ఫేస్బుక్ ఇన్స్టెంట్ గేమ్స్ లాంచ్
న్యూయార్క్: మొబైల్ గేమ్ ప్రేమికులకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ గుడ్ న్యూస్ అందించింది. తన మెసెంజర్ యాప్ లో మరో కొత్త ఫీచర్ ను జోడించింది. మెసెంజర్ వినియోగదారుల కోసం ఇన్స్టెంట్ గేమ్స్ ను బుధవారం లాంచ్ చేసింది. టెక్ క్రంచ్ అందించిన సమాచారం ఈ గేమింగ్ సదుపాయం 30 దేశాల్లో పరిచయం చేసింది. . బందాయ్ నామ్కో,కోనామీ, టయోటో్ లాంటి క్లాసిక్ డెవలపర్లు సహాయంతో 17 గేమ్స్ ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ గేమింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. మెసెంజర్ యాప్ లోని గేమ్ కంట్రోలర్ అనే బటన్ ప్రెస్ చేయాలి. స్క్రీన్ మీద టాప్ చేసిన తక్షణమే హెటీఎంల్ 5 లో ఈ గేమ్స్ ఓపెన్ అవుతాయి.