Intermediate Education Department
-
‘వొకేషనల్’.. ఇక ప్రొఫెషనల్
సాక్షి, హైదరాబాద్: ►కాఫీ ఇష్టపడే వారు ఎక్కువే. అలాంటి కాఫీ ప్రి యుల కోసం 42 రకాల కాఫీలు ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా. ఆర్థిక స్థోమత లేక ఇంటర్మీడి యట్ పూర్తికాగానే ఏదో ఉద్యోగమో.. ఉపాధో పొందాలనుకునే వారు కాఫీ మేకింగ్ కోర్సు చదివితే.. ఓ కాఫీ షాప్ పెట్టుకోవచ్చు. ►బేకరీ, ఫ్లవర్ బోకే మేకింగ్.. ఇవీ అంతే. వీటి తయారీలో శిక్షణ పొందడం ద్వారా ఆయా రంగాల్లో స్థిర పడవచ్చు. ►తాజా ట్రెండ్ డ్యూటీ కేర్ మేనేజ్మెంట్. ఉద్యో గులైన భార్యాభర్తలు ఇంట్లో ఉండే తమ వృద్ధు లైన తల్లిదండ్రులను చూసుకునే వారి కోసం వెంపర్లాడుతున్నారు. వేలు చెల్లించి నర్సులను నియమించుకుంటున్నారు. అలా సేవలందించాలనుకునే వారి కోసం వచ్చిన కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి డిమాండ్ ఉంది. ఇంకా.. ఆటోమొబైల్ సర్వీసింగ్, మోటారు వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, టాయ్స్ మేకింగ్, అర్బన్ మైక్రో బిజినెస్, సోలార్ ఎనర్జీ వంటి కోర్సులను రాష్ట్రంలోని వొకేషనల్ ఇంటర్మీడియట్లో కోర్సులుగా అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్మీయట్ విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు సమూల సంస్కరణలకు ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ శ్రీకారం చుట్టారు. వొకేషనల్ కోర్సు చేసే విద్యార్థి ఉద్యోగంలో లేదా సొంతంగా ఉపాధి పొందేలా ఉండాలన్న లక్ష్యంతో ఈ కోర్సులను మార్చనున్నారు. సెంచూరియన్ వర్సిటీలో అధ్యయనం.. రాష్ట్రంలోని వొకేషనల్ విద్యలో మార్పులు తేవాల ని నిర్ణయించిన ఇంటర్ బోర్డు.. ఇలాంటి వొకేషనల్ కోర్సులను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీలో అధ్యయ నం చేసింది. అక్కడ అమలు చేస్తున్న కోర్సులు, వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్, విద్యార్థులకు లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నివేదిక సిద్ధం చేస్తోంది. ఉన్నతాధికారుల బృందం ఈ నెల 7న ఆ వర్సిటీలో అధ్యయనం చేసింది. ఒకట్రెండు రోజుల్లో నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆమోదం తీసుకొని వీలైతే వచ్చే విద్యా సంవత్సరంలోనే ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో సమూల మార్పులను, కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రాంతాన్ని బట్టి కోర్సులు.. కాఫీ మేకింగ్, బేకరీ మేకింగ్, ఫ్లవర్ బొకే మేకింగ్ వంటి కోర్సులకు, పనులకు పట్టణ ప్రాంతాల్లోనే డిమాండ్ ఉంటుంది. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, మష్రూమ్ కల్చర్, మోటార్ వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్ వర్క్ వంటి కోర్సులకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అక్కడే వాటి అవసరం ఉంటుంది. అందుకే ఏ ప్రాంతంలో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందో అక్కడ వాటిని నిర్వహించేలా ఇంటర్ విద్యా శాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిమాండ్ లేని కొన్ని కోర్సులను తొలగించే అంశాలను పరిశీలిస్తోంది. ప్రాంతాన్ని బట్టి డిమాండ్ ఉన్న కోర్సులను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 రకాల కోర్సులు ఉండగా, అందులో కొన్నింటిని తొలగించి 15 రకాల కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. కనీసంగా 2 లక్షలకు పెంచేలా.. రాష్ట్రంలో 176 ప్రభుత్వ, 401 ప్రైవేటు వొకేషనల్ జూనియర్ కాలేజిల్లో 96,208 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ సంఖ్యను కనీసంగా 2 లక్షలకు పెంచాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ పెట్టుకుంది. కోర్సు పూర్తి కాగానే విద్యార్థులకు ఉద్యోగ/ఉపాధి లభించే కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. -
మాకొద్దీ ఉచిత విద్య!
