
యోగి కార్యాలయం గేటుపడి బాలిక మృతి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం సిద్దం చేస్తున్న కార్యాలయాల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
దానికి అమర్చిన ఓ ఇనుప గేటు వద్ద కిరణ్ అనే బాలిక ఆడుకుంటుండగా అనూహ్యంగా ఆ పాపపై గేటు పడింది. దీంతో హుటాహుటిన ఆ పాపను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలుకోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. లోక్ భవన్‌లో సహజంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అందులోనే కేబినెట్, ఇతర ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తుంటారు.