నేడు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం(నేడు) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేస్తారని చెప్పారు.
ఫలితాలను www.sakshi education.com, sakshi.com, bietelangana.cgg.gov.in, tsbie. cgg.gov.in, bie.telangana.gov.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు. జూని యర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి bietelangana.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి కాలేజీల వారీ ఫలితాలను పొందవచ్చు. గత నెల 15 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి సంవత్సరం 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరం 1,51,648 మంది విద్యార్థులు ఉన్నారు.