మంచి రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రచార, అవగాహన కార్యక్రమాల తోడ్పాటుతో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కూడా ఫండ్స్‌వైపు అడుగులు వేస్తున్నారు.అయితే, కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు, మెరుగైన రాబడులు కోరుకునే వారు, భారీ ఆటుపోట్లకు దూరంగా ఉండేవారు పరిశీలించతగిన పథకం ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్. ఇటీవలి మార్కెట్లలో నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో ఆదాయాలు, లాభాల్లో ఆరోగ్యకరమైన వృద్ధితో కూడిన పెద్ద కంపెనీలను నమ్ముకోవడం మంచి నిర్ణయమే. ఈ తరహా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే పథకమే ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్.
పెట్టుబడుల విధానం
ఈ పథకానికి తాహెర్‌బాద్‌షా, అమిత్ గనంత్ర మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. బాటమ్ అప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తున్నారు. దీని వల్ల రిస్క్‌ను తగ్గించడంతోపాటు అధిక రాబడులను అందించటానికి వీలవుతుంది. వృద్ధి, విలువ ఆధారంగా స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. దీంతో డౌన్‌సైడ్ (కొనుగోలు ధర నుంచి కిందకు) అవకాశాలు పరిమితంగా ఉంటాయి. సరైన ధరల వద్ద స్టాక్స్‌ను కొనుగోలు చేయడం రాబడులకు కీలకమన్న విషయం తెలిసిందే. ఈ ఫండ్ మేనేజర్లు అనుసరించే విధానంలో ఇది కూడా భాగమే. పథకం పోర్ట్‌ఫోలియోలో 36 స్టాక్స్ ఉంటే వీటిలో 75 శాతం వృద్ధి అవకాశాల ఆధారంగా ఎంపిక చేసినవి కావడం గమనార్హం. మిగిలినవి వ్యాల్యూ థీమ్ ఆధారంగా ఎంచుకున్నవి. ఈ విధానాల వల్లే పోటీ పథకాలు, బెంచ్ మార్క్‌తో పోలిస్తే ఈ పథకం మెరుగైన రాబడులతో ముందుంది.
రాబడులు
గడిచిన మూడేళ్లలో 27 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 13.7 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో బెంచ్ మార్క్ రాబడులు మూడేళ్లలో 19 శాతం, ఐదేళ్లలో 8 శాతంగానే ఉండడం గమనార్హం. ఇక ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో రాబడులు 22.57 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం కన్జ్యూమర్ ఉత్పత్తులు, ఫైనాన్షియల్స్, ఇండస్ట్రియల్స్ స్టాక్స్‌కు ఎక్కువ వెయిటేజీ కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment