International Twins Day
-
మనిషిని పోలిన మనిషి.. ఆ ఊళ్లో 17 మంది ట్విన్స్..
సాక్షి, నర్సంపేట/రాయపర్తి(వరంగల్): ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్ టూ జిరాక్స్, ఒకే డ్రెస్.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు. కవలలు ఎదురైతే ఆశ్చర్యంగా చూస్తాం. కొందరు తల్లిదండ్రులైతే ఒకే రకమైన డ్రెస్ కవలలిద్దరికీ వేస్తారు. కుటుంబ సభ్యులు సైతం గుర్తుపట్టేందుకు తటపటాయిస్తారు. అలా కవలలు ఎక్కడున్నా వారిది ప్రత్యేక స్థానమే. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పెర్కవేడు గ్రామంలో ఏకంగా 17 మంది కవలలు(34 మంది) ఉండడం విశేషం. నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కవలల ఊరు! తెలంగాణలో ఏ ఊళ్లో లేనట్లుగా రాయపర్తి మండలం పెర్కవేడు గ్రామంలో ఎక్కువ మంది కవలలున్నారు. ఐదువేల జనాభా ఉన్న ఈ ఊళ్లో దాదాపు వెయ్యికి పైగా ఇండ్లుంటాయి. ఇక్కడ 17 మంది కవలుండడం విశేషం. కవలలు జన్మించడం చాలా అరుదు. కానీ ఇక్కడ ఎక్కువ మంది కవలలుండం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గ్రామంలోని కవలలు చదువులు, ఉద్యోగాలరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ పండుగలకు, పబ్బాలకు మాత్రం గ్రామానికి వస్తుంటారు. అలా వచ్చినప్పుడు అందరి దృష్టి వీరిపైనే ఉంటుంది. వారిని గుర్తుపట్టడానికి. ఒకేలా తాతలు.. గొళ్లపల్లి రామయ్య, లక్ష్మయ్యలు కవలలు. వీరిది పెర్కవేడు. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఒకరు కొండూరులో, మరొకరు స్వగ్రామంలో ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తాము గొడవపడలేదని చెబుతున్నారు. ఏ కార్యానికైనా కలిసికట్టుగా వెళ్తామని రాముడు, లక్ష్మణుడిలా ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటామని చెబుతున్నారు రామయ్య, లక్ష్మయ్యలు. ఇప్పటికీ ఆ కుటుంబంలో ఐకమత్యానికి వీళ్లిద్దరినీ ఉదాహరణగా తీసుకుంటారు. చదవండి: కరీంనగర్: రూ.34 లక్షలు.. కాదు కాదు.. రూ.14లక్షలు...! కార్తీజన్వి– కృతిజన్వి నర్సంపేట మండలం మాధన్నపేట శివారు భోజ్యనాయక్ తండాకు చెందిన అజ్మీర విజయ్‌కుమార్–ప్రేమలత దంపతులకు 2016 డిసెంబర్లో కార్తిజన్వి–కృతిజన్వి జన్మించారు. వీరికి తల్లిదండ్రులు ప్రతీ రోజు ఒకే రకమైన డ్రెస్‌లు వేయడంతో ఇరుగుపొరుగు వారికి గుర్తు పట్టడం కూడా కష్టమే. వాణి–వీణ రాయపర్తి గ్రామానికి చెందిన దొడ్డ కృష్ణమూర్తి, సత్యవతికి రెండో సంతానంగా మానస(వాణి)మౌనిక(వీణ) జన్మించారు. మొదటి నుంచి ఇద్దరు చదువులో ముందుండేవారు. మానస(వాణి) ఎంఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లో మెడికల్ కోడింగ్‌లో పని చేస్తోంది. మౌనిక(వీణ) బెంగళూరులో ఓప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఇద్దరిలో ఎవరొకరు ఇంటికొచ్చినా ఇప్పటికీ కాలనీవాసులు గుర్తుపట్టడానికి ఇబ్బందులు పడతారు. ఫుర్ఖాన్–అఫాన్ నర్సంపేట పట్టణానికి చెందిన మహ్మద్ ఫయిజుద్దీన్ అరిఫాబేగం దంపతులకు మొదటి సంతానంలో కవలలు జన్మించారు. ఫుర్ఖాన్–అఫాన్ వీరిద్దరూ ఇంట్లో, బయటా ఐక్యంగా ఉంటారు. అభిరుచులు, అలవాట్లు కూడా ఒకేలా ఉంటాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. అర్మన్‌షాహా–ఫర్మన్‌షాహా నర్సంపేటలో ఉపాధ్యాయుడు ఖాసీంషాహా హసీన దంపతుల కుమారులు అర్మన్‌షాహా–ఫర్మన్‌షాహా కవలలు. ఇద్దరూ ఒకే పోలికతో ఉండడంతో అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కవలలు పుట్టడం తమ అదృష్టమని తల్లిదండ్రులు చెబుతున్నారు. చదవండి: ఆ ఆలోచనతో 30 శాతం మరణం ముప్పు తగ్గుతుంది: హార్వర్డ్ పరిశోధన ప్రత్యేక గుర్తింపు! మా గ్రామంలో ఇంతమంది కవలలు ఉండడం సంతోషం. ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా ఊళ్లో జన్మించిన కవలలు అంతా వేరే ఊళ్లల్లో పనులు చేసుకుంటున్నా.. పండుగల పూట గ్రామానికి వస్తారు. అలాంటి సమయంలో ఒక్కోసారి తికమకగా ఉంటుంది. ఒక ఊరిలో ఒకటి లేదా రెండు కవలల జంటలుంటాయి. కానీ మా ఊళ్లో ఏకంగా 17 కవలల జంటలున్నాయి. మా ఊరికి ఇదో ప్రత్యేక గుర్తింపుగా కూడా చెప్పవచ్చు. – చిన్నాల తారశ్రీరాజబాబు, సర్పంచ్, పెర్కవేడు -
