Invesco invites hub
-
జీల్లో ఇన్వెస్కో వాటా విక్రయం!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్(జీల్)లో ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్వెస్కో 7.74 శాతం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ.281.46 ధరలో 7,43,18,476 షేర్లను ఇన్వెస్కో ఓపెన్హీమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అమ్మివేసింది. వీటి విలువ దాదాపు రూ. 2,092 కోట్లుకాగా.. కోటికిపైగా షేర్లను మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ కొనుగోలు చేసింది. బీఎస్ఈ బల్క్‌డీల్ గణాంకాల ప్రకారం సేగంటి ఇండియా మారిషస్ 99 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. 7.8 శాతం వరకూ జీల్ వాటాను విక్రయించనున్నట్లు బుధవారమే ఇన్వెస్కో ప్రకటించింది. డెవలపింగ్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ టీమ్ నిర్వహిస్తున్న ఇతర ఫండ్స్‌కు తగిన విధంగా ఈ విక్రయాన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. వాటాదారులకు విలువ జీల్లో ఇన్వెస్కో అతిపెద్ద వాటాదారుకాగా.. ఈ అమ్మకం తదుపరి మూడు ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఇన్వెస్ట్మెంట్ టీమ్ కంపెనీలో కనీసం 11 శాతం వాటాతో నిలవనుంది. జీ– సోనీ విలీనానికి మద్దతివ్వనున్నట్లు ఇన్వెస్కో గత నెలలోనే ప్రకటించింది. తద్వారా గతంలో చేసిన డిమాండ్లనుంచి వెనక్కి తగ్గుతున్నట్లు తెలియజేసింది. ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులను బోర్డు నుంచి తొలగించాలని, ఇందుకు అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించాలని ఇన్వెస్కో పట్టుపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జీ– సోనీ విలీనంతో జీ వాటాదారులకు ఉత్తమ విలువ చేకూరనున్నట్లు అభిప్రాయపడటం గమనార్హం! ఇన్వెస్కో వాటా విక్రయ వార్తల నేపథ్యంలో జీల్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 285 వద్ద ముగిసింది. -
జీ మీడియా, ఇన్వెస్కో వివాదంపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్!
జీ ఎంటర్ ప్రైజెస్, ఇన్వెస్కో మధ్య వివాదంలో రిలయన్స్ పేరు రావడంపై చింతిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని రిలయన్స్ స్పష్టం చేసింది. జీ మీడియా సంస్థల్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ నుంచి వచ్చిన ఆఫర్ చాలా తక్కువ వ్యాల్యుయేషన్‌తో ఉందని జీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా షేర్ హోల్డర్లకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో రిలయన్స్ పేరు రావడంతో రిలయన్స్ స్పష్టతనిచ్చింది. 2021 ఫిబ్రవరి, మార్చిలో పునీత్ గోయెంకాతో తమ ప్రతినిధులు నేరుగా చర్చల్ని జరిపేందుకు ఇన్వెస్కో సహకరించిందని రిలయన్స్ తెలిపింది. తక్కువ ధరకే జీతో మా మీడియా ఆస్తులను విలీనం చేయడానికి మేము విస్తృత ప్రతిపాదన చేసాము. జీ సంస్థలతో పాటు తమ సంస్థల్ని వ్యాల్యుయేషన్ చేసేందుకు ఒకే తరహా ప్యారామీటర్స్ ఫాలో అయ్యామని రిలయన్స్ తెలిపింది. ఈ ప్రతిపాదనను అన్ని విలీన సంస్థలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. జీ వాటాదారులతో సహా అందరికీ గణనీయమైన విలువను సృష్టించడానికి ప్రయత్నించామని రిలయన్స్ తెలిపింది. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తోనే నిర్వహణను కొనసాగించడానికి రిలయన్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తుందని, వారి పనితీరును బట్టి ప్రతిఫలం అందిస్తుందని తెలిపింది.(చదవండి: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?) ఈ ప్రతిపాదనలో గోయెంకాను మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించాలన్న అంశం కూడా ఉందని, గోయెంకాతో పాటు టాప్ మేనేజ్మెంట్కు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ESOPs) ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉందని రిలయన్స్ తెలిపింది. అయితే ప్రిఫరెన్షియల్ వారెంట్స్ ద్వారా వాటాలు పెంచుకోవాలని వ్యవస్థాపక కుటుంబం భావించడంతో గోయెంకాకు, ఇన్వెస్కోకు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని రిలయన్స్ వివరించింది. అయితే మార్కెట్ కొనుగోళ్ల ద్వారా తమ పెట్టుబడులు పెంచుకోవచ్చని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు. ఇన్వెస్కో, జీ వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ డీల్‌పై చర్చలు ముందుగు సాగలేదని రిలయన్స్ స్పష్టం చేసింది. -
‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని
ఇండియాలోనే అతి పెద్ద టీవీ, ఎంటర్టైన్మెంట్ నెట్‌వర్క్‌గా చెప్పుకుంటున్న జీ - సోనీ విలీన ప్రక్రియలో మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్లు పట్టు వదిలేందుకు సిద్ధంగా లేరు. ఇన్వెస్కో లేఖ జీ లిమిటెడ్‌కి ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయోంకాను తొలగించడంతో పాటు ఆరుగురు డైరెక్టర్లను తొలగించాలంటూ జీలో మేజర్ షేర్‌హోల్డర్‌గా ఉన్న ఇన్వెస్కో జీ బోర్డును కోరింది. అందుకు గల కారణాలు వివరిస్తూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. తెరపైకి విలీనం ఇన్వెస్కో నుంచి లేఖ వచ్చిన వెంటనే స్పందించిన జీ బోర్డు ఇద్దరు డైరెక్టర్లను తప్పించింది. అనంతరం సోనీతో చర్చలు ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో జీ విలీనం అవుతున్నట్టు భారీ డీల్‌ని సెప్టెంబరు 22న ప్రకటించింది. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు సైతం పునీత్ గోయెంకానే ఎండీగా ఉంటాడని ప్రకటించింది. దీంతో వివాదం సమసిపోతుందని జీ భావించింది. ఇన్వెస్కో కోరినట్టు అత్యవసర సమావేశం నిర్వహించలేదు. న్యాయ పోరాటం జీలో మేజర్ షేర్ హోల్డర్‌గా తాము అభ్యంతరం చెప్పిన విషయాలపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడమే కాకుండా విలీన ప్రక్రియ జరపడం, ఆ తర్వాత పునీత్ గోయెంకానే తిరిగి ఎండీగా నియమించడం పట్ల ఇన్వెస్కో అసంతృప్తిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతుంది. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సోనికి చిక్కులు జీని విలీనం చేసుకోవడం ద్వారా ఒకే సారి అర్బన్, రూరల్ మార్కెట్లతో పాటు హిందీ, రీజనల్ లాంగ్వెజ్లలో మరింతగా విస్తరించాలనుకున్న సోనికి ఇన్వెస్కో వ్యవహరం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. జీ అంతర్గత సమస్యలు ఇప్పుడు సోనిని కూడా చుట్టుముట్టాయి నామ్‌కే వాస్తే సుభాష్ చంద్ర స్థాపించిన జీ మీడియాలో ప్రస్తుతం ఆయన వాటా కేవలం 5 శాతమే. చాలా మంది ఆ కంపనీలో పెట్టుబడులు పెట్టారు. నిన్నా మొన్న సోనీతో విలీన ప్రక్రియ ముగిసే వరకు ఇన్వెస్కో సంస్థ జీలో మేజర్ పెట్టుబడిదారుగా ఉంది. చదవండి: సోనీకి ‘జీ’ హుజూర్! -
పన్ను ఆదాతో పాటు రాబడులు
గత నెల రోజుల్లో మార్కెట్లలో భారీ పతనంతో ఇన్వెస్టర్లకు మంచి పెట్టుబడి అవకాశాలు అందివచ్చాయి. ఈ సమయంలో పెట్టుబడులపై మెరుగైన రాబడులకు తోడు, పన్ను ఆదా చేసుకోవాలని భావించే వారికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ పథకాలు (ఈఎల్ఎస్ఎస్) అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్ పథకాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఈ ఫండ్ బెంచ్ మార్క్‌తో పోటీ పడి మెరుగైన రాబడులను ఇస్తోంది. సెబీ ఫండ్స్ పథకాల్లో మార్పుల తర్వాత అంతకుముందు వరకు ప్రామాణిక సూచీగా బీఎస్ఈ 100 ఉంటే, ఆ స్థానంలో బీఎస్ఈ 200 వచ్చింది. ఇది మినహా పథకం పెట్టుబడుల విధానంలో మార్పు లేదు. ఏడాది, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో చూసుకున్నా బెంచ్ మార్క్ కంటే రాబడుల్లో ముందే ఉంది. అన్ని కాలాల్లోనూ మంచి పనితీరుతో అగ్ర స్థాయి పథకాల్లో నిలిచింది. పనితీరు, పెట్టుబడుల విధానం మూడేళ్ల కాలంలో చూసుకుంటే రాబడుల విషయంలో ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్ బెంచ్ మార్క్ కంటే ఒక శాతం మేర వెనుకబడింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 12.2 శాతం రిటర్నులను ఇచ్చింది. ఇదే సమయంలో బెంచ్ మార్క్ వృద్ధి 13.5 శాతంగా ఉండటం గమనార్హం. ఏడాది కాలంలో రాబడులు 12.1 శాతంగా ఉండగా, ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 21.5 శాతంగా ఉన్నాయి. యాక్సిస్ లాంట్ టర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్, హెచ్డీఎఫ్సీ ట్యాక్స్ సేవర్ పథకాల కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. ఆటుపోట్ల మార్కెట్లలో నష్టాలు ఎక్కువ కాకుండా చూడటంపైనా ఈ పథకం ఫండ్ మేనేజర్లు దృష్టి సారిస్తుంటారు. 2008, 2011 మార్కెట్ పతనాల్లో నష్టాలను పరిమితం చేయడమే కాకుండా, విభాగం సగటు రాబడులను మించి 1.5–4 శాతం అధిక లాభాలను ఇచ్చిన చరిత్ర ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చి కరెక్షన్ సమయంలో ఈక్విటీ పెట్టుబడులను 95 శాతం నుంచి 98 శాతానికి పెంచుకుంది. అంటే క్యాష్, డెట్ పెట్టుబడులను తగ్గించుకుంది. ఈ పథకం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. అధిక రాబడుల కోసం మిగిలిన మేర స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయిస్తుంది. గడిచిన ఆరు నెలల కాలంలో రంగాల వారీగా పెట్టుబడుల్లో పెద్దగా మార్పులు చేయలేదు. విద్యుత్, ఇండస్ట్రియల్ క్యాపిటల్ గూడ్స్, ఫెర్టిలైజర్ స్టాక్స్‌లో పెట్టుబడులను మాత్రం విక్రయించింది. ఫెర్రస్ మెటల్ స్టాక్స్‌ను యాడ్ చేసుకుంది. బ్యాంకులు, ఆటోమొబైల్, సాఫ్ట్వేర్ రంగాల స్టాక్స్‌లో పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, సాఫ్ట్వేర్ స్టాక్స్‌లో పెట్టుబడులను పెంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 38 స్టాక్స్ ఉన్నాయి. కొని, వేచి చూడటం అనే విధానాన్ని అనుసరిస్తుంది. టాప్ 5 స్టాక్స్‌లో పెట్టుబడులు 34 శాతం మేర ఉండటం గమనార్హం. ఇంధనం, ఆటోమొబైల్స్, సాఫ్ట్వేర్ రంగాలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చింది. ఫైనాన్షియల్స్, ఎఫ్ఎంసీజీ, కన్స్ట్రక్షన్ రంగాలకు ప్రాధాన్యం తగ్గించింది. -
ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్
దీర్ఘకాలంలో మంచి నిధిని సమకూర్చుకోవాలని ఆశించే వారు పరిశీలించ తగిన పథకాల్లో ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్ కూడా ఒకటి. సెబీ ఆదేశాలకు పూర్వం ఈ పథకం పేరు ‘ఇన్వెస్కో ఇండియా గ్రోత్’గా ఉండేది. సెబీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో మార్పులు, చేర్పులకు ఆదేశించిన నేపథ్యంలో ఈ పథకం పెట్టుబడుల విధానమూ మారిపోయింది. గతంలో మల్టీక్యాప్ ఫండ్‌గా ఉన్న ఇది ఎక్కువగా లార్జ్‌క్యాప్‌లో 70–80 శాతం పెట్టుబడులు పెట్టేది. ఇప్పుడు మార్పుల నేపథ్యంలో లార్జ్ అండ్ మిడ్‌క్యాప్‌గా మారిపోయింది. అంటే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో 35 శాతం చొప్పున కనీసం ఇన్వెస్ట్ చేయాలి. గత కొన్ని నెలలుగా ఈ పథకం తన పోర్ట్‌ఫోలియోకు మార్పులు చేసింది. మిడ్‌క్యాప్ విభాగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఫిబ్రవరి నుంచి చూస్తే మిడ్‌క్యాప్స్‌లో 27–34 శాతం మధ్య పెట్టుబడులు ఉన్నాయి. ఈ పథకం ప్రామాణిక సూచీ బీఎస్ఈ 100 నుంచి బీఎస్ఈ 250గా మారిపోయింది. పెట్టుబడుల విధానం ఈ పథకం గతంలో స్టాక్స్ ఎంపికకు బాటమ్ అప్ విధానాన్ని అనుసరించేది. మారిన సమీకరణాల నేపథ్యంలో బాటమ్ అప్, టాప్డౌన్ విధానాలను అనుసరించనుంది. ఆయా రంగాలకు సంబంధించిన అంశాలతో పని లేకుండా స్టాక్స్‌వారీగా ఎంపిక విధానం నుంచి, ఆర్థిక, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్టాక్స్ ఎంపికగా విధానం మారిపోయింది. అయినప్పటికీ ఈ పథకం మెరుగైన రాబడులను ఇస్తుందన్న అంచనా ఉంది. స్టాక్స్ ఎంపికలో మంచి ట్రాక్ రికార్డు, అన్ని కాలాల్లోనూ మంచి రాబడులను అందించిన పథకం కావడమే ఈ అంచనాలకు బలం. అధిక రిస్క్ తీసుకునే వారు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నా ఫర్వాలేదనుకునే వారు ఈ పథకాన్ని నిస్సంకోచంగా ఎంచుకోవచ్చు. గత పనితీరు ఏడాది నుంచి ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు నూతన ప్రామాణిక సూచీ అయిన బీఎస్ఈ 250తో పోలిస్తే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చూనిటీస్ 17.9 శాతం వార్షిక రాబడులను ఇస్తే, ప్రామాణిక సూచీ రాబడులు 14.9 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు 11.3 శాతం అయితే, ప్రామాణిక సూచీ రాబడులు 11.8 శాతం. ఐదేళ్ల కాలంలో ఈ పథకం 18.7 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇవ్వగా, ప్రామాణిక సూచీ రాబడులు 17.3 శాతంగా ఉన్నాయి. అంటే కేటగిరీని మించి రాబడులను అందించినట్టు తెలుస్తోంది. పథకం కింద ఉన్న నిధుల్లో 95 శాతాన్ని ఇన్వెస్ట్ చేసి నగదు నిల్వలను తక్కువే ఉంచుకుంది. 20 రంగాల నుంచి సుమారు 41 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. బ్యాంకింగ్ రంగానికి ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. 24 శాతం ఎక్స్పోజర్ కలిగి ఉంది. ఫైనాన్స్, పెట్రోలియం, సాఫ్ట్వేర్ రంగాల్లోనూ చెప్పుకోతగ్గ ఎక్స్పోజర్ తీసుకుంది. -
పెట్టుబడుల స్థిర వృద్ధి సాధనం..!
