inter supplementary results
-
నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. మే 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరయ్యారు.సప్లి ఫలితాల కోసం క్లిక్ చేయండివోకేషనల్ సప్లి రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండిఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. -
TS: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియేట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం వెల్లడిస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాల్ని విడుదల చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్ డాట్.కామ్‌లో చూడవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. education.sakshi.com -
ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వెల్లడి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఇవాళ(మంగళవారం, జూన్ 13) వచ్చేశాయ్. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌కు సంబంధించి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ ఫలితాల్ని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు రిలీజ్ చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/వొకేషనల్ సప్లిమెంటరీ-ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 4 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in/ క్లిక్ చేస్తే సరిపోతుంది. -
Andhra Pradesh: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్.వి. శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు నిర్వహించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్‌లో 35 శాతం, ఒకేషనల్‌లో 42 శాతం.. ఇంటర్ సెకండియర్‌లో జనరల్‌లో 33 శాతం, ఒకేషనల్‌లో 46 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫలితాలను ఎడ్యుకేషన్.సాక్షి.కామ్‌లో చూడండి. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్లివే.. ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి (జనరల్) ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్) ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి (జనరల్) ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్) -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో ఇంటర్మీడియెట్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు. అయితే ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్ ఫెయిల్ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు..? ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఉన్నత విద్యామండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ 6న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కారణంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం సమావేశమైన అధికారిక నిర్ణయం తీసుకునే వీలుంది. -
ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం విడుదల చేశారు. 60 కేంద్రాల్లో 14,676 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 9,382 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలలో 53.12శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 14,077 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 7,478మంది పాసయ్యారు. పదో తరగతి ఫలితాల్లో గుంటూరు జిల్లా 88శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలవగా వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక ఇంటర్ ఫలితాల్లో 71.96 శాతంతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జవాబు పత్రాల పునఃపరీశీలన, డూప్లికేట్ సర్టిపికేట్లు పొందే సదుపాయం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కమిటీ కల్పిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వీటికి నిర్ణీత రుసుం ద్వారా ఏపీ అన్ లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. 9.8.2019 నుంచి 20.08.19 వరకు ఫీజ్ చెల్లింపులకు చివరి తేదీగా పేర్కొన్నారు. పూర్తి వివరాలు www.apopenschool.org లో చూడవచ్చు. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్లో 66.09, సెకండ్ ఇయర్లో 76.64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జూన్ 16వ తేదీ రీ కౌంటింగ్‌కు చివరి తేదీ. రాష్ట్రవ్యాప్తంగా మే 15 నుంచి 22 వరకు జరిగిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి bietelangana.cgg.gov.in వెబ్సైట్ నుంచి కాలేజీల వారీ ఫలితాలను పొందవచ్చు. గత నెల 15 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి సంవత్సరం 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరం 1,51,648 మంది విద్యార్థులు ఉన్నారు. -
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు
హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. బాలికలు 74.81 శాతంతో, బాలురు 70.93 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 72.73, తెలంగాణలో 65.82 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 56.9 శాతం, తెలంగాణలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.