విజయనగర్ కాలనీ: ప్రభుత్వ కళాశాలలు విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేసే దేవాలయాలని రాష్ట్ర ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యా కమిషనరేట్ ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యారు్థల కోసం చేపట్టిన యువతరంగం –2016లో అతు్యత్తమ ప్రతిభ కనబర్చిన విద్యారు్థలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం మాసబ్‌ట్యాంక్ జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ ఏఎఫ్‌ఏయూ) ప్రాంగణంలోని ఆడిటోరియం హాల్‌లో సోమవారం నిర్వహించారు.
ఈకార్యక్రమానికి రాజీవ్ ఆర్ ఆచార్య ముఖ్య అతిధిగా హాజరయా్యరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... విద్యారు్థలలో అంతర్లీనంగా ఉండే ప్రతిభాపాటవాలను గుర్తించేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. కాలేజేట్ అండ్ టెక్నిక్ ఎడు్యకేషన్ కమిషనర్ ఎ. వాణిప్రసాద్ మాట్లాడుతూ ఉన్నత విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యారు్థలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జేఎన్ ఎఫ్‌ఏయూ వీసి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ . కవితాదరియాణిరావు, కాకతీయ యూనివర్సిటీ వీసి డాక్టర్ సాయన్న, మహాత్మగాంధీ యూనివర్సిటీ వీసి డాక్టర్ ఖాజాఅల్తాఫ్ హుసేన్, పాలమూర్ యూనివర్సిటీ వీసి డాక్టర్ రాజరత్నంలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, ఉపన్యాసకులు, విద్యారు్థలు పాల్గొన్నారు.