Inter online admissions
-
యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారు?
-
విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం..
-
విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం..
సాక్షి, అమరావతి: విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు. యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు. 40 శాతం మంది యాజమాన్యాలకు చెల్లించట్లేదనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ‘‘కొన్ని కళాశాలల్లో పీఆర్వో వ్యవస్థ విద్యాదీవెన కోసమే అడ్మిషన్లు చేస్తున్నాయి. 75 శాతం అటెండెన్స్ లేకపోతే రెండో విడత రాదు. గతంలో ఇంటర్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించలేదు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్లైన్ విధానం. డిగ్రీ అడ్మిషన్లలో ఆన్లైన్ విధానం విజయవంతమైందని’’ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇవీ చదవండి: టీడీపీ నేతల సహకారం.. అగ్రిగోల్డ్ భూములు హాంఫట్! ఎచ్చెర్ల టీడీపీ ‘కళా’విహీనం..! -
ఏదైనా చట్టప్రకారమే చేయాలి
సాక్షి, అమరావతి: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల విషయంలో ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడి మాత్రమే చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం ఎలాంటి నిబంధనలు రూపొందించకుండా ఆన్లైన్ ప్రవేశాలను ఎలా చేపడతారంటూ ఇంటర్మీడియట్ బోర్డును, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్మీడియట్లో ప్రవేశాల నిమిత్తం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియట్ స్ట్రీం (ఏపీవోఏఎస్ఐఎస్)ను సవాలు చేస్తూ సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ జయసూర్య విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనలు రూపొందించకుండా కేవలం పత్రికా ప్రకటన ద్వారా ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని తీసుకురావడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇంటర్ బోర్డు చర్య ఏకపక్షమన్నారు. గత ఏడాది కూడా ఇలాగే ప్రెస్‌నోట్ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు చేసిన ప్రయత్నాలను హైకోర్టు తప్పుపట్టిందని వివరించారు. నిబంధనల ప్రకారం కాకుండా ప్రెస్‌నోట్ ద్వారా ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టడం సరికాదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆన్లైన్ ప్రవేశాలపై స్టే విధించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే జోక్యం చేసుకుంటూ.. విద్యార్థుల ప్రయోజనం కోసమే ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టామని తెలిపారు. ఈ విధానం ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని స్పష్టం చేశారు. తమ ఉద్దేశం కూడా అదేనని, చట్ట విరుద్ధంగా ఎలాంటి చర్యలు ఉండవని దుష్యంత్ దవే తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ దవే అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. ఇదే అంశంపై పదవ తరగతి పాసైన విద్యార్థులు కొందరు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా విచారణను న్యాయమూర్తి ఆ రోజుకే వాయిదా వేశారు. -
ఆన్లైన్ ప్రవేశాలు జరిగేనా?
- ఉన్నతాధికారులపై కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిళ్లు! - ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలను ఈసారి ఆన్లైన్లో చేపడతారా? లేదా? అన్న దానిపై గందరగోళం నెలకొంది. కార్పొరేట్ నియంత్రణకు ఆన్ లైన్ ప్రవేశాలను చేపడతామని సాక్షాత్తూ అసెంబ్లీలోనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేసిన ప్రకటన ఆచరణకు నోచుకునే స్థితి కనిపించడం లేదు. ఆన్లైన్ ప్రవేశాలు వద్దంటూ ఇప్పటికే కార్పొరేట్ వర్గాలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అందుకే దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వానికి వెళ్లి నెల రోజులు అవుతున్నా దానిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట పడేదెలా? ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫీజు రూ.1,760, ద్వితీయ సంవత్సర విద్యార్థుల ఫీజు రూ. 1940. కానీ పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు ఏటా రూ.35 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఇంటర్మీడియెట్ ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఎంసెట్, జేఈఈ కోచింగ్‌లు, ప్రత్యేక ఐఐటీ–ఇంటర్మీడియెట్ క్యాంపస్‌ల పేరుతో ఈ వసూళ్లు చేస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు రావాలన్న తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా దండు కుంటున్నాయి. తాము చెప్పిందే ఫీజు, చేసేదే విధానం అన్న ధోరణితో వ్యవహరిస్తూ చివరకు ఇంటర్ బోర్డును కూడా మోసం చేస్తున్నాయి. ఒక కాలేజీ పేరుతో అనుమతులు తీసుకొని ఐదారు బ్రాంచీలను కొనసాగిస్తున్నాయి. వాటిని బోర్డు గుర్తించినా, ఒక్క కాలేజీపై కూడా మూసివేత వంటి చర్యలు చేపట్టలేకపోయింది. ఆన్లైన్ విధానం వస్తే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని, కార్పొరేట్ కాలేజీలను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావచ్చని ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు భావించారు. కానీ ఒత్తిళ్ల కారణంగానే నిర్ణయం ఆగిపోయినట్లు తెలిసింది. తాత్సారం ఎందుకో చెప్పాలి ఆన్లైన్ ప్రవేశాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు అందరం స్వాగతించాం.ఇప్పుడు ఏ కారణంతో వెనక్కుపోతుందో అర్ధం కావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఈ విధానం విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు