Institutional election
-
కాంగ్రెస్‌పై తేల్చిపడేసిన గులాం నబీ ఆజాద్
-
కాంగ్రెస్ విషయం తేల్చిపడేసిన ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్గత విభేదాలతో ఇబ్బందుల్లో పడిన కురువృద్ధ పార్టీ కాంగ్రెస్‌లో మార్పులు జరగాల్సిందేనని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకుంటే మరో 50 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన కమిటీలే లేవని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక జరగాలని ఈ సందర్భంగా ఆజాద్ స్పష్టం చేశారు. కాగా, పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఇది దురదృష్టకరం: కపిల్ సిబల్) వీరిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ల లేఖపై రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి వారు రాహుల్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ భేటీ దాదాపు ఏడు గంటలపాటు సాగింది. చివరకు అందరు నేతలు ఒకేమాటపైకి రావడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. దాంతో ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. (చదవండి: గాంధీలదే కాంగ్రెస్..!) -
గులాబీ పార్టీకి కొత్తరూపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కొత్తరూపును సంతరించుకోనుంది. ఆ పార్టీని తిరుగులేని రాజకీయశక్తిగా మార్చేందుకు కసరత్తు సాగుతోంది. టీఆర్ఎస్కు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్తరూపు తెచ్చేలా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్ఎస్ ఇప్పుడున్న దాని కంటే కీలకంగా పనిచేసేలా మార్పులు చేయా లని భావిస్తున్నారు. 2017 సంస్థాగత ఎన్నికల ప్రక్రి య సందర్భంగా రద్దయిన టీఆర్ఎస్ జిల్లా కమిటీల వ్యవస్థను మరో రూపంలో తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒక సమన్వయకర్తను నియమించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీ తరఫున అన్ని విషయాలను ప్రజలకు చేరవేసేలా జిల్లా సమన్వయకర్తలకు బాధ్యతలు అప్పగించనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కార్యాలయాలను నిర్మించాల ని నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ కార్యాలయాలే వేదికగా టీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్తలు పనిచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్ర మాలు, టీఆర్ఎస్ విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే కేంద్రాలుగా వాటిని తీర్చిదిద్దనున్నా రు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ వ్యవస్థ బలంగా ఉండేలా మార్పులు చేస్తున్నారు. టీఆర్ఎస్ నియమావళి ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్వహిం చాల్సి ఉంటుంది. 2017లో చివరిసారి టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరిగింది. మళ్లీ ప్రస్తుత ఏడాదిలో జరగనుంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రక్రియలో నే జిల్లా సమన్వయకర్తల నియామకం జరగనుంది. చివరగా టీఆర్ఎస్ వ్యవస్థాపక దినం(ఏప్రిల్ 27) రోజున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టా లని మొదట అనుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాతే వీటిని చేపట్టాలని భావిస్తున్నారు. రికార్డుస్థాయి సభ్యత్వం... రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సంస్థాగతంగా బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో అవసరమైన మేరకు పార్టీ సలహాలు ఉండేలా మార్పులు చేయనుంది. మొదటగా రికార్డుస్థాయి సభ్యత్వాలను నమోదు చేయాలని భావిస్తోంది. సభ్యత్వ నమోదు ప్రక్రియలో గతంలో జరిగిన పొరపాట్లకు ఈసారి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించింది. 2017లో నిర్వహించిన సభ్యత్వ నమోదు ప్రక్రియ ఒకింత గందరగోళంగా మారింది. అప్పుడు టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి 75 లక్షల సభ్యత్వాల మేరకు పుస్తకాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఇతర ముఖ్యనేతలు తీసుకెళ్లారు. 70 లక్షల సభ్యుల పేర్లను నమోదు చేసినట్లు కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపారు. అయితే, 43 లక్షల సభ్యత్వాలకు సంబంధించిన పుస్తకాలే టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరాయి. నియోజకవర్గాలకు తీసుకెళ్లిన సభ్యత్వ పుస్తకాలు తిరిగి రాకపోవడంతో ముందుగా అనుకున్న సభ్యత్వనమోదు లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించే సభ్యత్వ నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కేటీఆర్ భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. -
టార్గెట్ 2019