నేడు అంత ర్జాతీయ కవలల దినోత్సవం
సేమ్ టు సేమ్! సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఆ ఏడుగురు.. ఎవరు ఎక్కడుంటారో.. ఎవరికీ తెలియదు. కానీ అందులో ఒకే రూపం.. కలిగిన ఇద్దరు పిల్లలు.. ఒకే ఇంట్లో ఉంటే.. అబ్బో అది గొప్ప అనుభూతే.. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఒకే రూపంతో ఉండే కవలలంటే ఇష్టపడని హృదయముండదు. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా ప్రాణాలు వేరైనా.. పోలికొక్కటే అన్నవిధంగా చూపరులను ఆకట్టుకుంటున్న జిల్లాలోని పలువురిపై కథనం.. చిత్తూరు(గిరింపేట): ఒకే పోలికతో ఉంటూ సమరూప, సహజాత కవలలు అనిపించుకుంటున్నారు జిల్లాలోని కొందరు. జంటగా జన్మించిన వారి కోసం ప్రపంచం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది. ఆరోజే ఫిబ్రవరి 22.. అంతర్జాతీయ కవలల దినోత్సవం. ఈ సందర్భంగా పలుచోట్ల ఆదివారం కవల పిల్లల సమావేశాలు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు. ఆధ్యాత్మిక నగరంలో.. తిరుపతి గాందీరోడ్డు: తిరుపతి నగరంలోనూ కవల పిల్లలు ఒకే రూపంతో చూపరులను ఆకట్టుకుంటున్నారు. వారిలో కొందరు.. ఒక్క పాఠశాలలోనే 28 జతల కవలపిల్లలు ఒకటి రెండు కవల జంటలను చూస్తేనే ఆశ్చర్యం. అలాంటింది ఒకే చోట 28 జతల కవల పిల్లలను చూస్తే కచ్చితంగా సంభ్రమాశ్చర్యాలకు గురవ్వాల్సిందే. ఈ ఘనతను దక్కించుకుంది చిత్తూరు నగరంలోని క్యాంఫర్డు పాఠశాల. ఆ పాఠశాలలో చదివే కవల పిల్ల ల కోసం యాజమాన్యం 2006 నుంచి ఏటా వేడుకలు నిర్వహించి బహుమతులను అందజేస్తోంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. స్ప్రింగ్‌డేల్ స్కూల్లో.. తిరుపతి-కరుకంబాడి రోడ్డులోని స్ప్రింగ్‌డేల్ స్కూల్లో ఆదివారం కవలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న కవలలు ఒకేరకమైన దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. వీరితో విద్యార్థులు, ఉపాధ్యాయులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా పాఠశాల అధినేత కెఎస్. వాసు మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు కవలల దినోత్సవంపై కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. - తిరుపతి గాంధీరోడ్డు శ్రీకాళహస్తిలో.. పట్టణంలోని భాష్యం స్కూల్లో నాల్గవ తరగతి చదువుతున్న దక్షిత, దీక్షిత సవురూప కవలలు. పట్టణానికి చెందిన అరవింద్‌రెడ్డి, గీతాభవానీ దంపతుల సంతానం అయిన వీరు 2006లో జన్మించారు. ఒకేస్కూల్లో ఒకే తరగతిలో చదువుతున్న వీరిని చూసి తోటివిద్యార్థులు సంభ్రవూశ్చర్యాలకు గురౌతుంటారు. అదేవిధంగా పట్టణంలోని షేక్ జలాల్బాషా,షేక్ జిలానీల వుుద్దుల పిల్లలు షేక్ హసీనా,షేక్ సవీనా కవల పిల్లలు 2013లో జన్మించారు. వీరు కూడా ఒకే విధంగా ఉండి చూపరులకు కనువిందు కలిగిస్తున్నారు. - శ్రీకాళహస్తి జ్యోతిశ్రీ.. జయశ్రీ.. గొల్లవానిగుంట ఆటోనగర్ లో నివాసం ఉంటున్న యధ భూషణం, లేట్ మాధవికి కవల ఆడపిల్లలు. ఒకరు జ్యోతిశ్రీ, మరొకరు జయశ్రీలు తిరుచానూరులోని హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు. వీరిలో ఎవరు ఎవరో కనుక్కోలేక ఎన్నోసార్లు.. ఉపాధ్యాయులు, స్నేహితులు ఇబ్బంది పడ్డారు. తేజశ్విని.. లక్ష్మీప్రసన్న.. జిల్లాలోని సదుం మండలం పుట్టావారిపల్లిలో నివాసం ఉంటున్న పి. రెడ్డిశేఖర్, పి. విజయకు కవల ఆడపిల్లలు. వీరిలో మొదటి పాప పిఆర్. లక్ష్మీప్రసన్న, రెండవ పాప పిఆర్. తేజశ్విని ప్రస్తుతం అదేగ్రామంలో యూకేజీ చదువుతున్నారు. వీరి పాఠశాలకు వెళితే నవ్వుల పువ్వులే. తిరుపతి అన్నమయ్య సర్కిల్ వద్ద నివాసముంటున్న సహదేవ,అమృత దంపతుల సంతానం హేమవ తి, హేమలత. వీరు కవలలు. గేట్ కళాశాలలో బీబీఎం చదువుతున్నారు. ఒక్కోసారి వీరిని చూసి హేమావతి ఎవరు, హేమలత ఎవరో అని తల్లిదండ్రులే గుర్తు పట్టలేని పరిస్థితి. ఇక స్నేహితులకైతే రోజూ ఫజిలే.