మంచి రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రచార, అవగాహన కార్యక్రమాల తోడ్పాటుతో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కూడా ఫండ్స్వైపు అడుగులు వేస్తున్నారు.అయితే, కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు, మెరుగైన రాబడులు కోరుకునే వారు, భారీ ఆటుపోట్లకు దూరంగా ఉండేవారు పరిశీలించతగిన పథకం ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్. ఇటీవలి మార్కెట్లలో నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో ఆదాయాలు, లాభాల్లో ఆరోగ్యకరమైన వృద్ధితో కూడిన పెద్ద కంపెనీలను నమ్ముకోవడం మంచి నిర్ణయమే. ఈ తరహా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే పథకమే ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్. పెట్టుబడుల విధానం ఈ పథకానికి తాహెర్బాద్షా, అమిత్ గనంత్ర మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. బాటమ్ అప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తున్నారు. దీని వల్ల రిస్క్‌ను తగ్గించడంతోపాటు అధిక రాబడులను అందించటానికి వీలవుతుంది. వృద్ధి, విలువ ఆధారంగా స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. దీంతో డౌన్‌సైడ్ (కొనుగోలు ధర నుంచి కిందకు) అవకాశాలు పరిమితంగా ఉంటాయి. సరైన ధరల వద్ద స్టాక్స్‌ను కొనుగోలు చేయడం రాబడులకు కీలకమన్న విషయం తెలిసిందే. ఈ ఫండ్ మేనేజర్లు అనుసరించే విధానంలో ఇది కూడా భాగమే. పథకం పోర్ట్‌ఫోలియోలో 36 స్టాక్స్ ఉంటే వీటిలో 75 శాతం వృద్ధి అవకాశాల ఆధారంగా ఎంపిక చేసినవి కావడం గమనార్హం. మిగిలినవి వ్యాల్యూ థీమ్ ఆధారంగా ఎంచుకున్నవి. ఈ విధానాల వల్లే పోటీ పథకాలు, బెంచ్ మార్క్‌తో పోలిస్తే ఈ పథకం మెరుగైన రాబడులతో ముందుంది. రాబడులు గడిచిన మూడేళ్లలో 27 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 13.7 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు మూడేళ్లలో 19 శాతం, ఐదేళ్లలో 8 శాతంగానే ఉండడం గమనార్హం. ఇక ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో రాబడులు 22.57 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం కన్జ్యూమర్ ఉత్పత్తులు, ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్ స్టాక్స్‌కు ఎక్కువ వెయిటేజీ కొనసాగిస్తోంది. -
హైదరాబాద్ లో ఇన్వెస్కో ఇన్నోవేషన్ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ దేశాల్లో ఇన్వెస్ట్ మెంట్ సేవలందిస్తున్న ఫైనాన్షియల్ దిగ్గజం ఇన్వెస్కో... టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు హైదరాబాద్‌లో తమ తొలి గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను ఆరంభించింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఉద్యోగులు, స్టార్టప్‌ల వినూత్న ఐడియాలను ప్రోత్సహించేందుకు ఈ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీటీవో డోనీ లోచన్ తెలిపారు. మంగళవారం దీన్ని ఆరంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘హబ్ ఆరంభం సందర్భంగా 24 గంటల పాటు అంతర్గతంగా మా ఉద్యోగుల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం. దీన్లో సుమారు 600 మంది పాల్గొంటున్నారు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఇన్వెస్కో దాదాపు 835 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తోందని, 6 వేల మంది పైచిలుకు ఉద్యోగులున్నారని సంస్థ గ్లోబల్ హెడ్ (స్ట్రాటెజీ ఇన్నోవేషన్ అండ్ ప్లానింగ్ విభాగం) డేవ్ డోసెట్ వివరించారు. భారత్‌లో 1100 మంది దాకా సిబ్బంది ఉన్నట్లు తెలిపారు.