హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్‌లో 66.09, సెకండ్ ఇయర్‌లో 76.64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జూన్ 16వ తేదీ రీ కౌంటింగ్‌కు చివరి తేదీ. రాష్ట్రవ్యాప్తంగా మే 15 నుంచి 22 వరకు జరిగిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి bietelangana.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి కాలేజీల వారీ ఫలితాలను పొందవచ్చు. గత నెల 15 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి సంవత్సరం 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరం 1,51,648 మంది విద్యార్థులు ఉన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
Published Fri, Jun 9 2017 11:53 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
Advertisement