♦ ప్రైవేటు వైద్య కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీపై హైకోర్టు
♦ సరైన విధివిధానాలున్నప్పుడు ఏకపక్షంగా వ్యవహరించడం తగదు
♦ మెరిట్ విద్యార్థినికి ఇంటర్వ్యూలో ఒక్క మార్కే ఇవ్వడంపై విస్మయం
♦ ఈ ఏడాది ఆ విద్యార్థినికి సీటు ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వ విధి విధానాలు స్పష్టంగా ఉన్నప్పుడు సంబంధిత కాలేజీల ఇంటర్వ్యూ కమిటీకి పరిమిత విచక్షణాధికారాలుంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.
ఒకేసారి వివిధ కాలేజీల్లోని సీట్లను విద్యార్థులు బ్లాక్ చేయకుండా ఉండేందుకు మాత్రమే ఇంటర్వ్యూ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొంది. మెరిట్ విద్యార్థినికి ఇంటర్వ్యూలో ఒక్క మార్కు మాత్రమే ఇవ్వడం అన్యాయమని మండిపడింది. ఒకే మార్కు ద్వారా సీటు కోల్పోయిన విద్యార్థిని సుమహితకు సీటు కేటాయించాలని కామినేని వైద్య కళాశాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు బుధవారం ఆదేశాలు జారీచేశారు.
ఇంటర్‌లో 97.66 శాతం మార్కులు, ఎంసెట్‌లో 4,178వ ర్యాంకు సాధించిన సుమహితకు 2014-15 విద్యాసంవత్సరంలో కామినేని వైద్య కళాశాలలో సీటు పొందేందుకు యాజమాన్య కోటా కింద దరఖాస్తు చేసుకుంది. ఫీజు కోసం రూ.9 లక్షలు, నాలుగేళ్లకు రూ.36 లక్షల డీడీతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీకి సమర్పిం చింది. వాటిని తీసుకున్న కామినేని యాజమాన్యం కొంతకాలం తరువాత ఆమెకు తిరిగి ఇచ్చేసింది. తనకు సీటు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మెరిట్ లిస్ట్ తాలూకు రికార్డులను న్యాయమూర్తి పరిశీ లించారు. మెరిట్‌లో రెండోస్థానంలో సుమహితకు ఇంటర్వ్యూలో ఒక్క మార్కు మా త్రమే కేటాయించినట్లు న్యాయమూర్తి గుర్తిం చారు. మిగిలిన విద్యార్థులకు 3 నుంచి 14 మార్కులు కేటాయించిన కాలేజీల ఇంట ర్వ్యూ కమిటీ.. పిటిషనర్‌కు మాత్రమే ఒక్క మా ర్కు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. సీట్ల భర్తీ ప్రక్రియకు నిర్దిష్టమైన విధి విధానాలున్నప్పు డు అందుకు విరుద్ధంగా ఇంటర్వ్యూ కమిటీ వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు. సు మహిత విషయంలో ఇంటర్వ్యూ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.
‘ఇంటర్వ్యూ కమిటీ’కి పరిమిత అధికారాలు
Published Fri, Sep 25 2015 2:55 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement