Ranjiv R. Acharya
-
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్లో 66.09, సెకండ్ ఇయర్లో 76.64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. జూన్ 16వ తేదీ రీ కౌంటింగ్‌కు చివరి తేదీ. రాష్ట్రవ్యాప్తంగా మే 15 నుంచి 22 వరకు జరిగిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి bietelangana.cgg.gov.in వెబ్సైట్ నుంచి కాలేజీల వారీ ఫలితాలను పొందవచ్చు. గత నెల 15 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి సంవత్సరం 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరం 1,51,648 మంది విద్యార్థులు ఉన్నారు. -
నేడు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం(నేడు) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు. ఫలితాలను www.sakshi education.com, sakshi.com, bietelangana.cgg.gov.in, tsbie. cgg.gov.in, bie.telangana.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. జూని యర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి bietelangana.cgg.gov.in వెబ్సైట్ నుంచి కాలేజీల వారీ ఫలితాలను పొందవచ్చు. గత నెల 15 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి సంవత్సరం 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరం 1,51,648 మంది విద్యార్థులు ఉన్నారు. -
ఆన్లైన్లోనే డీఈఈసెట్!
♦ పాఠశాల విద్యా కమిషనరే కన్వీనర్ ♦ నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ జారీకి అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రైవేటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష డీఈఈసెట్–2017కు ప్రభుత్వం కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు 2017–18 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం జీవో 10 జారీ చేశారు. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి డీఈఈసెట్‌ను (డైట్‌సెట్) ఆన్లైన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యా కమిషనర్‌ను డీఈఈసెట్ కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టినందున, స్వయంగా కమిషనర్ పర్యవేక్షణలో నిర్వహించేలా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డీఈఈసెట్‌కు కమిషనర్ చైర్మన్‌గా, అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి కన్వీనర్‌గా వ్యవహరించేవారు. ఆ నిబంధనను ప్రస్తుతం ప్రభుత్వం మార్చింది. కొత్త జిల్లాలు పాత డైట్ల పరిధిలోకే.. కొత్తగా ఏర్పడిన జిల్లాలు కూడా గతంలో ఉన్న పాత జిల్లాల్లోని డైట్ల పరిధిలోకే వస్తాయి. పాత జిల్లాల్లోని డైట్లే హెల్ప్‌లైన్ కేంద్రాలుగా ఉంటాయని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా అందులోనే ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలలో డీఎడ్ కోర్సును నిర్వహిస్తారు. మే 10లోగా డీఎడ్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం విద్యా శాఖను ఆదేశించింది. ప్రవేశాలను జూన్‌లోగా పూర్తి చేసి, జులై 1 నుంచి తరగతులను ప్రారంభిస్తారు. విద్యార్హతలు, రిజర్వేషన్లు గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఇదీ సీట్ల భర్తీ విధానం హా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను సింగిల్ విండో–1 ద్వారా భర్తీ చేస్తారు. ప్రభుత్వ డైట్లలో 100 శాతం సీట్లను, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లోని 80 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. హా సింగిల్ విండో–2 ద్వారా మైనారిటీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. విద్యా శాఖ నిర్వహించే డీఈఈసెట్‌తో వీటికి సంబంధం ఉండదు. మైనారిటీ విద్యా సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి డీఈఈసెట్–ఏసీ పేరుతో నోటిఫికేషన్ జారీ చేయాలి. కన్వీనర్ కోటాలోని 80 శాతం సీట్లను 100 శాతంగా పరిగణనలోకి తీసుకొని అందులో 70 శాతం సీట్లను మైనారిటీ విద్యార్థులతో భర్తీ చేయాలి. మిగితా 30 శాతం సీట్లను డీఈఈసెట్లో అర్హత సాధించిన నాన్ మైనారిటీ విద్యార్థులతో భర్తీ చేయాలి. సీట్లు మిగిలితే రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలి. -
కొత్త విద్యా సంవత్సరంపై పునరాలోచన
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరాన్ని మార్చి 21న ప్రారంభించిన ప్రభుత్వం మళ్లీ పునరాలోచనలో పడింది. జూన్ నుంచే దీన్ని కొనసాగించాలని యాజమాన్యాల నుంచి డిమాండ్లు వస్తుం డగా, కొంత మంది జిల్లా కలెక్టర్లు కూడా ముందస్తు ప్రారంభం వల్ల ప్రయోజనం ఉండబోదని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 3న ప్రారంభించిన బడిబాట కార్యక్రమంపై గురువారం విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్షిక పరీక్షలు ముగిసినం దున చాలా మంది పిల్లలు స్కూళ్లకు రావట్లేదని, టీచర్లు కూడా ఏప్రిల్ 3 నుంచి టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ విధులకు వెళ్లారని పలువురు కలెక్టర్లు పేర్కొన్నారు. మిగతా టీచర్లు బడిబాటలో పాల్గొం టున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులకు బోధన జరగట్లేదని చెప్పారు. దీనిపై రంజీవ్ ఆర్ ఆచార్య స్పందిస్తూ దీనిపై సమీక్షిస్తామన్నారు. ఈసారి ప్రయోగాత్మకం గా మార్చి 21 నుంచే సీబీఎస్ఈ తరహాలో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పుస్తకాలు, యూనిఫారాలు కూడా ఇచ్చామన్నారు. ఈనెల 23 తర్వాత పాఠశాలకు వేసవి సెలవులిస్తే జూన్ వరకు అంగన్వాడీ విద్యార్థులకు భోజనం ఎవరు పెట్టాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్లు కోరారు. ఐదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభిస్తున్నందున ఐదో తరగతి పూర్తయిన వారు ఆరో తరగతిలో చేరేందుకు సరిపడ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు లేవని, వారి పరిస్థితి ఏంటని వారు వివరణ కోరారు. దీంతో 6వ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రంజీవ్ ఆర్ ఆచార్య వివరించారు. సమావేశంలో పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, సర్వ శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ప్రతిభ అమోఘం
విజయనగర్ కాలనీ: ప్రభుత్వ కళాశాలలు విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేసే దేవాలయాలని రాష్ట్ర ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యా కమిషనరేట్ ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యారు్థల కోసం చేపట్టిన యువతరంగం –2016లో అతు్యత్తమ ప్రతిభ కనబర్చిన విద్యారు్థలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం మాసబ్‌ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ ఏఎఫ్ఏయూ) ప్రాంగణంలోని ఆడిటోరియం హాల్లో సోమవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి రాజీవ్ ఆర్ ఆచార్య ముఖ్య అతిధిగా హాజరయా్యరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... విద్యారు్థలలో అంతర్లీనంగా ఉండే ప్రతిభాపాటవాలను గుర్తించేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. కాలేజేట్ అండ్ టెక్నిక్ ఎడు్యకేషన్ కమిషనర్ ఎ. వాణిప్రసాద్ మాట్లాడుతూ ఉన్నత విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యారు్థలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జేఎన్ ఎఫ్ఏయూ వీసి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ . కవితాదరియాణిరావు, కాకతీయ యూనివర్సిటీ వీసి డాక్టర్ సాయన్న, మహాత్మగాంధీ యూనివర్సిటీ వీసి డాక్టర్ ఖాజాఅల్తాఫ్ హుసేన్, పాలమూర్ యూనివర్సిటీ వీసి డాక్టర్ రాజరత్నంలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, ఉపన్యాసకులు, విద్యారు్థలు పాల్గొన్నారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
* ప్రథమ సంవత్సరంలో 66%, ‘ద్వితీయ’లో 41% ఉత్తీర్ణత * రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 30 వరకు దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 4,72,441 మంది విద్యార్థులు హాజరు కాగా.. 2,69,862 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెమోలను ఈ నెల 29లోగా సంబంధిత రీజినల్ ఇన్స్పెక్షన్ అధికారుల నుంచి ప్రిన్సిపాళ్లు తీసుకె ళ్లాలని రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. ఆ మెమోలను వీలైనంత త్వరగా విద్యార్థులకు అందజేయాలని, మెమోల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే విద్యార్థులు జూలై 23లోగా సంబంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని సూచించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం విద్యార్థులు ఈ నెల 30లోగా ఫీజు చెల్లించి, tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. బాలికల ఉత్తీర్ణతే అత్యధికం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ పరీక్షలకు 3,02,340 మంది విద్యార్థులు హాజరుకాగా 1,99,139(66%) మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 1,44,475 మంది కాగా, 1,02,375(71%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,57,865 మంది పరీక్షలకు హాజరు కాగా 96,764(61%) మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 1,50,609 మంది హాజరు కాగా 61,438(41%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 60,985 మంది హాజరు కాగా 27,667(45%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 89,624 మంది పరీక్షలు రాయగా 33,771(38%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలకు 11,419 మంది హాజరు కాగా 5,152(45%) మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ ఒకేషనల్ పరీక్షలకు 8,073 మంది హాజరు కాగా 4,133(51%) మంది ఉత్తీర్ణులయ్యారు. వార్షిక పరీక్షలతో కలిపితే.. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణతతో ప్రస్తుత ఉత్తీర్ణతను కలిపి చూస్తే ప్రథమ సంవత్సరం జనరల్‌లో మొత్తం 2,83,560 (67.48%) మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 3,06,907(78.71%) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో ఇంప్రూవ్మెంట్ రాసేందుకు హాజరైన వారే ఎక్కువ మంది. ఇంటర్ విద్యలో సంస్కరణలు: రంజీవ్ ఆర్ ఆచార్య ఇంటర్ విద్యలో, పరీక్షలు, బోర్డు సేవల్లో అనేక సంస్కరణలు తేవడంతోపాటు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు రంజీవ్ ఆర్ ఆచార్య వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా 798 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటిసారిగా ప్రాక్టికల్ మార్కులను ఆన్లైన్ ద్వారా బోర్డుకు తెప్పించామన్నారు. ఎగ్జామినర్ పరీక్ష హాల్లో మార్కులు వేసిన వెంటనే బోర్డుకు ఆన్లైన్ ద్వారా వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. పరీక్షలకు గైర్హాజరైన వారి వివరాలు కూడా ఆన్లైన్లో పరీక్ష కేంద్రం నుంచి బోర్డుకు తెప్పించామన్నారు. 12 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.