సాక్షి, హైదరాబాద్ : మీర్‌పేట్‌లోని సత్యం టెక్నో కిడ్స్ ప్లేస్కూల్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించింది. 3వ తరగతి చదువుతున్న సాయితేజ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ సుజాత ఐరన్‌స్కేల్‌తో చితకబాదడంతో ఆ బాలుడి ఎడమచేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటన గురించి ఆరా తీయడానికి స్కూల్‌కు వెళ్లగా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment