ఇరాకీ సేనలకు తీవ్ర ప్రతిఘటన
మోసుల్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు పట్టున్న మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇరాకీ సేనలకు తీవ్ర ప్రతిఘటన ఎందురవుతోంది. ఇరాకీ సేనలు శనివారం ఉదయం మోసుల్ పట్టణ తూర్పు ప్రాంతం ముహరబీన్, ఉలామాలకు చేరుకోగా.. అక్కడ ఐఎస్ ఉగ్రవాదులతో భీకరపోరు జరుగుతోందని ఇరాకీ స్పెషల్ ఫోర్సెస్ అధికారి సమి అల్ అరిది వెల్లడించారు. ఐఎస్ ఉగ్రవాదులు స్నిపర్ రైఫిల్స్, గ్రెనేడ్లతో ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన వెల్లడించారు. భీకర పోరుతో ఈ రెండు ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయని అన్నారు.
ఇస్లామిక్ స్టేట్‌కు పట్టున్న మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరాకీ సేనలు అక్టోబర్ 17 న ఆపరేషన్ ప్రారంభించాయి. అమెరికా బలగాలు 2011లో ఇరాక్‌ను వదిలివెళ్లిన అనంతరం అక్కడ చేపడుతన్న భారీ మిలిటరీ ఆపరేషన్ ఇదే. మోసుల్‌ను కోల్పోతే ఇస్లామిక్ స్టేట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది.