Iran cartoonist
-
నర్గేస్ మొహమ్మదికి నోబెల్ శాంతి అవార్డు.. ఆమె ఏ దేశమంటే?
స్టాక్‌హోమ్: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. 2023 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్ మొహమ్మదిని వరించింది. వివరాల ప్రకారం.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళ నర్గేస్ మొహమ్మది గెలుచుకున్నారు. కాగా, నర్గేస్ మొహమ్మది.. ఇరాన్లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు శాంతి బహుమతి లభించింది. BREAKING NEWS The Norwegian Nobel Committee has decided to award the 2023 #NobelPeacePrize to Narges Mohammadi for her fight against the oppression of women in Iran and her fight to promote human rights and freedom for all.#NobelPrize pic.twitter.com/2fyzoYkHyf — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇక, ఇరాన్ మహిళల కోసం నర్గేస్ మొహమ్మది వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. మహ్మదీ ఇంకా జైలులోనే ఉన్నారు. 2023 #NobelPeacePrize laureate Narges Mohammadi’s brave struggle has come with tremendous personal costs. The Iranian regime has arrested her 13 times, convicted her five times, and sentenced her to a total of 31 years in prison and 154 lashes. Mohammadi is still in prison. pic.twitter.com/ooDEZAVX01 — The Nobel Prize (@NobelPrize) October 6, 2023 ఇది కూడా చదవండి: జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్ -
ఆ శక్తి నీలోనే ఉంది!
కొన్ని జీవితాలు కల్పన కంటే ‘చిత్ర’ంగా ఉంటాయి. ఇరాన్ కార్టూనిస్ట్ అలీ దురాని జీవితం కూడా అంతే. 21 సంవత్సరాల వయసులో దేశం దాటిన అలీ అనుకోని పరిస్థితులలో ఆస్ట్రేలియాలోని ఒక దీవిలో చిక్కుకుపోయాడు. అది మామూలు దీవి కాదు. ఖైదీలను నిర్బంధించే దీవి. నరకానికి నకలుగా నిలిచే దీవి. ఏ స్వేచ్ఛ కోసం అయితే తాను దేశం దాటాడో ఆ స్వేచ్ఛ అణువంత కూడా లేని చీకటి దీవిలో నాలుగు సంవత్సరాల పాటు చిక్కుకుపోయాడు. తన మానసిక పరిస్థితి అదుపు తప్పుతున్న పరిస్థితులలో ‘నన్ను నేను మళ్లీ వెలిగించుకోవాలి’ అనుకున్నాడు. అలా జరగాలంటే ప్రతి వ్యక్తి తనలోని శక్తులను వెదుక్కోవాలి. అలీ దురానీలో ఉన్న శక్తి ఏమిటి? బొమ్మలు వేయడం. తన వైట్ టీషర్ట్‌పై ఆస్ట్రేలియా పటం వేసి అందులో రెండు కన్నీటిచుక్కలు చిత్రించాడు. ‘ఐయామ్ వోన్లీ ఏ రెఫ్యూజీ’ అని రాశాడు. అలా మొదలైంది బొమ్మల ప్రయాణం. కొందరు అధికారులు కరుకుగా వ్యవహరించినా, కొందరు అధికారులు మాత్రం అలీపై సానుభూతి చూపేవారు. ‘బాధ పడకు. నీకు అంతా మంచే జరుగుతుంది’ అని ధైర్యం ఇచ్చేవారు. నరకప్రాయమైన తన జీవితంలో ఇంటర్నెట్ అనే అరుదైన అదృష్టం దూసుకువచ్చింది. ప్రతి ఖైదీ వారానికి ఒకసారి నలభై అయిదు నిమిషాల పాటు ఇంటర్నెట్ను ఉపయోగించుకునేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం దయ తలిచింది. అక్కడ బలహీనమైన ఇంటర్నెట్...అయినప్పటికీ అది అతడికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. తాను గీసిన బొమ్మలను ఫేస్బుక్లాంటివాటిలో పోస్ట్ చేయడం మొదలుపెట్డాడు. సరిౖయెన సాంకేతిక సదుపాయాలు లేక ఈ పని కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో! స్వేచ్ఛ కోసం తపించే అలీ బొమ్మలు నార్వేకు చెందిన ఇంటర్నేషనల్ సిటీస్ ఆఫ్ రెఫ్యూజీ నెట్వర్క్(ఐకార్న్) దృష్టిలో పడ్డాయి. ఆ సంస్థ చొరవతో ఎట్టకేలకు స్వేచ్ఛాప్రపంచంలోకి వచ్చాడు. వ్యక్తిత్వవికాస తరగతుల్లో అలీ దురాని జీవితం పాఠం అయింది. ప్రసంగం అయింది. ‘నువ్వు అత్యంత బలహీనంగా మారిన పరిస్థితులలో కూడా, నిన్ను బలవంతుడిని చేసే బలం ఎక్కడో కాదు నీలోనే ఉంటుంది. అది నిన్ను చిగురించేలా చేస్తుంది. శక్తిమంతుడిలా మారుస్తుంది’ అనే సందేశాన్ని అలీ జీవితం ఇస్తుంది. -
ఉతికి ఆరేసినచో...
కొందరు నవ్వించడానికి రకరకాల ప్రయత్నిస్తారు. వారి వీర ప్రయత్నాలను చూసి మనకు నీరసం వస్తుంది తప్ప నవ్వు మాత్రం రాదు. అయితే కొందరు పెద్దగా ఏ ప్రయత్నమూ చేసినట్లు కనిపించరు. మౌనంగా నవ్వుల మంత్రదండాన్ని తిప్పుతారు. అంతే! మనకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. ఈ రెండో కోవకు చెందినవాడు ఇరాన్ కార్టూనిస్ట్ మెహదీ అలిబెజీ. ఆయన వర్ణరేఖలు ఎలాంటి శబ్దాడంబరం లేకుండానే గిలిగింతలు పెడతాయి. ఇరాన్లో అడుగు పెట్టగానే కళా హృదయులకు ‘కార్టూన్ల దేశం’లో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అంతటా మహామహులు కనిపిస్తూనే ఉంటారు. ఒకరిని చూసి ‘మహాను భావా మీ కార్టూన్ ఉంది చూశారూ’ అనేలోపే అభిమాన కార్టూనిస్ట్ మరెవరో కనిపిస్తూనే ఉంటారు. ఆ దేశం నిండా అంత గొప్ప కార్టూనిస్టులన్నారు మరి. వాళ్లలో ఒకరు మెహదీ. మెహదీ హసన్ గజల్స్ వింటుంటే, అమృతం పరవళ్లు తొక్కుతున్న అనుభూతి కలుగుతుంది. మెహదీ హసన్ రేఖల్లో నవ్వులగంగ ఉప్పొంగిపోతుంది. ‘భాషతో నీకు పనిలేదు’ అన్నట్టుగా ఒక్క అక్షరం లేకుండానే అందమైన కార్టూన్లను అందించిన గొప్ప కార్టూనిస్టు మెహదీ. సామాజిక, రాజకీయ అంశాలే కాదు... ఆయన ఆయన దృష్టి నుంచి ఏ ఒక్క విషయమూ తప్పిపోదు. ‘రవి గాంచని చోటు కవిగాంచును’ అన్న నానుడిని, ‘కవి గాంచని చోటును సైతం కార్టూనిస్ట్ గాంచును’ అని మార్చేశారు మెహదీ! పందొమ్మిదో ఏట నుంచి నవ్వులు పూయిస్తున్న మెహదీ... ఇప్పుడు ఓ పే....ద్ద నవ్వుల తోటకు యజమాని. ఆ తోటలో పూసిన ఒక పువ్వు ఇది. దాని హాస్య పరిమళాన్ని హాయిగా ఆస్వాదించండి!