టీఆర్ఎస్తోనే బంగారు తెలంగాణ సాధ్యం
పాలకుర్తి టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన టీఆర్ఎస్తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది.. కేసీఆర్‌తోనే బంగారు తెలంగా ణ కల సాకారమవుతుందని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు నామినేషన్ వేసే సందర్భా న్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీహరి మాట్లాడారు. కేసీఆర్ పోరా టం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు.
చంద్రబాబు అడుగులకు ముడగులొత్తుతున్న తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్‌రావును పాల కుర్తి సోమన్న సాక్షిగా డిపాడిట్ రాకుండా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1969, 2004లో జరిగిన ఉద్యమంలో 1200 మంది అమరుల ఆత్మబాలిదానాలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే పొన్నాల లక్ష్మయ్య అమెరికా పారిపోయాడని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పునర్మిర్మాణంతో పాటు జిల్లా, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
నా హయాంలోనే అభివృద్ధి జరిగింది : సుధాకర్‌రావు
నియోజకవర్గంలో తన హయంలోనే అభివృద్ధి జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఎన్.సుధాకర్‌రావు అన్నారు. తన తండ్రి యతి రాజారావు, తల్లి విమలాదేవి 40 ఏళ్లు ప్రజలకు సేవా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ద్రోహులకు పాలకుర్తిలో స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి, దుగ్యాలను డిపాటిట్ రాకుండా ఓడించి నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాల ని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేగా తనను, ఎంపీ గా కడియం శ్రీహరిని గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. సమావేశంలో నియోజకవర్గం లోని అన్ని మండలాల జెడ్పీటీసీ అభ్యర్థులు, మాడ్గుల నట్వర్, దైద ప్రియాంక, చిలుక దేవేంద్ర, జాటోతు కమలాకర్, చిర్ర ఉపేంద్ర, అల్లంనేని కమలాకర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ముస్కు రాంబాబు, మూల వెంకటేశ్వర్లు, మొల్గూరి రమేష్, పాలకుర్తి యాదగిరి రావు, కేతిరెడ్డి సోమనర్సింహారెడ్డి, తాళ్లపెల్లి నర్సయ్య, పుస్కూరి శ్రీనివాస్‌రావు, ఎండీ.అప్రోజ్, ముత్తినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.