చెల్లని చెక్కు కేసులో ఆర్నెల్ల జైలు
ఖమ్మం లీగల్ : స్థానిక ద్వారకానగర్‌కు చెందిన జి.రవికుమార్‌కు చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఖమ్మం స్పెషల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి సతీష్‌కుమార్ ఆరు నెలల జైలు శిక్షతోపాటు ఫిర్యాదికి రూ.1.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం కవిరాజ్‌నగర్‌కు చెందిన గాజా రమేష్‌కుమార్ వద్ద రవికుమార్ తన కుటుంబ అవసరాల కోసం జనవరి 5, 2012న రూ.1.50 లక్షలు తీసుకుని ప్రాంసరీ నోటు రాసిచ్చాడు. అప్పు తీర్చమని అనేకసార్లు అడగ్గా.. జనవరి 20, 2013న రూ.1.50 లక్షలకు చెక్ ఇచ్చాడు. ఫిర్యాది ఆ చెక్కును తన ఖాతాలో జమ చేయగా.. అకౌంట్లో సరిపడినంత నగదు లేక చెక్కు నిరాదరణకు గురైంది. ఫిర్యాది చట్ట ప్రకారం లీగల్ నోటీసు పంపి.. కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైందని భావించి ముద్దాయికి 6 నెలల జైలు శిక్షతోపాటు ఫిర్యాదికి నష్టపరిహారంగా రూ.1.50 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. ఫిర్యాదిదారు తరఫు న్యాయవాదిగా మందడపు శ్రీనివాసరావు వ్యవహరించారు.