irrigation departmentn
-
సాగునీటి శాఖలో 700 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ఫైలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు 378 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేశారు. ఈ పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న ఇతర పోస్టులు కలిపి మొత్తంగా శాఖ పరిధిలో 1,167 ఖాళీలున్నట్లు ఇరిగేషన్ శాఖ గుర్తించింది. ఇందులో తొలి విడతలో భాగంగా 700 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించారు. భర్తీ చేయనున్న ఏఈఈ పోస్టుల్లో సివిల్‌కు సంబంధించి 310, మెకానికల్ 58, ఎలక్ట్రికల్ 200 ఉండనున్నాయి. -
డీఈఈ.. లంచావతారం
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్) : పెద్దపల్లి జిల్లాలో నీటిపారుదల శాఖలో డీఈఈగా విధులు నిర్వర్తిస్తున్న రవికాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలో చెరువుల్లో మట్టి తరలింపు వ్యవహారంపై ఇటీవల పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్ శ్రీదేవసేన స్థానిక ఇరిగేషన్ శాఖ ఈఈ రవికుమార్‌ను 15రోజలు క్రితమే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన రవికాంత్ రెండు వారాలకే చేతివాటం ప్రదర్శించాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిప కాంట్రాక్టర్ కావటి రాజు ఇటీవల మిషన్‌కాకతీయలో రూ.కోటి పనులు చేశాడు. రెండేళ్ల కాలంలో రూ.60 లక్షల మేరకు బిల్లులు తీసుకున్న రాజుకు ఇరిగేషన్‌శాఖ నుంచి మరో రూ.30 లక్షలు రావాల్సి ఉంది. వీటికోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరగగా ఇరిగేషన్ డీఈఈ రవికాంత్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో చివరికి ఏసీబీని ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు. పథకం ప్రకారం రూ.లక్ష ఏకకాలంలో చెల్లిస్తే సదరు అధికారికి అనుమానం కలుగుతుందని రాజు తనవద్ద రూ.80 వేలు ఉన్నాయంటూ శుక్రవారం మధ్యాహ్నం అధికారి వద్దకు వెళ్లాడు. అయితే బిల్లు చెల్లింపునకు ఒకే చెప్పిన డీఈఈ రవికాంత్ తన సొంత డ్రైవర్ రాజుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా సైగా చేశాడు. దీంతో బాధితుడు డ్రైవర్ రాజుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని డీఈఈ రవికాంత్‌తో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈసందర్భంగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మాట్లాడుతూ ఈనెల 8న కాంట్రాక్టర్ రాజు తమకు ఫిర్యాదు చేశాడని, విచారణ పూర్తిచేసి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిఘా ఏర్పాటు చేసి రవికాంత్‌ను పట్టుకున్నామన్నారు. నిందితులను ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరుస్తామని పేర్కొన్నారు. దాడిలో సీఐలు సంజీవ్, వేణుగోపాల్, రాములు తదితరులు పాల్గొన్నారు. నరకం చూశాకే ఏసీబీని కలిశా.. కొన్నేళ్లుగా కాంట్రాక్టరుగా పనిచేస్తున్నా. నా పేరు, నా భార్య పేరుతో నిబంధనల మేరకు కాంట్రాక్టు పనులు పూర్తి చేశా. అయినా బిల్లు చెల్లించడానికి అధికారులు నానా రకాలుగా బాధలకు గురిచేశారు. బిల్లు కోసం తిరిగితిరిగి నరకం చూశా. ఇచ్చిన కాడికి తీసుకుంటే ఎవరికీ బాధ ఉండేది కాదు. డిమాండ్ చేయడం వల్లే విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించా. – కావటి రాజు, ఓదెల మండలం డ్రైవర్ రాజు, పక్కన డీఈఈ రవికాంత్ సీఐలతో మాట్లాడుతున్న డీఎస్పీ భద్రయ్య -
ఈఆర్సీ ముందుకు నీటి పారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ముందు నీటి పారుదల శాఖ వాదనలు వినిపించనుంది. విద్యుత్ చార్జీలపై 12న హైదరాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. దీనికి నీటి పారుదల శాఖ తరఫున ముంబైకి చెందిన ఇదామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బల్వంత్ జోషి హాజరు కానున్నారు. సాగునీటి అవసరాలకు వినియోగించే ఎత్తిపోతల పథకాలకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.6.40 నుంచి రూ.4.88లకు తగ్గించాలని కోరనున్నారు. రాష్ట్రంలోని 19 ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా 58.78 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం ఎత్తిపోతల పథకాలు నిర్వహణలోకి వస్తే 11,495 మెగావాట్ల మేర విద్యుత్ అవసరం ఉండనుంది. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి పెరగటంతో.. అలీసాగర్, గుత్ఫా, ఉదయసముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నాయి. వీటికి ప్రస్తుతం 1,359 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతోంది. యూనిట్‌కు రూ.6.40పైసల మేర చెల్లిస్తోంది. ప్రస్తుతం ఎత్తిపోతల అవసరాలు పెరిగి ఆర్థిక భారం పడుతుండటం, దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యత పెరిగిన నేపథ్యంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిస్కంలు ఇటీవల ఈఆర్సీని కోరాయి. యూనిట్‌కు రూ.1.52పైసల మేర తగ్గింపునకు ఈఆర్సీ సమ్మతిస్తే ఎత్తిపోతల పథకాలపై భారీగా విద్యుత్ భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రతినిధిగా జోషిని ఈఆర్సీ ముందు వాదనలకు పంపనుంది. -
నీటిపారుదల శాఖలో 14 మంది సస్పెన్షన్
కరీంనగర్: బోగస్ మెడికల్ బిల్లుల క్లెయిమ్ వ్యవహారంలో నీటిపారుదలశాఖలోని 14 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బోగస్ మెడికల్ బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నారంటూ ఓ వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.