నేను ప్రస్తుతం యూటీఐ ఎంఎన్‌సీ, యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్స్‌లో నా ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించమంటారా? ఒక ఇంటర్నేషనల్ ఫండ్‌లో కూడా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను, తగిన సూచనలివ్వండి.
-శ్రీధర్, జగిత్యాల
మీరు ఇన్వెస్ట్ చేస్తున్న రెండు ఫండ్స్- యూటీఐ ఎంఎన్‌సీ, యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌లకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ రెండింటిలో ఎలాంటి సందేహాలు లేకుండా పెట్టుబడులు కొనసాగించండి. ఈ రెండింటి పెట్టుబడులను యూటీఐ ఈక్విటీ ఫండ్‌కు మళ్లించవచ్చు. యూటీఐ ఈక్విటీ అనేది డైవర్సిఫైడ్ ఫండ్. మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న ఈ రెండు ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోకస్ ఎక్కువ. ఇక ఇంటర్నేషనల్ ఫండ్ పెట్టుబడి విషయానికొస్తే, పెట్టుబడులను ప్రాంతాల వారీగా డైవర్సిఫై చేయడం చాలా మంచి యోచన. మీరు ఎంచుకోవడానికి కొన్ని ఫండ్స్- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్, బిర్లా సన్‌లైఫ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఏ- ఈ ఫండ్స్ అన్నీ అంతర్జాతీయంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మొదటి రెండు ఫండ్స్ ప్రధానంగా అమెరికా కంపెనీల్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ అమెరికా కంపెనీలు ప్రపంచమంతా వ్యాపారం చేస్తున్నాయి. మీరు వీటిల్లో ఏ ఫండ్‌నైనా ఎంచుకోవచ్చు.
పొలం అమ్మగా నా వాటా కింద రూ.80,000 సొమ్ము వచ్చింది. ఒక ఏడాది కాలానికి ఈ డబ్బులను ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సలహా ఇవ్వండి
-అనిత, గుంటూరు
ఏడాది కాలం ఇన్వెస్ట్‌మెంట్ కోసమైతే షేర్ల గురించి ఆలోచించవద్దు. ఏడాది లోపు ఈ సొమ్ములు మీకు అవసరం లేకపోతే, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ)లో ఇన్వెస్ట్ చేయండి. వీటి వల్ల మంచి రిటర్న్‌లు రావడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. డబ్బులు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవాలనుంటే, లిక్విడ్ ఫండ్‌లో గానీ, ఆల్ట్రా షార్ట్-టెర్మ్ బాండ్ ఫండ్‌లో గానీ పెట్టుబడులు పెట్టండి.
నా కొడుకు, కోడలు ఇద్దరూ 40 ఏళ్ల టెర్మ్ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నారు. టెర్మ్, ఆరోగ్య బీమా కూడా ఉండే కొన్ని ప్లాన్‌లను వివరిస్తారా?
-అచ్యుత రామయ్య, తిరుపతి
మీ కొడుకు, కోడలూ ఇద్దరూ చిన్న వయసులోనే ఉన్నారు. కాబట్టి వాళ్లు తప్పనిసరిగా ఆన్‌లైన్ టెర్మ్ పాలసీలు తీసుకోవడమే ఉత్తమం. ఆన్‌లైన్ పాలసీలు తీసుకుంటే ఏజెంట్ల, దళారీల ప్రమేయం ఉండదు. దీంతో ఈ ఆన్‌లైన్ పాలసీలను బీమా కంపెనీలు తక్కువ ధరకే అందిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ 2 ప్రొటెక్ట్, ఐసీఐసీఐ ప్రు ఐకేర్, ఎస్‌బీఐ లైఫ్ ఈ షీల్డ్, అవైవా ఐ-లైఫ్.. ఇవన్నీ కొన్ని మంచి పాలసీలు. అవైవా లైఫ్ మినహా మిగిలినవన్నీ 30 ఏళ్ల కాలపరిమితి ఉన్న పాలసీలు. అవైవా పాలసీ 35 ఏళ్ల పాలసీ. మీ ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలో నిర్ణయించుకోండి. రూ. కోటి పాలసీ తీసుకోవాలనుకుంటే, ఒకటే పాలసీ కాక రెండు పాలసీలు తీసుకోండి. ఇక ఆరోగ్య బీమా విషయానికొస్తే, ఒకే పాలసీ కింద ఇద్దరికీ వర్తించే ఫ్యామిలీ ఫ్లోటర్‌ను ఎంచుకోండి. విభిన్నరకాలైన బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
కొన్ని పాలసీలు ఇన్ పేషెంట్‌గా హాస్పిటల్‌లో చేరితే అయ్యే వ్యయాలను భరిస్తే, అవుట్ పేషెంట్ ట్రీట్‌మెంట్‌ను కూడా కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలున్నాయి. ప్రసూతి వ్యయాలు, క్రిటికల్ ఇల్‌నెస్, యాక్సిడెంటల్ రిస్క్, ఇత్యాది ఎన్నో ప్రయోజనాలందించే పాలసీలు చాలా ఉన్నాయి. మా వెబ్‌సైట్‌లోని బీమా సెక్షన్‌లోకి వెళ్లి మీకు ఎంత కవరేజ్ అవసరమో దృష్టిలో పెట్టుకొని ఏ పాలసీని తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్య బీమాకు సంబంధించి ఏమీ దాచకుండా అన్ని వివరాలను సంబంధిత దరఖాస్తుల్లో నింపండి. ఫలితంగా బీమా పరిహారం పొందేటప్పుడు ఎలాంటి సమస్యలుండవు.
మంచి ఇంటర్నేషనల్ ఫండ్ ఏది?
Published Mon, Oct 7 2013 1:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
Advertisement