ఖైరున్నిసాపై కరుణ చూపరూ
శంషాబాద్: ప్రేమగా అమ్మ చక్కెరను నోట్లో పోయదు... మారాం చేసినా నాన్న చాక్లెట్ కూడా కొనివ్వడు.. ఎందుకో ఆ చిన్నారికి అర్థం కాదు...? తల్లిదండ్రులు తనపై ఎందుకంత కఠినంగా ఉంటున్నారో ఆ పాపకు తెలియదు. ఐదేళ్లు నిండక ముందే తీపి తినే అదృష్టానికి తాను దూరమైందని చెప్పినా అర్థం చేసుకునే వయసు ఆ చిన్నారికి లేదు.
కడుపు నింపుకోడానికే కష్టాల కడలి ఈదుతున్న ఆ కుటుంబానికి తియ్యని నవ్వులు పూయించే పాపకు వచ్చిన కష్టం వారిని కుంగదీస్తోంది. శంషాబాద్‌లోని అహ్మద్‌నగర్‌లోని అద్దెగదిలో నివాసముండే షేక్ షానూర్ పట్టణంలో విధుల్లో తిరుగుతూ చాయ్‌లు అమ్ముతూ జీవిస్తున్నాడు. ఆయన భార్య రేష్మా సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది.
ఏడాదిన్నర కిందట తమ చిన్నకూతురు ఖైరున్నీసా అతిమూత్ర విసర్జనతో పాటు తరచూ సొమ్మసిల్లి పడిపోతుండడంతో పరీక్షలు చేయించారు. చిన్నారికి మధుమేహం 400 పైగా ఉందని తేలింది.
తక్షణ వైద్యసేవల కోసం వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నెలరోజుల పాటు కోమాలోకి వెళ్లిన పాపకు అక్కడి వైద్యులు చికిత్సలు నిర్వహించి ఎట్టకేలకు మాములు స్థితికి తీసుకొచ్చారు.
తప్పని కష్టాలు...
పాపకు మధుమేహం తీవ్రత ఉన్న కారణంగా రోజూ మూడుసార్లు తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజ„క్షన్లు ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. అప్పటి నుంచి పాపకు రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇన్సులిన్ వాడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎక్కడా ఇన్సులిన్‌ను ఉచితంగా ఇవ్వకపోవడంతో ప్రైవేటుగానే కొనుగోలు చేయాల్సిన దుస్థితి.
దీంతో పొట్టనింపుకోలేని ఆ కుటుంబానికి చిన్నారి వైద్య ఖర్చులు మరింత భారంగా మారిపోయాయి. ఇప్పటికే సుమారు రూ.2 లక్షలకు పైగా అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయారు. ఆర్థిక భారం భరించలేక పెద్దకుమారుడు, కుమార్తెను రాజేంద్రనగర్‌లోని చింతల్మెట్లో బంధువుల వద్ద ఉంచి చదివిస్తున్నారు.
ఒకపక్క పాప పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే జీవనోపాధి కోసం పరుగులు పెడుతున్న ఆ కుటుంబం ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తోంది. పాపకు నిరంతర వైద్యం అందించేందుకు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
వైద్యం చేయించలేని దుస్థితి..
మా పాపకు మా శాయశక్తులా అప్పులు చేసి వైద్య చేయిస్తున్నాం. ఏడాదిన్నర నుంచి రో జూ ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడుతున్నాం. జీవి తాంతం పాపకు మందులు, సూదులు ఇవ్వా లని డాక్టర్లు చెప్పారు. ఇన్సులిన్ ఇవ్వడంలో ఆలస్యం జరిగితే సొమ్మసిల్లి పడిపోతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయాం. రో జూ వీధుల్లో చాయ్ అమ్ముకుంటూ జీవిం చే నాకు పాప వైద్యం భారంగా మారు తోంది. దాతలు ఎవరైనా ఆర్థిక చేయూ తనిచ్చి ఆ దుకోవాలని వేడుకుంటున్నా. – షేక్ షానూర్, పాప తండ్రి
పాపకు ఆర్థిక సాయం చేయదలుచుకుంటే....
చిన్నారి షేక్ ఖైరున్నిసా, తండ్రి షేక్ షానూర్ (జాయింట్ అకౌంట్ ) అకౌంట్ నం: 3601397468 శంషాబాద్, బ్రాంచ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా