తమ్ముడు సెల్‌ఫోన్ ఇవ్వలేదని..
యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: అడిగిన వెంటనే తమ్ముడు సెల్‌ఫోన్ ఇవ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకుంది. లంగర్‌హౌస్ ఇన్‌స్పెక్టర్ ఎంఏ.జావీద్ కథనం ప్రకారం.. అహ్మద్‌కాలనీకి చెందిన షేక్ చాంద్, రజియాబేగం దంపతులకు సోఫియాబేగం, సాద్ సంతానం. కూతురు సోఫియాబేగం(17) మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. శుక్రవారం సాయంత్రం సాద్ సెల్ ఫోన్‌తో ఆడుతున్నాడు. తనకు ఫోన్ అవసరం ఉందని సోఫియా అడిగింది.
అతను ఎంతకీ ఇవ్వకపోవడంతో ఇద్దరు గొడవపడ్డారు. గమనించిన తల్లి వీరిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సోఫియా గదిలోకి వెళ్లి కొక్కానికి ఉరి వేసుకుంది. రాత్రయినా ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులుతలుపులు తెరిచి చూశారు. యువతి కొక్కానికి వేలాడుతూ కనిపించింది. కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె చనిపోయిందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.