ఐఫోన్6ప్లస్ కెమెరాతో యాపిల్‌కు తలనొప్పులు?
ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ అనే రెండు మోడళ్లు అత్యంత నాజూగ్గా విడుదల చేసిన యాపిల్ కంపెనీ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో ఒక్కసారిగా తల ఎగరేసింది. అయితే.. ఉన్నట్టుండి ఆ కంపెనీకి ఒక్కసారిగా చిన్న ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు మోడళ్లలోనూ కెమెరా ఫోన్ నుంచి బయటకు పొడుచుకు వచ్చినట్లు కనిపిస్తుంది. దీన్ని 'ద వెర్జ్' వెబ్సైట్ ఎత్తి చూపింది. దీంతో యాపిల్ కంపెనీ తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషనల్ ఫొటోలు చాలా భారీసంఖ్యలో వెలువడటంతో దాన్ని తీసేయడం అంత సులభం కాదు.
వెర్జ్ వెబ్సైట్ అయితే ఏకంగా తన పేజి మొత్తాన్ని దానికే కేటాయించింది. ఐఫోన్ 6 అయితే 6.9 మిల్లీమీటర్లు, 6ప్లస్ అయితే 7.1 మిల్లీమీటర్లు మాత్రమే మందం ఉంటుందని కంపెనీ చెబుతున్నా.. కెమెరా రింగులతో కలిపి చెబుతున్నారా.. కాదా అనే విషయం తెలియదు. చాలా ఫోన్లలో కెమెరా ఇలా బయటకు వచ్చినట్లు ఉండటం మామూలే అయినా యాపిల్ ఫోన్లలో మాత్రం ఇలా ఎప్పుడూ లేదట. ఇలా ఉండటం వల్ల లెన్సు మీద గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం తెలియగానే యాపిల్ పోటీ కంపెనీ అయిన సోనీ.. దీనిమీద సెటైర్లు వేస్తూ ఫేస్బుక్లో పోస్టు కూడా పెట్టేసింది.