Interview Committee
-
‘సాఫ్ట్‌వేర్‌లో పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’
సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లిన పదేళ్ల అనుభవం కలిగిన బెంగళూరు మహిళా అభ్యర్థినికి చేదు అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తాయని భావించిన తనను బేసిక్, థెయరీ ప్రశ్నలు అడగడంతో అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన ‘రెడిట్’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.‘నేను గత పదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. కంపెనీ మారాలని నిర్ణయించుకుని ఓ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్లాను. ఆంగ్యులర్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మొదలైన ఫ్రంటెండ్ టెక్నాలజీల్లో నాకు అనుభవం ఉంది. సాధారణంగా ఈ అనుభవ స్థాయిలో ఇంటర్వ్యూ చేసేవారు లాజికల్ థింకింగ్, పని అనుభవానికి సంబంధించి అడ్వాన్స్ కాన్సెప్ట్‌లు, రియల్‌లైఫ్ ఎక్స్పీరియన్స్, కోడింగ్ నైపుణ్యాలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ విచిత్రంగా థియరిటికల్ ప్రశ్నలపై దృష్టిపెట్టింది. సీఎస్ఎస్ ద్వారా భారత జాతీయ జెండాను డ్రా చేయమని అడిగారు. వెంటనే ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేశాను. అందులో అశోక చక్రాన్ని గీయమని అడిగారు. నేను దాన్ని కూడా డ్రా చేశాను. ఆపై అశోక చక్రం లోపల స్పైక్‌లు(ఆకులు) గీయమన్నారు. నేను వాటిని డ్రా చేయలేకపోయాను. వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె నా స్కిల్స్ పరీక్షించాలనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!‘ఫ్రంటెండ్ డెవలపర్‌గా పని చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు అనవసరం. వాస్తవానికి కాలేజీ చదువుతున్నపుడు ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాకు ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. నాకు చాలా చిరాకేస్తుంది. నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతున్నాను’ అని ఆమె పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పదేళ్లు అనుభవం ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రశ్నలు అవసరంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంత అనుభవం ఉన్నా బేసిక్ ప్రశ్నలకు ఎలా ఓపిగ్గా సమాధానం ఇస్తారో తెలుసుకోవడమే కంపెనీ ఉద్దేశమని ఇంకొందరు తెలిపారు. ఉద్యోగార్థుల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మరికొందరు చెబుతున్నారు. -
ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ
సాక్షి, కర్నూలు : జిల్లాలో గ్రామ వలంటీరు పోస్టులకు భారీ పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు ఆరుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 909 గ్రామ పంచాయతీల్లో 14,118 పోస్టులు ఉన్నాయి. వీటికి మొత్తం 83,123 మంది దరఖాస్తు చేసుకున్నారు. వివిధ కారణాల వల్ల 1,515 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 24 పరిశీలనలో ఉన్నాయి. మిగిలిన 81,584 ఇంటర్వ్యూకు అర్హత సాధించాయి. అభ్యర్థులకు గురువారం నుంచి ఈ నెల 23 వరకు ఆయా మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 800 దరఖాస్తులకు మించి ఉన్న మండలాల్లో అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేందుకు కలెక్టర్ అదనపు కమిటీలను ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి మండలంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఈఓఆర్డీలతో ఏర్పాటైన కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే.. 800 కంటే ఎక్కువ దరఖాస్తులు ఉన్న మండలాల్లో ఈ కమిటీతో పాటు మండల ప్రత్యేకాధికారి, వ్యవసాయాధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈతో ఒక కమిటీ, ఇంకా ఎక్కువ దరఖాస్తులు ఉంటే పీఆర్ డీఈ, డిప్యూటీ తహసీల్దార్, పీఆర్ ఏఈతో మరో కమిటీ ఉంటుంది. ఈ 20 మండలాల్లో... : 20 మండలాల్లో అత్యధిక దరఖాస్తులు వచ్చిన దృష్ట్యా వాటిలో మూడు కమిటీల చొప్పున ఇంటర్వ్యూలు చేయనున్నాయి. ఈ జాబితాలో ఓర్వకల్లు, అవుకు, వెల్దుర్తి, సీ బెళగల్, ఆస్పరి, నంద్యాల, డోన్, తుగ్గలి, ప్యాపిలి, నందవరం, ఆదోని, కల్లూరు, బేతంచెర్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, గోనెగండ్ల, కర్నూలు మండలాలు ఉన్నాయి. వీటిలో ఒక్కో మండలంలో 1,600కు మించి దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడు కమిటీలు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నాయి. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం పోస్టులను కేటాయిస్తున్నారు. మొత్తం పోస్టులు : 14,118 బీసీ : 4,092, ఎస్సీ : 2,120, ఎస్టీ : 850, పీహెచ్సీ : 422, జనరల్ : 6,634 -
‘ఇంటర్వ్యూ కమిటీ’కి పరిమిత అధికారాలు
♦ ప్రైవేటు వైద్య కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై హైకోర్టు ♦ సరైన విధివిధానాలున్నప్పుడు ఏకపక్షంగా వ్యవహరించడం తగదు ♦ మెరిట్ విద్యార్థినికి ఇంటర్వ్యూలో ఒక్క మార్కే ఇవ్వడంపై విస్మయం ♦ ఈ ఏడాది ఆ విద్యార్థినికి సీటు ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వ విధి విధానాలు స్పష్టంగా ఉన్నప్పుడు సంబంధిత కాలేజీల ఇంటర్వ్యూ కమిటీకి పరిమిత విచక్షణాధికారాలుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకేసారి వివిధ కాలేజీల్లోని సీట్లను విద్యార్థులు బ్లాక్ చేయకుండా ఉండేందుకు మాత్రమే ఇంటర్వ్యూ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొంది. మెరిట్ విద్యార్థినికి ఇంటర్వ్యూలో ఒక్క మార్కు మాత్రమే ఇవ్వడం అన్యాయమని మండిపడింది. ఒకే మార్కు ద్వారా సీటు కోల్పోయిన విద్యార్థిని సుమహితకు సీటు కేటాయించాలని కామినేని వైద్య కళాశాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఇంటర్లో 97.66 శాతం మార్కులు, ఎంసెట్‌లో 4,178వ ర్యాంకు సాధించిన సుమహితకు 2014-15 విద్యాసంవత్సరంలో కామినేని వైద్య కళాశాలలో సీటు పొందేందుకు యాజమాన్య కోటా కింద దరఖాస్తు చేసుకుంది. ఫీజు కోసం రూ.9 లక్షలు, నాలుగేళ్లకు రూ.36 లక్షల డీడీతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీకి సమర్పిం చింది. వాటిని తీసుకున్న కామినేని యాజమాన్యం కొంతకాలం తరువాత ఆమెకు తిరిగి ఇచ్చేసింది. తనకు సీటు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మెరిట్ లిస్ట్ తాలూకు రికార్డులను న్యాయమూర్తి పరిశీ లించారు. మెరిట్లో రెండోస్థానంలో సుమహితకు ఇంటర్వ్యూలో ఒక్క మార్కు మా త్రమే కేటాయించినట్లు న్యాయమూర్తి గుర్తిం చారు. మిగిలిన విద్యార్థులకు 3 నుంచి 14 మార్కులు కేటాయించిన కాలేజీల ఇంట ర్వ్యూ కమిటీ.. పిటిషనర్‌కు మాత్రమే ఒక్క మా ర్కు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. సీట్ల భర్తీ ప్రక్రియకు నిర్దిష్టమైన విధి విధానాలున్నప్పు డు అందుకు విరుద్ధంగా ఇంటర్వ్యూ కమిటీ వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు. సు మహిత విషయంలో ఇంటర్వ్యూ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.