Investigated the case
-
ఐదేళ్ల తరువాత నిరవధిక విచారణ
బనశంకరి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో విచారణ పునఃప్రారంభం కానుంది. సుమారు ఐదేళ్ల కిందట... సెప్టెంబరు 05, 2017 రాత్రి గౌరీలంకేశ్ ఆఫీసు నుంచి రాజరాజేశ్వరినగరలో ఇంటికి చేరుకున్న సమయంలో దుండగులు ఆమెను పిస్టల్‌తో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో 17 మంది నిందితులు ఉన్నారు. కుట్రదారు అమోల్ కాళే, కాల్పులు జరిపిన పరశురామ్ వాగ్మోరా, బైక్ నడిపిన గణేశ్ మిస్కిన్ తో పాటు 17 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. వీరి తరఫున 60 మందికి పైగా న్యాయవాదులు వాదిస్తున్నారు. పోలీసులు దర్యాప్తును పూర్తిచేసి పలు చార్జిషీట్లను దాఖలు చేశారు. మతాన్ని కించపరచడమే హత్యకు కారణంగా ప్రకటించారు. ప్రతి రెండోవారంలో ఐదు రోజులు కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కర్ణాటక నేరాల నియంత్రణ చట్టం (కేసీఓసీఏ– కోకా) కోర్టు న్యాయమూర్తి సీఎం.జోషి శనివారం మార్గదర్శకాలను నిర్ణయించారు. విచారణ కొన్ని వారాల పాటు జరుగుతుంది. నెలలో ప్రతి రెండోవారంలో ఐదురోజుల పాటు విచారిస్తారు. తొలుత జూలై 4 నుంచి జూలై 8 వరకు వాదనలు నిర్వహిస్తామని న్యాయమూర్తి జోషి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో భౌతికస్థితిలోనే విచారణ జరపాలని నిందితుల తరఫు లాయర్లు కోరగా, జడ్జి ఏకీభవించలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ సాగుతుందని తెలిపారు. నిందితులు కొందరు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో, మరికొందరు ముంబైలోని ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నారు. న్యాయవాదులు నిందితులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని జడ్జి సూచించారు. (చదవండి: ట్రాఫిక్ జామ్‌పై నెటిజన్ వింత పోస్ట్.. వైరల్‌గా మారి నెట్టింట రచ్చ) -
దైవ దర్శనానికి వెళుతూ...
రఘునాథపల్లి /హన్మకొండ: దేవున్ని మనసారా దర్శించుకోవాలనుకున్న వారి కోరిక తీరకుండానే ఆ దైవం చెంతకు చేరిపోయారు. దైవ దర్శనానికి వెళుతున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం పాలైన విషాద ఘటన ఆది వారం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కోమల్ల, రఘునాథపల్లి మధ్యనగల వెంకటాయపాలెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. హన్మకొండ నక్కలగుట్టకు చెందిన ట్రాన్స్‌కోలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లుట్ల రవీందర్‌రెడ్డి (54), భార్య అనురాధ(46), కుమార్తె నితిక(24)తోపాటు సమీప బంధువు భువనేశ్వరి, డ్రైవర్ రాజుతో కలిసి తన టాటా సుమోలో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్‌లోని కొత్తబస్తీ చైతన్యపురికి చెందిన 12మంది ట్రావెల్ వ్యాన్‌లో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి మేడారం వెళ్తున్నారు. ఈ క్రమంలో వెంకటాయపాలెం వద్దకు చేరుకోగానే ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు వాహనాలు ఒక్కసారిగా ఢీకొన్నాయి. టాటాసుమో ట్రావెల్ వ్యాన్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టి అదే ఊపులో పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో రవీందర్‌రెడ్డి భార్య అనురాధ, కూతురు నితిక అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన రవీందర్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయాలపాలైన డ్రైవర్ రాజు, భువనేశ్వరిలను జనగామ ఏరి యా ఆస్పత్రికి తరలించారు. రవీందర్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్దమ్మాయికి వివాహమై హైద రాబాద్‌లో ఉంటున్నారు. సోమవారం అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు పేర్కొ న్నారు. స్వల్ప గాయాలతో.. ట్రావెల్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన చింతగట్ల అరుణ, దామోదర్‌రెడ్డి, అరుంధతి, జయపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డికి స్వల్పగాయాలు కాగా, మిగతావారు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జనగామ రూరల్ సీఐ సతీష్, టౌన్ సీఐ నర్సింహ ఘటనా స్థలికి చేరుకుని బాధితులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
తమ్ముడు సెల్‌ఫోన్ ఇవ్వలేదని..
యువతి ఆత్మహత్య సాక్షి, హైదరాబాద్: అడిగిన వెంటనే తమ్ముడు సెల్‌ఫోన్ ఇవ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకుంది. లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ ఎంఏ.జావీద్ కథనం ప్రకారం.. అహ్మద్కాలనీకి చెందిన షేక్ చాంద్, రజియాబేగం దంపతులకు సోఫియాబేగం, సాద్ సంతానం. కూతురు సోఫియాబేగం(17) మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. శుక్రవారం సాయంత్రం సాద్ సెల్ ఫోన్‌తో ఆడుతున్నాడు. తనకు ఫోన్ అవసరం ఉందని సోఫియా అడిగింది. అతను ఎంతకీ ఇవ్వకపోవడంతో ఇద్దరు గొడవపడ్డారు. గమనించిన తల్లి వీరిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సోఫియా గదిలోకి వెళ్లి కొక్కానికి ఉరి వేసుకుంది. రాత్రయినా ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులుతలుపులు తెరిచి చూశారు. యువతి కొక్కానికి వేలాడుతూ కనిపించింది. కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె చనిపోయిందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.