు మూసి పెట్టినా ఈ నేతలంతా లోపలికి వెళ్లారు. కలెక్టరేట్ వద్ద విధులు నిర్వహించిన ఇన్స్పెక్టర్ నరేందర్ వీరిని నిరోధించకుండా అందరినీ నవ్వుతూ లోపలికి పంపించారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగియగానే ముఖ్యనేతలు బయటికి వచ్చారు. అందరూ ఒకేచోట గుంపుగా చేరడంతో ఏదో హడావుడి జరుగుతోందని గమనించిన అదనపు ఎన్నికల అధికారి (డీఆర్వో) శోభ బయటికి వచ్చారు. ఎక్కువ మంది నేతలు లోపలికి వచ్చిన విషయాన్ని గుర్తించారు. అక్కడ విధుల్లో ఉన్న సుబేదారి స్టేషన్ అధికారి నరేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి అమలు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియను అమలు చేసే కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు గురికావడం ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారింది. జిల్లా కలెక్టర్ వి.కరుణ వెంటనే ఈ సంఘటన పూర్వాపరాలను పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబుకు తెలియశేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సుబేదారి స్టేషన్ అధికారి నరేందర్ కారణంగానే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అదే అలుసుగా... వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేందుకు కారణమైనా ఎలాంటి చర్యా లేకపోవడంతో సుబేదారి సీఐ నరేందర్ తీరు మారలేదు. తాజా గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించారు. ఎన్నికల నిర్వహణ కోసం బలవంతంగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉపాధి కోసం రవాణా వాహనాలను నడిపే వారిపై జులుం ప్రదర్శించి ఎన్నికల విధులకు వీటిని వినియోగించుకున్నారు. దీనిపై విమర్శలు వచ్చినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.