⇒టీఆర్ఎస్లో సంస్థాగత సందడి ⇒సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ ⇒త్వరలోనే కొత్త జిల్లాలకు అధ్యక్షులు ⇒ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సభ్యత్వం ⇒2015లో కంటే భారీగా నమోదు చేయాలని లక్ష్యం ⇒19న ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి.. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు రెండేళ్లకోసారి నిర్వహించే సంస్థాగత ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. పార్టీ సభ్యత్వ నమోదు 2015లో కంటే ఈసారి ఎక్కువగా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఈ ప్రక్రియను గురువారం మొదలు పెట్టింది. పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకుని సభ్యత్వ నమోదు నిర్వహిస్తోంది. కాగా, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈనెల 19న వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ్యత్వ నమోదు ప్రక్రియలో వేగం పెంచాలని పార్టీ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ప్రణాళికతో సభ్యత్వ నమోదును పూర్తి చేసే బాధ్యత ఎమ్మెల్యేలకు, ఇంచార్జీలకు అప్పగించారు. సభ్యత్వ నమోదుతో పాటే పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్లలో తేడా... ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి రాజకీయ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్లో రెండేళ్లకోసారి ఈ ప్రక్రియ జరుగుతుంది. 2015లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరిగింది. అప్పుడు ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఉండేది. వరంగల్ జిల్లాలో 5,42,194 మంది సభ్యత్వాలు స్వీకరించారు. ఇప్పుడు కూడా పాత జిల్లాలు యూనిట్‌గానే సభ్యత్వ నమోదు నిర్వహించనున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2014 ఎన్నికల్లో పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. 2014 చివరల్లో డోర్నకల్, పరకాల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. 2015 సభ్యత్వ నమోదు సమయంలో పది అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ వారే ఉండేవారు. ఆ తర్వాత 2016లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో 2015లో కంటే సభ్యత్వ నమోదును పెంచాలని టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యేలను ఆదేశించింది. రుసుము భారం ఎమ్మెల్యేలపైనేనా... 2015లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది సభ్యత్వం స్వీకరించారు. ఈసారి కొంత వింత పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నామినేటెడ్ పదవులను పూర్తిగా భర్తీ చేయ కపోవడం... రెండేళ్లుగా పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీ లేకపోవడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఈసారి సభ్యత్వ నమోదు విష యంలో గ్రామ, మండల స్థాయిలో స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. సభ్యత్వ నమోదు రుసుమును ఎమ్మెల్యేలే పూర్తిగా భరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ అధిష్టానం సభ్యత్వ రుసుములను పెంచింది. గతంలో రూ.10 ఉన్న సాధారణ సభ్యత్వ రుసుము రూ.30కి పెంచారు. క్రియాశీల సభ్యత్వ రుసుము రూ.50 నుంచి రూ.100కు పెంచారు. 19న ప్రారంభం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కీలకమైన సభ్యత్వ నమోదు విషయంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఎప్పుడూ ముందుండేది. ఇప్పుడూ అలాగే ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మార్చి 19న వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను లాంఛనంగా ప్రారం భిస్తారు. 2015లో కంటే ఎక్కువగానే సభ్యత్వ నమోదు జరిగేలా ప్రణాళిక చేశాం. అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ఊపందుకోనుంది. – తక్కళ్లపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు -
ఇప్పట్లో లేనట్లే..
ఏప్రిల్‌లోనే టీఆర్ఎస్ కమిటీల ప్రకటన ఆశగా ఎదురు చూస్తున్న గులాబీ నేతలు సంస్థాగత ఎన్నికల తర్వాతే పదవులు వరంగల్ : అధికార టీఆర్ఎస్లో పార్టీ పదవుల పందేరం ఇప్పట్లో లేదని తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో జరిగే సంస్థాగత ఎన్నికల తర్వాతే అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ కొత్త కమిటీలు ఏర్పాటు చేసేలా టీఆర్ఎస్ అధిష్టానం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాలు ఏర్పాటైన రోజునే పార్టీ కమిటీలను నియమించాలని టీఆర్ఎస్ అధిష్టానం తొలుత భావించింది. జిల్లా కమిటీలతోపాటే రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీంతో పార్టీ పదవులను ఆశిస్తున్న గులాబీ నేతలు తమకు అవకాశాలు వస్తాయని భావించారు. అధికార పార్టీలో పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో కమిటీల ప్రకటన అంశం తాత్కాలికంగా వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఆ తర్వాత ఈ అంశం పూర్తిగా పక్కకు పోయింది. ఇలాంటి పరిస్థితిలో టీఆర్ఎస్ అధిష్టానం కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రతి రెండేళ్లకోసారి ఏప్రిల్‌లో జరుగుతుంది. 2015లో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసింది. భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగింది. అదే ఏడాది ఏప్రిల్‌లో జిల్లా కమిటీ ఎన్నికలు జరిగాయి. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్రావు, అర్బన్ కమిటీ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఎన్నికయ్యారు. కేవలం అధ్యక్షుల ఎన్నికతోనే కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయింది.