iron scale
-
విద్యార్థిని ఐరన్ స్కేల్‌తో తలపై బాదిన టీచర్
కుషాయిగూడ: ఓ టీచర్ ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్ స్కేల్‌తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్ ప్రిన్సిపల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారు. హెచ్‌బీకాలనీలో నివసించే భార్గవి కుమారుడు నిఖిల్‌సాయి ఈసీఐఎల్‌లోని యస్ఆర్ డీజీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం టీచర్ శశికళ క్లాస్ తీసుకునేందుకు తరగతి గదికి వెళ్లారు. అల్లరి చేస్తున్న విద్యార్థులను వారిస్తున్న క్రమంలో నిఖిల్సాయిని ఆమె ఐరన్ స్కేల్‌తో తలపై కొట్టారు. దీంతో రక్తస్రావమై బాలుడి తలకు గాయమైంది. దీంతో జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. బాలుడి తల్లి భార్గవి ప్రిన్సిపల్‌ను నిలదీయగా..ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాలుడి తాతయ్య దయానంద్‌తో కలిసి ఆమె కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా 5 గంటలు స్టేషన్లోనే ఉంచారు. రాత్రి 11 గంటల సమయంలో వారుఅక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం కాస్తా మీడియాకు పొక్కడంతో మంగళవారం ఉదయం పోలీసులు బాధితులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేపట్టి బాలుడిని కొట్టిన టీచర్‌తో పాటు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశామన్నారు. -
దారుణం : స్కేలుతో చేయి విరగ్గొట్టిన టీచర్
సాక్షి, హైదరాబాద్ : మీర్పేట్లోని సత్యం టెక్నో కిడ్స్ ప్లేస్కూల్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించింది. 3వ తరగతి చదువుతున్న సాయితేజ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ సుజాత ఐరన్‌స్కేల్‌తో చితకబాదడంతో ఆ బాలుడి ఎడమచేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటన గురించి ఆరా తీయడానికి స్కూల్‌కు వెళ్లగా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇనుపస్కేలుతో కొట్టిన ఉపాధ్యాయుడి అరెస్టు
పశ్చిమబెంగాల్లో ఓ విద్యార్థిని ఇనుప స్కేలుతో కొట్టినందుకు ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కోల్‌కతాకు 15 కిలోమీటర్ల దూరంలో హౌరా జిల్లాలో జరిగింది. తమ అబ్బాయి పక్కనే ఉన్న క్లాస్‌మేట్‌ను పెన్ను అడిగి తీసుకుంటుండగా, హిందీ టీచర్ దూరం నుంచి ఇనుప స్కేలును విసిరేశారని, క్లాసులో ఎందుకు మాట్లాడతావంటూ కోపంగా తిట్టారని అతడి తల్లిదండ్రులు తెలిపారు. స్కేలు బాగా గట్టిగా తగలడంతో తమ అబ్బాయి స్పృహతప్పి పడిపోయాడని, దాంతో స్కూలు వర్గాలు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాయని చెప్పారు. అక్కడ చికిత్స చేసి పిల్లాడిని ఇంటికి పంపేశారు. మర్నాటి ఉదయం విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. పిల్లాడు బాగా భయపడిపోయాడని, ఇప్పుడు స్కూలుకు కూడా వెళ్లనని చెబుతున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.