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఊడ్చేందుకు చీపుర్లు లేవు. టాయిలెట్లు శుభ్రం చేసేవాళ్లు లేరు. చాక్‌పీసులకు పైసల్లేవ్. డస్టర్లకు డబ్బుల్లేవ్. టీచింగ్ డైరీల్లేవు. ఇందుకు ఏకైక కారణం కాలేజీలో డబ్బుల్లేకపోవడమే. ఈ దుస్థితి ఆ ఒక్క కాలేజీకే పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశ పెట్టిన ‘ఉచిత విద్య’కారణంగా విద్యార్థుల నుంచి పైసా వసూలు చేయడానికి వీల్లేదు. కాలేజీలకు డబ్బులు ఇప్పిస్తామన్న ఇంటర్మీడియట్ విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. ఫీజులు వసూలు చేయనపుడు రీయింబర్స్ ఎలా చేస్తామని సంక్షేమ శాఖలు చేతులెత్తేశాయి. దీంతో ఏం చేయాలో అర్థంకాక ప్రిన్సిపాళ్లు ఆందోళన చెందుతున్నారు. ప్రిన్సిపాళ్ల ఆందోళన ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహణలో ప్రిన్సిపాళ్లు తంటాలు పడుతున్నారు. చాక్‌పీసులకు నిధుల్లేక అల్లాడుతున్నారు. కాలేజీల ఆవరణ, ప్రిన్సిపాల్, సిబ్బంది గదులు, తరగతి గదులను ఊడ్చే దిక్కులేదు. కాలేజీల్లో టాయిలెట్లను శుభ్రం చేయించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఆందోళనకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల సమావేశమై తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కాలేజీలను తాము నిర్వహించలేమంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతా ఉచిత విద్య చలవే! నాలుగేళ్ల కిందట జూనియర్ కాలేజీల్లో ఉచిత విద్యను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో 2016–17 విద్యా సంవత్సరం నుంచి ఆయా కాలేజీల్లో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంలేదు. అప్పట్లో ఉన్న 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,15,111 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు అయినందునా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు ప్రతి విద్యార్థి నుంచి సైన్స్ విద్యార్థులైతే రూ.893, ఆర్ట్స్ విద్యార్థులైతే రూ.533 కాలేజీలు వసూలు చేసేవి. అయితే 2016 జనవరి 7వ తేదీన జారీ చేసిన జీవో 2లో ఆ మొత్తాన్ని కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. సంక్షేమ శాఖలు ఇవ్వాలని చెప్పినా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ ఉచిత విద్య కారణంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 404 జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు చేరింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం కాలేజీలు విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజులను వసూలు చేయవద్దని, కాలేజీలు తమ ఖర్చులను కంటింజెన్సీ ని«ధులతోపాటు సంక్షేమ శాఖలు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వెళ్లదీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పైగా ఆర్థిక శాఖ, సంక్షేమ శాఖలతో సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ జీవోలో పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ప్రభుత్వం ఒక్కో కాలేజీకి ఇస్తున్న కంటింజెన్సీ నిధులు ఒకనెల ఎలక్ట్రిసిటీ బిల్లుకు కూడా సరిపోవడం లేదని ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. మరోవైపు సంక్షేమ శాఖలు చేతులెత్తేశాయి. కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయనపుడు తాము ఎందుకు రీయింబర్స్మెంట్ ఇస్తామని మెలిక పెట్టాయి. దీంతో విద్యార్థుల నుంచి స్పెషల్ పీజుల రూపంలో వచ్చే మొత్తం రాకపోగా, సంక్షేమ శాఖలు కూడా ఇవ్వక కాలేజీల నిర్వహణ కష్టంగా మారిపోయింది. ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చినా ఉచిత ఇంటర్మీడియట్ విద్యాపథకం ప్రవేశ పెట్టడానికి ముందు విద్యార్థుల నుంచి స్పెషల్ ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బు కాలేజీల అకౌంట్లలో ఉన్నాయి. దీంతో ఇన్నాళ్లు సంక్షేమ శాఖలు డబ్బులు ఇవ్వకపోయినా ఆ నిధులతో ప్రిన్సిపాళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు తాము తాము నిర్వహించలేమంటూ చేతులెత్తేసేందుకు సిద్ధం అయ్యారు. ఆయా కాలేజీల్లోని నిధులు అయిపోయి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ నుంచి పైసా రాక పోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి రాష్ట్రంలో 100 మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 1500 మంది, 2 వేల మంది విద్యార్థులు ఉన్న కాలేజీలూ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 2 లక్షల మంది విద్యార్థులున్నారు. 300 మంది విద్యార్థులు ఉన్న కాలేజీని తీసుకుంటే.. ఏటా (కాలేజీ నడిచే 10 నెలలకు)వెచ్చించాల్సిన ఖర్చు వివరాలు ఇలా ఉన్నాయి. రూ.20వేలు అటెండర్‌కు, రూ.20వేలు స్వీపర్‌కు, రూ. 20వేలు బాత్రూమ్లు కడిగేవారికి, రూ. 20వేలు నైట్ వాచ్‌మెన్‌కు, రూ.20వేలు కరెంటు బిల్లు (కంప్యూటర్లు, ఆర్వో ప్లాంటు ఉన్న కాలేజీల్లో నెలకు 2 వేల చొప్పున)కు, రూ.10వేలు చాక్ పీసులు, డస్టర్లు, రిజిసర్టర్లకు, రూ.5వేలు ఇంటర్నెట్ ఛార్జీలు, రూ.20వేలు కార్యక్రమా లకు ( జూన్ 2, ఆగస్టు 15, జనవరి 26, కాలేజ్ డేలకు అథమంగా రూ.5 వేల చొప్పున వెచ్చిస్తేనే. కానీ ఒక్కో ఫంక్షన్ చేస్తే రూ.10 వేలకు పైనే అవుతుంది) ఖర్చవుతోంది. ఏటా కనీసం రూ.1.25 లక్షలు ఇలా కనీసంగా లెక్కలేసుకున్నా ఒక్కో కాలేజీ నిర్వహణకు హీనపక్షంలో ఏటా రూ.1.25లక్షలు అవసరం. కానీ రాష్ట్రంలో 500 నుంచి మొదలుకొని 2వేల వరకు విద్యార్థులున్న కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. వీటి అవసరాలకోసం కోసం కనీసం రూ.1.5లక్షల నుంచి 2లక్షల వరకు వెచ్చించాల్సిందే. అయినా ఇంటర్మీడియట్ విద్యాశాఖ పైసా ఇవ్వడం లేదు. కంటింజెన్సీ కింద ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ బిల్లులు ఒక నెలకు కూడా సరిపోవడం లేదు. సంక్షేమ శాఖలు ఇస్తాయన్న నిధులను రాకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఆర్థిక కష్టాల్లో పడ్డాయి. -
పకడ్బందీగా ప్రయోగం
గుడిహత్నూర్(బోథ్): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగ కసర త్తు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రాక్టికల్ పరీక్షలకు అరగంట ముందు మాత్రమే ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ప్రశ్నపత్రం ఆన్‌ద్వారా పరీక్షా కేంద్రాలకు అందనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 5,927 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ వారు 1,884 మంది, బైపీసీ వారు 3,388 ఉండగా వొకేషనల్ విద్యార్థులు 655 మంది ఉన్నారు. వీరందరూ ప్రాక్టికల్ పరీక్షల్లో హాజరుకావడానికి యంత్రాం గం అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రాక్టికల్ పరీక్షలంటే మాములుగా తీసుకునే విద్యార్థులు మాత్రం నష్టపోయే అవకాశం ఉంది. ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా అందనున్న ప్రశ్నపత్రం ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ విద్యాశాఖ పటిష్ట ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది పరీక్షా సమయానికి అరగంట ముందు ఎగ్జామినర్‌కు ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ఆన్లైన్లో ప్రశ్న పత్రం అందనుంది. అందిన వెంటనే ఎగ్జామినర్లు దానిని ప్రింట్ తీసుకొని పరీక్షా సమయానికి విద్యార్థులకు అందించనున్నారు. అయితే ఈ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ గట్టెక్కేనా? జిల్లాలో 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు 18 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. అయితే ద్వితీయ సంవత్సరం చదువుకుంటూ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో ప్రాక్టికల్ భయం పుడుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆగస్టు నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో సెలబస్ పూర్తికానట్లు తెలుస్తోంది. దసరా సెలవులు, ఎన్నికలు, సంక్రాంతి సెలవులతోపాటు అధ్యాపకులు ఎన్నికల విధులు తదితర కారణాల వల్ల సకాలంలో అందుబాటులో ఉండకపోవడం సైతం కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పూర్తి స్థాయిలో ప్రాక్టికల్స్‌కు సంబంధించి సామగ్రి లేకపోవడంతో మొక్కుబడిగా చేయించి థియరీ మాత్రం బట్టీ పట్టించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి ప్రాక్టికల్స్‌లో విద్యార్థులు ఎలా గట్టెక్కుతారనే ఆందోళన కనిపిస్తోంది. పకడ్బందీగా నిర్వహిస్తాం ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. దీనికిగాను అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కళాశాలల్లో 95శాతం ప్రాక్టికల్ బోధన పూర్తయింది. సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా బోధన పూర్తి చేయడంతో పాటు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటాం. – దస్రు, జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదిలాబాద్ -
విద్యార్థులున్నా.. కాలేజీలు సున్నా
సాక్షి, హైదరాబాద్ : ♦ పాత మహబూబ్‌నగర్ జిల్లా దౌలతాబాద్ మండలంలో 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ ఎయిడెడ్ పాఠశాల, మరో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఉన్నాయి. వాటిల్లో 533 మంది పదో తరగతి చదువుతున్నారు. కానీ అక్కడ ఒక్క జూనియర్ కాలేజీ లేదు. దీంతో ఇంటర్ చదివేందుకు విద్యార్థులకు తంటాలు తప్పడం లేదు. ♦ వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలంలో 4 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ, ఓ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉన్నాయి. వాటిల్లో 441 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడా ఒక్క జూనియర్ కాలేజీ లేదు. దీంతో ఇంటర్ కోసం ఇతర మండలాల్లోని ప్రైవేటు కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక స్తోమత లేని కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తుండగా మరికొంత మంది పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలోని 106 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ కాలేజీల ఏర్పాటుపై ఇప్పటివరకు ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు దృష్టి సారించకపోగా, ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు యాజమాన్యాలు ముందుకు రాలేదు. దీంతో ఆయా మండలాల్లోని విద్యార్థులు నిత్యం ఇతర ప్రాంతాల్లోనే కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత 125 మండలాలు పెరిగాయి. దీంతో మండలాల సంఖ్య 584కి చేరింది. కానీ 106 మండలాల్లో ఒక్క కాలేజీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలే కాదు.. పాత మండలాల్లోనూ కాలేజీలు లేక పిల్లల్ని ఇతర మండలాలకు పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, స్థానికుల ఒత్తిడి రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. గతంలో 10 జిల్లాలుండగా వాటిని 31 జిల్లాలు చేయడం.. పాత మండలాలు 459 ఉండగా 584కు పెంచడంతో జూనియర్ కాలేజీల ఏర్పాటుకు స్థానికులు డిమాండ్ చేస్తు న్నారు. ఐదారు ఉన్నత పాఠశాలలున్న గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక్క జూనియర్ కాలేజీ లేని మండలాల్లో ఏర్పాటుకు ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదనలూ సిద్ధం చేయించి ఇంటర్ విద్యా శాఖకు పంపుతున్నారు. దీంతో ఏయే మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు లేవు.. ఏయే మండలాల్లో ప్రైవేటు కాలేజీలున్నాయి.. అసలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ లు లేని మండలాలు ఏవో లెక్కలు తేల్చారు. మొత్తం గా 106 మండలాల్లో అటు ప్రభుత్వ జూనియర్ కాలే జీ గాని, ఇటు ప్రైవేటు కాలేజీ కానీ లేదని తేల్చారు. వాటి విషయంలో ఏం చేయాలని యోచిస్తున్నారు. కాలేజీలు లేని మండలాలు మరిన్ని.