Interestingly
-
ఈసారైనా..
పూడికతీత పనులు ఏటా తూతూమంత్రంగానే.. కాంట్రాక్టర్లకు ‘మేత’ ఈసారి పక్కా కార్యాచరణ పనులకు సిద్ధమవుతున్న యంత్రాంగం 25న టెండర్లు.. మార్చి ఆఖరులోగా పనులు పూర్తి సాక్షి, సిటీబ్యూరో: పూడికతీత.. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాల్లో ఈ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఇదో గొప్ప ఆదాయ మార్గం. చేయని పనులు చేసినట్లు చెబుతూ ఏటా రూ. కోట్లు కాజేస్తున్నారు. అధికారులదీ అదే వరస. దీంతో వర్షాకాలంలో వాననీరు సాఫీగా వెళ్లేందుకు ఈ పనులు చేపడుతున్నా.. ఎక్కడి పూడిక అక్కడే పేరుకుపోయి వరదనీరు వెళ్లట్లేదు. ఏటా వానా కాలంలో నగరవాసులు నరకం చూస్తున్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయకపోవడం, సీజన్లో చేతులెత్తేయడం షరా మామూలుగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఈసారి మాత్రం నాలాల్లో పూడికతీత పనుల్ని పక్కాగా చేపట్టడానికి సిద్ధమవుతోంది. పకడ్బందీ చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెబుతున్నారు. ఆ మేరకు నిర్ణీత వ్యవధిలో.. వేసవిలోనే పూడికతీత పనులు పూర్తవుతాయంటున్నారు. ఈ క్రమంలో నిర్ణీత వ్యవధిలో ఈ పనులు జరుగుతాయా.. లేక గత అనుభవమే చర్విత చరణం కానుందా అనేది రెండు నెలల్లో తేలనుంది. ఏటా ఇదీ తంతు.. నిజానికి వేసవిలోనే నాలాల్లో డీసిల్టింగ్ (పూడికతీత) పనులు జరగాల్సి ఉన్నప్పటికీ, సకాలంలో చేయట్లేదు. తీరా వర్షాలు మొదలయ్యాక పనులు చేస్తున్నారు. వర్షాల వల్ల పూడికతీత పూర్తిగా చేయకుండా మమ అనిపించి కాంట్రాక్టర్లు బిల్లులు కాజేస్తున్నారు. వారికి వత్తాసునిస్తూ అధికారులు సైతం అందినకాడికి దండుకుంటున్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పి వేసవిలోనే పూడికతీత పనులు పూర్తిచేయాల్సిందిగా కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆదేశించడంతోపాటు, కార్యాచరణకు సమయాన్ని కూడా సూచించడంతో.. వేసవిలోనే ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈనెల 25న టెండర్లు పిలిచి, టెండరు పొందిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకంంటున్నారు. దీంతోపాటు.. పనులు చేయకుండానే.. చేసినట్లు చూపి బిల్లులు కాజేయకుండా ఉండేందుకు , పనులు పారదర్శకంగా ఉండేందుకు తగు నిబంధనలు రూపొందించారు. ఇదీ కార్యాచరణ.. ఈ ఏడాది మొత్తం 297 పనులు చేయాలని నిర్ణయించారు రూ. 21.18 కోట్లు మంజూరు చేశారు ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఏరియాసభ, వార్డు కమిటీ సభ్యులు, కార్పొరేటర్ల సలహాలతో ఎక్కడెక్కడ పనులు చేయాలో గుర్తించాలి అంచనా వ్యయాల్ని సైతం వారితో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి తొలగించిన పూడికను డంపింగ్‌యార్డుకు తరలించే వాహనాలకు జీపీఎస్, ఓఎస్సార్టీలు అమలు చేయాలి పూడిక తీయక ముందు.. తీస్తున్నప్పుడు.. తీశాక.. ఫొటోలు తీయాలి వాహనం జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు వెళ్లాక అక్కడి వెయింగ్ మెషిన్లో తూకం వేసి.. అందుకనుగుణంగానే కాంట్రాక్టరుకు బిల్లు చెల్లించాలి పనులు చేయడానికి ముందు, చే సిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీ చేయాలి మార్చి ఆరంభం నుంచే డీసిల్టింగ్ పనులు ప్రారంభమై, నెలాఖరులోగా పూర్తి కావాలి ఎక్కడెక్కడ డీసిల్టింగ్ పనులు చేస్తున్నది ప్రజలు చూసేందుకు వీలుగా జీహెచ్ఎంసీ వెబ్సైట్లో వివరాలు పొందుపరచాలి. ఏ నాలానైనా వదిలివేస్తే ప్రజలు సమాచారమిచ్చేందుకు ఇది ఉపకరిస్తుంది. -
శెవ్వా.. కంపు పంపకం
=మరుగుదొడ్ల నిర్మాణాల్లో ప్రధాన పార్టీలకు వాటాలు =నేతలకు ఆదాయ వనరులుగా మేడారం జాతర పనులు సాక్షిప్రతినిధి, వరంగల్ : మేడారం జాతర పనులు.. రాజకీయ నాయకులకు ఆదాయ వనరులయ్యూరుు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులను పంచుకుంటున్నారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిపై చేపట్టే పనులు దక్కించుకోవడానికి పోటీపడుతున్నారు. జాతర ఏర్పాట్లలో భాగంగా గ్రామీణ నీటిసరఫరా శాఖ రూ.9.30 కోట్లతో పనులు చేపడుతోంది. రూ.4.80 కోట్లు పారిశుద్ధ్య పనులకు, రూ.4.50 కోట్లు తాగునీటి సరఫరా పనులకు కేటాయించారు. పారిశుద్ధ్య పనుల కింద జాతర ప్రాంతంలో 10వేల మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో మరుగుదొడ్డి (యూనిట్)కి రూ.2300 చొప్పున రూ.2.30కోట్లతో ఈ పనులు పూర్తి చేయనున్నారు. వీటి ని కాంగ్రెస్ పార్టీ నేతలు 40 శాతం, టీఆర్ఎస్, టీడీపీ నేతలు 30 శాతం చొప్పున చేపట్టేలా బుధవారం ఒప్పందం కుదిరింది. మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రతి జాతరలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నా.. పంపకాల ఆనవాయితీ కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసారి జాతరలోనూ నాసిరకం నిర్మాణాలే జరుగను న్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువ పనులు టెండర్ పద్ధతిన చేపట్టగా.. మరుగుదొడ్ల నిర్మాణాలకు నామినేషన్ పద్ధతిని ఎంచుకున్నారు. దీంతో అందినకాడికి దండుకునే పనిలో పార్టీల నేతలు తలమునకలయ్యారు. నిర్మాణాలు ఇక్కడే.. ములుగు శివారులోని ఆది దేవత గట్టమ్మ ఆలయం వద్ద మొదలుకుని మేడారం చిలకలగుట్ట, జంపన్నవాగు, పడిగాపూర్, నార్లాపూర్, కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, ఊరట్టం, శివరాంసాగర్, గద్దెల పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ)లకు పనులు అప్పగిం చాల్సి ఉండగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తు ఒప్పందాలకు తెరలేపారు. పంపకాల ఆధారంగా ఆ మూడు పార్టీలకు ‘కంపు’పనులు అప్పగిస్తే ఎటువంటి ఫిర్యాదులూ ఉండవని భావిస్తున్న అధికారులు ఈ తతంగానికి అంగీకరించినట్లు తెలిసింది. వీడీసీల సిఫారసుతో నామినేషన్ పద్ధతిన అప్పగించనున్న ఈ పనుల కోసం కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు హన్మకొండ కేంద్రం గా పలుసార్లు చర్చలు జరిపినా వాటాల పై మొదట్లో స్పష్టత రాలేదు. అధికారంలో ఉన్న తమకు 50శాతం పనులు.. టీడీపీ, టీఆర్ఎస్లకు 25 శాతం చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ వారు పట్టుబట్టారు. ఈ ప్రతిపాదనకు టీడీపీ, టీఆర్ఎస్ వారు అంగీకరించలేదు. చివర కు కాంగ్రెస్‌కు 40, టీఆర్ఎస్, టీడీపీకి 30 శాతం చొప్పున వాటా ఉండేలా ఒప్పందం కుదిరింది. వీడీసీల ప్రతిపాదనలు రాలేదు : శ్రీనివాసరావు, ఆర్‌డబ్లూఎస్ ఈఈ మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి వీడీసీ నుంచి ప్రతిపాదనలు ఇప్పటి వరకు మావద్దకు రాలేదు. రెండుమూడు రోజుల్లో తెప్పించుకుని పనులను అప్పగిస్తాం. 10వేల మరుగుదొడ్లు నిర్మించనున్నాం. వీటిలో 8వేలు వీడీసీ ద్వారా ఇవ్వనున్నాం. మిగిలిన 2వేలకు సంబంధించి చివర్లో స్థలాలు(లొకేషన్) మారే అవకా శం ఉంది. వీటిపై తర్వాత చర్యలు తీసుకుంటాం. నాసిరకం పనులకు తావులేకుండా చూస్తాం.