IPS allocation
-
IAS,IPS బదిలీల విచారణ అత్యవసరంగా చేపట్టాలని తెలంగాణ హైకోర్టును కోరిన కేంద్రం
-
కొత్త ఐపీఎస్‌లకు పోస్టింగ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 7గురు అధికారులను కేటాయించింది. తెలంగాణకు నలుగురు, ఆంధ్రకు ముగ్గురు చొప్పున కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన అధికారులు పరితోష్ పంకజ్(142 ర్యాంకు, బీహార్) సిరిశెట్టి సంకీత్(330 ర్యాంకు, తెలంగాణ) పాటిల్ కాంతిలాల్ సుభాష్(418 ర్యాంకు, మహారాష్ర్ట) అంకిత్ కుమార్ శంక్వార్(563 ర్యాంకు, ఉత్తరప్రదేశ్) ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఐపీఎస్‌లు అడహల్లి(440 ర్యాంకు, కర్ణాటక) పంకజ్ కుమార్ మీనా(666 ర్యాంకు, రాజస్థాన్) ధీరజ్ కునుబిల్లి(320 ర్యాంకు, ఆంధ్రప్రదేశ్) కాగా, తెలంగాణ నుంచి ఎంపికైన ఎంవీ సత్యసాయి కార్తీక్(103 ర్యాంకు)ను మహారాష్ర్టకు, షీతల్ కుమార్(417 ర్యాంకు)ను అసోంకు, రాజనాల స్మృతిక్(466 ర్యాంకు)ను ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించింది. -
మిడిల్ క్లాస్.. ఐపీఎస్
‘కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అవుతాడా..! అంటూ ఎగతాళి’ ‘ఆటో డ్రైవర్ కొడుకుకు సివిల్స్ కోచింగ్ అవసరమా? అంటూ గేలి’ ‘వ్యవసాయదారుడి కుమారుడు పోలీసా?’ అంటూ ఆశ్చర్యం..’ ..వారి లక్ష్యం కోసం శ్రమిస్తున్న సమయంలో సమాజంలో చాలా మంది ఇలా వెనుక నుంచి వెక్కిరించినవారున్నారు. అలాంటి వారి అంచనాలు తప్పు అంటూ.. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిలంతా నేడు ఐపీఎస్ అధికారులయ్యారు. కల సాకారం చేసుకున్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఎంతటి సుదూర లక్ష్యమైనా చిన్నబోతుంది అనడానికి ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులే మంచి ఉదాహరణ. సివిల్స్ ఛేదించడానికి మునుపటి స్థాయిలో కష్టపడక్కర్లేదని, ఇంటర్నెట్ ఉండటంతో పట్టుదల ఉన్న వారు ఎవరైనా సివిల్స్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని భరోసా కల్పిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం 11 మంది ఐపీఎస్‌లను కేటాయించింది. వారిలో నలుగురు ‘సాక్షి’తో మాట్లాడారు. అఖిల్ మహాజన్,బాలస్వామి, రోహిత్‌రాజు, రూపేశ్ చెన్నూరి.. అంతా లోకల్ బ్యాచ్. వీరిలో అఖిల్ కూకట్‌పల్లిలో సాధారణ బ్యాచిలర్. బాలస్వామి ఓయూలో పాఠాలు చెప్పిన అసిస్టెంట్ ప్రొఫెసర్. రోహిత్‌రాజు, బాలస్వామి కిట్స్ కాలేజీలో అల్లరి చేసిన కుర్రాళ్లే. అందరిదీ మిడిల్‌క్లాస్ నేపథ్యమే. వారి స్వప్నం వారిని వీఐపీలుగా మార్చింది. లా అండ్ ఆర్డర్‌ను కాపాడే ఐపీఎస్‌లను చేసింది. నాన్నే నాకు స్ఫూర్తి... నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోనే. నాన్న అప్పట్లో సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్. కిట్స్‌లో ఇంజనీరింగ్ చేశా. నాన్నను చూసి చాలా స్ఫూర్తి పొందాను. అందుకే ఐపీఎస్ ఎంచుకున్నా. 2013లో డిగ్రీ అయ్యాక ఐపీఎస్ సాధించాలన్న కసి పెరిగింది. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. ఎట్టకేలకు సాధించా. చాలా మంది కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ అవ్వడమేంటి? అనుకున్నారు. కానీ నా కలముందు ఆ మాటలు చిన్నవైపోయాయి. లక్ష్యానికి పేదరికం అడ్డుకాదు. కల నెరవేరే దాకా వెనకడుగు వేయకండి. – రోహిత్‌రాజు దూరవిద్యతో నెరవేరిన కల.. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ నా కల. మాది మహబూబ్‌నగర్‌లో చిన్న వ్యవసాయ కుటుంబం. ఇంటర్‌లోనే జాబ్ రావడంతో చేరాను. అయినా కల మీద మమ కారంతో దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశా. తరువాత ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. నిజాం కాలేజీలోనూ పాఠాలు బోధించా. ఏడోసారి సివిల్స్ రాసి ఎట్టకేలకు ఎంపికయ్యా. – బాలస్వామి లక్ష్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు.. మాది వరంగల్ జిల్లా హసన్‌పర్తి. నాన్న ఆటోడ్రైవర్, హసన్‌పర్తి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను. 