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండంలో 8 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఓ కేజీబీవీ ఉంది. వాటిల్లో 459 మంది పదో తరగతి చదువుతున్నారు. అక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేటు జూనియర్ కాలేజీ ఒక్కటీ లేదు. అదే జిల్లాలోని కోటపల్లిలో 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా పదో తరగతి విద్యార్థులు 203 మంది ఉన్నారు. అక్కడా ఒక్క కాలేజీ లేదు. జనగా మ జిల్లాలో తరిగొప్పుల, వరంగల్ రూరల్ జిల్లా లోని దుగ్గొండి, నల్లబెల్లి, యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు, రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, నిర్మల్ జిల్లా లోని బాసర, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు. డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేయాలి ఉన్నత పాఠశాలలు, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న మండలాల్లో డిమాండ్ మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కాలేజీలు లేని కొత్త మండలాలతో పాటు పాత మండలాల్లోనూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ విద్యా శాఖ ప్రతిపాదనలు పంపాలి. – పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
మండలానికో ప్రభుత్వ జూనియర్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ నిర్దేశించుకుంది. అంతేకాదు కాలేజీలన్నింటికీ పక్కా భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యాశాఖ రూపొందించిన 2024 డాక్యుమెంట్లో పలు అంశాలను పొందుపరిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 500కి పైగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలు తక్కువగా ఉండటంతో గ్రామీణ నిరుపేద విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాలేజీలు లేని మండలాల్లో వాటి ఏర్పాటుకు అవసరమైన భూమి, నిధుల వివరాలను ఆ డాక్యుమెంట్లో పొందు పరిచింది. ప్రభుత్వ కాలేజీల్లో ఏటా 10 శాతం చొప్పున విద్యార్థుల నమోదును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 65 శాతం, ద్వితీయ సంవత్సరంలో 75 శాతం ఫలితాలను సాధించేలా కార్యాచరణను రూపొందించింది. అలాగే జూనియర్ కళాశాలల అభివృద్ధికి 23 రకాల అంశాలను గుర్తించి పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇవీ డాక్యుమెంట్‌లోని ప్రధానాంశాలు ♦ ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత బస్‌పాస్ సదుపాయం కల్పించడం. ♦ జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేయడం. ♦ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశ పెట్టడం. జీతభత్యాలను బయోమెట్రిక్‌తో అనుసంధానం చేయడం. ♦ విద్యార్థినుల కోసం వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయడం. ♦ కాలేజీల్లో ఖాళీలు లేకుండా బోధనా సిబ్బంది నియామకం చేపట్టడం. ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం లెక్చరర్లను వీలైనంత తొందరగా నియమించడం. ♦ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చే ప్రైవేట్ జూనియర్ కాలేజీలను నియంత్రించడం. ♦ ఇంటర్ పరీక్షా పత్రాన్ని విద్యార్థులకు తేలిగ్గా అర్థమయ్యేలా రూపొందించడం. ♦ నిపుణులైన బోధనా సిబ్బంది సహకారంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వర్చువల్ తరగతులను నిర్వహించడం. ♦ డిజిటల్ లైబ్రరీ, కెరీర్ గైడెన్స్, స్పెషల్ తరగతులు, పున:శ్చరణ తరగతులను నిర్వహించడం. ♦ కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయడం. ♦ కాలేజీల భద్రత కోసం స్వీపర్, వాచ్మెన్, స్కావెంజర్ పోస్టులను భర్తీచేయడం. ♦ పరిస్థితులకు అనుగుణంగా బోధనా సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం. ♦ వొకేషనల్ విద్యార్థుల ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించడం. -
కాంట్రాక్టు అధ్యాపకుల ‘వెరిఫికేషన్’ ప్రక్రియ షురూ
జిల్లాల వారీగా సీనియర్ ప్రిన్సిపాళ్లతో కమిటీల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా వారి ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇటీవలే పూర్తి కాగా, కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ముగ్గురు సీనియర్ లెక్చరర్లతో కమిటీలను ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించింది. అయితే జూన్ 2 నాటికి క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న 13 వేల మంది ఉద్యోగుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు 5 వేల మందికి పైగా ఉన్నారు. వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అనేక సమస్యలు బయట పడుతున్నాయి. కొందరికి అర్హతలు లేకపోగా, కొందరు పని చేస్తున్న కాలేజీల్లో మంజూరైన పోస్టులే లేవు. అర్హతలు లేనివారే అధికం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకాల్లో పరిగణనలోకి తీసుకోవాల్సిన నిబంధనల ఉత్తర్వుల (జీవో 12, జీవీ 302) ప్రకారం 300 మందికి లెక్చరర్ పోస్టుకు ఉండాల్సిన అర్హతలు లేవని ఇదివరకే ఇంటర్మీడియట్ విద్యాశాఖ గుర్తించింది. ఇక 71 కాలేజీల్లో 632 మంది కాంట్రాక్టు లెక్చర ర్లు అసలు మంజూరే కాని పోస్టుల్లో పని చేస్తున్నట్లు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం పోస్టులు మంజూరు కాకుండా వారిని రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. మరోవైపు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులను నిర్వహించే కాలేజీల్లోనూ 250 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మంజూరు కాని పోస్టుల్లోనే పని చేస్తున్నారు. దీంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే గతంలో సీఎం కేసీఆర్‌ను వారు కలసినపుడు పోస్టులు మంజూరు చేసి, క్రమబద్ధీకరించాలని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారికి పోస్టులు మంజూరు చేశాకే క్రమబద్ధీకరణ చేసే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ అంశంపై చర్చించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధ్యం కాకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు మంజూరు కాని పోస్టుల్లో పని చేస్తున్న వారికి పోస్టుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాలని రాజీవ్‌శర్మ ఆదేశించినట్లు తెలిసింది. వారితోపాటు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ 150 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మంజూరు కాని పోస్టులో పని చేస్తున్నట్లు తెలిసింది. డిగ్రీ కాలేజీల్లోనూ అనేక సమస్యలు: కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల క్రమబద్ధీకరణలోనూ అనేక సమస్యలున్నట్లు అధికారులు గుర్తించారు. 940 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లలో 40 మంది లెక్చరర్లు 2014 జూన్ 2 నాటికి సర్వీసులోనే లేరని తేలింది. మరో 170 మందిలో 50 మందికి ఉద్యోగంలో చేరే నాటికి సరైన అర్హతలు లేవు.