వీఆర్ఏలు సమ్మెలో పాల్గొనాలి
హన్మకొండ అర్బన్ : సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు (డీఆర్) గురువారం నుంచి సమ్మెలో పాల్గొనాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ పిలుపునిచ్చారు. సమ్మెను పురస్కరించుకుని హన్మకొండలోని ఏకశిలా పార్కులో బుధవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగించాలన్నారు. వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించి పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు సతీష్, దేవిక, యాకయ్య, చంద్రకాంత్, సురేష్ పాల్గొన్నారు.