iron gate
-
భార్య హత్యకు స్కెచ్.. ఊహించని పరిణామంతో పరుగులు
ఆ తాగుబోతు భర్తతో రోజూ ఆమెకు గొడవే. ఇక భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అది అవమానంగా భావించి.. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. చివరికి ఆ భర్తకే పెద్ద షాకే తగిలింది. భార్యకు బదులుగా ఆమె తల్లి కన్నుమూసింది. దీంతో ఆ భర్త అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా కోట్వాలి స్టేషన్ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం తాగుతూ ఉండే ఆ భర్త.. రోజూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తను భరించలేక.. నానా తిట్లు తిట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న ఆ తాగుబోతు.. అత్తింటికి వెళ్లి మరీ భార్యను చంపాలని అనుకున్నాడు. సోమవారం సాయంత్రం అత్తింటికి వెళ్లి.. బయట ఉన్న ఇనుప గేటుకు కరెంట్ వైర్లను కనెక్ట్ చేశాడు. అయితే భార్య బదులు ఆమె తల్లి వచ్చి గేట్‌ను ముట్టుకుంది. దీంతో కరెంట్ షాక్‌తో విలవిలలాడి అక్కడికక్కడే ఆ మహిళ(55) మృతి చెందింది. అది చూసి స్థానికులు కేకలు వేయగా.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురై ఆ భర్త అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా.. పరారీలో ఉన్న తాగుబోతు భర్త గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇదీ చదవండి: గంజాయికి బానిసైన కొడుకు.. నల్లగొండలో దారుణ హత్య -
యోగి కార్యాలయం గేటుపడి బాలిక మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం సిద్దం చేస్తున్న కార్యాలయాల సముదాయం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల పాపపై ఇనుప గేటు పడి మృత్యువాత పడింది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఉన్నప్పటి నుంచి ‘లోక్ భవన్’ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దానికి అమర్చిన ఓ ఇనుప గేటు వద్ద కిరణ్ అనే బాలిక ఆడుకుంటుండగా అనూహ్యంగా ఆ పాపపై గేటు పడింది. దీంతో హుటాహుటిన ఆ పాపను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలుకోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. లోక్ భవన్లో సహజంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అందులోనే కేబినెట్, ఇతర ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తుంటారు.