ఇరాన్ చేతిలో భారత్ ఓటమి
బెంగళూరు : ఫుట్‌బాల్ ప్రపంచకప్-2018 క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్‌కు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. ఇరాన్ జట్టుతో మంగళవారం స్థానిక కంఠీరవ స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో భారత్ 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అంతర్జాతీయస్థాయిలో తగినంత అనుభవం లేకపోవడం, ఆటతీరు పరంగా ప్రత్యర్థికంటే మెరుగ్గా లేకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. రక్షణ పంక్తిలో ఆర్నబ్ మోండల్, సందేశ్‌లు రాణించడంతో తొలి అర్ధభాగంలో భారత్ ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకుంది.
అయితే రెండో అర్ధభాగంలో ఇరాన్ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించింది. 29వ నిమిషంలో సర్దార్ అజ్మౌన్ గోల్‌తో ఖాతా తెరిచిన ఇరాన్‌కు అంద్రానిక్ (47వ నిమిషంలో), మెహదీ తరోమి (51వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇంతకుముందు ఒమన్, గ్వామ్ జట్ల చేతిలో భారత్ ఓడింది.