International Fund
-
18 దేశాల్లో పేదల ఆకలి తీర్చిన భారత్
న్యూఢిల్లీ: పంచ ఆహార ప్ర వ్యవస్థల్లో సానుకూల మార్పులు తీసుకురాగల సామర్థ్యం భారత్‌కు ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి(ఐఎఫ్ఏడీ) అధ్యక్షుడు అల్వారో లారియో ప్రశంసించారు. జీ20 దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచి్చన ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అలాంటి సమయంలో 18 దేశాలకు భారత్ 10.8 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసిందని, పేద ప్రజల ఆకలి తీర్చిందని కొనియాడారు. ఇటీవలి కాలంలో తృణధాన్యాల సాగుకు భారత్ అధిక ప్రాధాన్యం వేస్తుండడం ప్రశంసనీయమని చెప్పారు. ఆహార ఉత్పత్తి విషయంలో భారత్ ప్రాధాన్యతలు, ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతలను పోలి ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో భారత్ సాధించిన నైపుణ్యం ‘గ్లోబల్ సౌత్’లోని ఇతర దేశాలకు సైతం ఉపకరిస్తుందని అల్వారో లారియో వివరించారు. వాతావరణ మార్పులు విపరీత ప్రభావం చూపిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తృణధాన్యాల సాగు చేపట్టడం రైతులకు లాభదాయకమని సూచించారు. కరువులను తట్టుకొనే శక్తి తృణధాన్యాలకు ఉందన్నారు. పేదలకు పౌష్టికాహారం అందించాలంటే తృణధాన్యాలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. -
ఇంటర్నేషనల్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?
నేను మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఏడాది బడ్జెట్లో ఈ తరహా ఫండ్స్‌కు సంబంధించి పన్ను విధి విధానాలు మారాయని మిత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ కొనసాగించమంటారా? వద్దంటారా? లేకుంటే ఈ ఫండ్ నుంచి పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వేరే ఫండ్‌కు మళ్లించమంటారా? - లోకేశ్, జగిత్యాల మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్ అనేది అంతర్జాతీయ ఫండ్. ఈ తరహా అంతర్జాతీయ ఫండ్స్‌కు సంబంధించి పన్ను నియమనిబంధనల్లో మార్పు, చేర్పులు చేస్తూ బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి ఫండ్స్‌ను ఇప్పుడు డెట్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఈ ఫండ్ నుంచి మీరు మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అలా కాకుండా మూడేళ్లలోపు మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు పొందే లాభాలపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ప్రతిపాదనల దృష్ట్యా ఇలాంటి ఫండ్స్‌కు ఆదరణ తగ్గుతోంది. అయినప్పటికీ, మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ కిందనే పరిగణించవచ్చు. అమెరికాలో ఉండి, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లోనే ఈ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఫండ్ నుంచి బాగానే ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో కనీసం మూడేళ్లు ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనాలు పొందగలం. ఈ దృష్ట్యా చూస్తే పన్ను నిబంధనల ప్రభావం ఉండదు. నిరభ్యతరంగా ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి. నా మిత్రుడు ఇటీవల ఒక యులిప్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు యులిప్స్ల సరళి మారిందని, ఇన్వెస్ట్ చేయమని నాకు కూడా సలహా ఇచ్చాడు. ఒక వేళ చేస్తే ఎంత కాలం వరకూ ఇన్వెస్ట్ చేయాలి? - పవన్, గుంటూరు మీ మిత్రుడు చెప్పింది కొంతవరకూ నిజమే. 2010 సెప్టెంబర్ తర్వాత వచ్చిన యులిప్‌లు అంతకు ముందటి యులిప్‌లతో పోల్చితే కొంచెం నయమే. కానీ అవి ఇన్వెస్ట్‌మెంట్‌కు తగ్గ ఫండ్స్ కావని చెప్పవచ్చు. వీటి ట్రాక్ రికార్డ్‌ను అంచనా వేయడం కష్టం. అంతేకాకుండా యులిప్‌లో లాకిన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంత పారదర్శకంగా యులిప్‌లు పనిచేయవు. బీమా, ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండిటిని వేర్వేరుగా చూడాలని మేం ఎప్పుడూ చెబుతుంటాం. యూలిప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు బదులుగా ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ముందుగా ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్డ్ ఫండ్లను పరిశీలించవచ్చు. ఆ తర్వాత మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి, మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఇతర మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేనొక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మార్కెట్లో చాలా టర్మ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే వివిధ సంస్థల టర్మ్ ప్లాన్ల కవరేజ్ ఒకే విధంగా ఉన్నా, ప్రీమియమ్‌ల్లో మాత్రం చాలా మార్పులు ఉన్నాయి. 70-80 శాతం వరకూ తేడాలున్నాయి. ఇలా ఎందుకు ఉంటోంది ? నేను రిలయన్స్, అవైవా, ఏఎక్స్ఏ, ఎస్బీఐ లైఫ్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి? - సుజాత, విజయనగరం టర్మ్ ప్లాన్స్‌కు ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే బీమా చేసిన మొత్తాన్ని చెల్లించడం. ఇక వివిధ కంపెనీలు వివిధ అంశాలను ఆధారంగా తీసుకొని ప్రీమియమ్‌లను నిర్ణయిస్తుంటాయి. అందుకనే ఒక్కో సంస్థకు 70-80% వరకూ తేడా ఉండడం సాధారణమే. గతంలో బీమా కంపెనీ చెల్లించిన క్లెయిమ్‌లు, వసూలు చేసే ప్రీమియం.. ఈ రెండు అంశాల ఆధారంగా టర్మ్ ప్లాన్లు తీసుకోవాలి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే, దిగువ సంస్థల టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఈప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్-లెవెల్ కవర్.. ఇవన్నీ ఆన్లైన్ టర్మ్ పాలసీలు. మీ వయస్సును బట్టి మీరు చెల్లించే ప్రీమియం, మీ బడ్జెట్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన టర్మ్ప్లాన్ను ఎంచుకోండి. -
మంచి ఇంటర్నేషనల్ ఫండ్ ఏది?
నేను ప్రస్తుతం యూటీఐ ఎంఎన్సీ, యూటీఐ డివిడెండ్ ఈల్డ్ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా? ఒక ఇంటర్నేషనల్ ఫండ్‌లో కూడా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను, తగిన సూచనలివ్వండి. -శ్రీధర్, జగిత్యాల మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రెండు ఫండ్స్- యూటీఐ ఎంఎన్సీ, యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌లకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ రెండింటిలో ఎలాంటి సందేహాలు లేకుండా పెట్టుబడులు కొనసాగించండి. ఈ రెండింటి పెట్టుబడులను యూటీఐ ఈక్విటీ ఫండ్‌కు మళ్లించవచ్చు. యూటీఐ ఈక్విటీ అనేది డైవర్సిఫైడ్ ఫండ్. మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న ఈ రెండు ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ ఎక్కువ. ఇక ఇంటర్నేషనల్ ఫండ్ పెట్టుబడి విషయానికొస్తే, పెట్టుబడులను ప్రాంతాల వారీగా డైవర్సిఫై చేయడం చాలా మంచి యోచన. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఏ- ఈ ఫండ్స్ అన్నీ అంతర్జాతీయంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మొదటి రెండు ఫండ్స్ ప్రధానంగా అమెరికా కంపెనీల్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ అమెరికా కంపెనీలు ప్రపంచమంతా వ్యాపారం చేస్తున్నాయి. మీరు వీటిల్లో ఏ ఫండ్‌నైనా ఎంచుకోవచ్చు. పొలం అమ్మగా నా వాటా కింద రూ.80,000 సొమ్ము వచ్చింది. ఒక ఏడాది కాలానికి ఈ డబ్బులను ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి -అనిత, గుంటూరు ఏడాది కాలం ఇన్వెస్ట్మెంట్ కోసమైతే షేర్ల గురించి ఆలోచించవద్దు. ఏడాది లోపు ఈ సొమ్ములు మీకు అవసరం లేకపోతే, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయండి. వీటి వల్ల మంచి రిటర్న్‌లు రావడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. డబ్బులు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవాలనుంటే, లిక్విడ్ ఫండ్‌లో గానీ, ఆల్ట్రా షార్ట్-టెర్మ్ బాండ్ ఫండ్‌లో గానీ పెట్టుబడులు పెట్టండి. నా కొడుకు, కోడలు ఇద్దరూ 40 ఏళ్ల టెర్మ్ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నారు. టెర్మ్, ఆరోగ్య బీమా కూడా ఉండే కొన్ని ప్లాన్లను వివరిస్తారా? -అచ్యుత రామయ్య, తిరుపతి మీ కొడుకు, కోడలూ ఇద్దరూ చిన్న వయసులోనే ఉన్నారు. కాబట్టి వాళ్లు తప్పనిసరిగా ఆన్లైన్ టెర్మ్ పాలసీలు తీసుకోవడమే ఉత్తమం. ఆన్లైన్ పాలసీలు తీసుకుంటే ఏజెంట్ల, దళారీల ప్రమేయం ఉండదు. దీంతో ఈ ఆన్లైన్ పాలసీలను బీమా కంపెనీలు తక్కువ ధరకే అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ క్లిక్ 2 ప్రొటెక్ట్, ఐసీఐసీఐ ప్రు ఐకేర్, ఎస్బీఐ లైఫ్ ఈ షీల్డ్, అవైవా ఐ-లైఫ్.. ఇవన్నీ కొన్ని మంచి పాలసీలు. అవైవా లైఫ్ మినహా మిగిలినవన్నీ 30 ఏళ్ల కాలపరిమితి ఉన్న పాలసీలు. అవైవా పాలసీ 35 ఏళ్ల పాలసీ. మీ ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకోండి. రూ. కోటి పాలసీ తీసుకోవాలనుకుంటే, ఒకటే పాలసీ కాక రెండు పాలసీలు తీసుకోండి. ఇక ఆరోగ్య బీమా విషయానికొస్తే, ఒకే పాలసీ కింద ఇద్దరికీ వర్తించే ఫ్యామిలీ ఫ్లోటర్‌ను ఎంచుకోండి. విభిన్నరకాలైన బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు ఇన్ పేషెంట్‌గా హాస్పిటల్లో చేరితే అయ్యే వ్యయాలను భరిస్తే, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ను కూడా కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలున్నాయి. ప్రసూతి వ్యయాలు, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ రిస్క్, ఇత్యాది ఎన్నో ప్రయోజనాలందించే పాలసీలు చాలా ఉన్నాయి. మా వెబ్‌సైట్‌లోని బీమా సెక్షన్లోకి వెళ్లి మీకు ఎంత కవరేజ్ అవసరమో దృష్టిలో పెట్టుకొని ఏ పాలసీని తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్య బీమాకు సంబంధించి ఏమీ దాచకుండా అన్ని వివరాలను సంబంధిత దరఖాస్తుల్లో నింపండి. ఫలితంగా బీమా పరిహారం పొందేటప్పుడు ఎలాంటి సమస్యలుండవు.