2013లో వరంగల్ కిట్స్‌లో ఇంజనీరింగ్ చేశా. తరువాత ఒక సంస్థలో ఉద్యోగం చేశాను. కానీ, ఏనాడూ నా లక్ష్యాన్ని మర్చి పోలేదు. ఆటోడ్రైవర్ కొడుకు ఐపీఎస్ చదవడమేంటని ఎంత మంది అనుకున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గలేదు. – రూపేశ్ చెన్నూరి ఎన్నడూ రాజీపడవద్దు... మాది జమ్మూ. కుటుంబ నేపథ్యం వ్యాపారం. 2011లో హైదరాబాద్ జేఎన్టీయూలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. తరువాత మైక్రోసాఫ్ట్‌లో చేరాను. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ నా కల. అందుకే ఉద్యోగం వదిలేశా. 2013లో సివిల్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించా. 2017లో సివిల్స్‌కు సెలక్టయ్యా. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లు ఏనాడూ రాజీపడవద్దు. – అఖిల్ మహాజన్ -
కొత్త ఐపీఎస్‌లు వస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త ఐపీఎస్ అధికారులు రాబోతున్నారు. మొత్తం 11 మందిని కేంద్ర హోంశాఖ తెలంగాణకు ఇటీవల కేటాయించింది. వీరు సెప్టెంబర్ నాటికి శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. అక్టోబర్ చివరివారం లేదా నవంబర్ తొలివారంలో వీరంతా బాధ్యతలు స్వీకరిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణకు ఈ ఏడాది 11 మంది ఐపీఎస్ అధికారుల కొరత ఏర్పడనుంది. వాస్తవానికి ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా మొత్తంగా 40 మంది ఐపీఎస్ అధికారులు కావాలని కేంద్రాన్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ నెలలోనే బదిలీలు, పదోన్నతులు: జూన్‌లో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లు రిటైర్ కానుండటంతో హోంశాఖ ఇప్పటికే బదిలీలు, పదో న్నతులపై కసరత్తు పూర్తి చేసింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఐజీల పదోన్నతుల విషయంలోనూ ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐపీఎస్‌లకు డీఐజీలు, ఐజీలుగా పదోన్నతి కల్పించింది. కానీ సాంకేతిక కారణాలు, కరోనా కేసులు, లాక్డౌన్ నేపథ్యంలో నలుగురు ఐజీ ర్యాంకు అధికారులకు పదోన్నతి కల్పించే ఫైలు ముందుకు కదలలేదు. వీరికి కూడా ఇదే నెలలోనే పదోన్నతులు వస్తాయని సమాచారం. -
యూపీ సిఫారసులు ఇక్కడొద్దు..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో ఐపీఎస్‌ల కేటాయింపుపై అగర్వాల్ కమిటీ చేసిన సిఫారసులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు వర్తింపచేయవద్దని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యుష్ సిన్హా కమిటీని కోరారు. రాష్ట్రంలోని 258 ఐపీఎస్ పోస్టుల్లో 51 ఖాళీగా ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు 151 పోస్టులు (58.37 శాతం), తెలంగాణకు 107 పోస్టులు (41.63 శాతం) కేటాయించాలి. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రతి వంద ఐపీఎస్ పోస్టులకు గాను ఐపీఎస్ కన్ఫర్మేషన్ పొందినవారు 33 మంది ఉండాలి. మిగతా పోస్టుల్లోనూ 2/3 వంతు రాష్ట్రేతరులు, 1/3 వంతు సొంత రాష్ట్రం వారు ఉంటారు. అగర్వాల్ కమిటీ సిఫారసులను అమలు చేస్తే డెరైక్ట్ ఐపీఎస్‌లను స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఐపీఎస్‌గా కన్ఫర్డ్ అధికారులను నాన్లోకల్స్గా పరిగణిస్తారు. వీరి కేటాయింపులో మెరిట్ లిస్ట్ ఆధారంగా రోస్టర్ విధానాన్ని అవలంబిస్తారు. దీంతో తెలంగాణ, సీమాంధ్రలకు చెందినవారు అటూఇటూ మారవచ్చు. ఇది ఇబ్బందికరంగా తయారవుతుందని, వారిని కూడా డెరైక్ట్ ఐపీఎస్‌ల మాదిరిగానే కేటాయించాలని ప్రత్యూష్ సిన్హా కమిటీకి అధికారులు విజ్ఞప్తి చేశారు.