ఇరిటెబుల్ బవెల్ సిండ్రోమ్
కొంతమందిలో పెద్ద పేగుల్లో అసాధారణ కదలికల వలన మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ఇలా బాధించే సమస్యే ఇరిటెబుల్ బవెల్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్‌లో ఒకసారి మలబద్దకం వస్తుంది, మరోసారి నీళ్ల విరేచనాలతో మలవిసర్జనం అవుతుంది. కడుపులో పట్టేసినట్లు నొప్పి ఉండి, దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తుంది. ఈ సిండ్రోమ్ వలన తరచు వాష్‌రూమ్‌కి వెళ్లి రావలసి వస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు, ప్రయాణాలలో వీరికి చాలా ఇబ్బందిగా ఉండి ఆత్మన్యూనతకు లోనవుతారు. ఈ సమస్య కోసం చేయించే పరీక్షలు దాదాపు నార్మల్‌గా రావటం విశేషం.
కారణాలు: ఐఆకి ప్రత్యేక కారణమంటూ ఇప్పటివరకు తేలలేదు. కాని ఇదివరకు జీర్ణవ్యవస్థకు ఇన్ఫెక్షన్స్ వచ్చినవారిలో, పెద్ద పేగు ఇన్ఫెక్షన్లకు గురైనవారిలో ఆరింతలు అధికంగా ఐఆ వచ్చే అవకాశం ఉంటుంది మెదడు నుండి పెద్ద పేగులకు వచ్చే సంకేతాలలో అసాధారణ మార్పుల వల్ల కొందరిలో ఆహారం కారణంగా పెద్ద పేగులలోని కండరాలు అసాధారణంగా స్పందించటం వల్ల మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, గాబరా, టెన్షన్ వలన మెదడు నుండి పెద్ద పేగులకి అసాధారణ సంకేతాలు వెళ్లి ఇది వచ్చే అవకాశం ఉంటుంది.
లక్షణాలు: మలవిసర్జన సమయంలో పొత్తికడుపులో నొప్పి కొన్నిసార్లు మలబద్దకం, లేదా నీళ్లవిరేచనం లాంటి విసర్జన మల విసర్జన సాఫీగా జరగనట్లు ఉంటుంది. మళ్లీ మళ్లీ టాయిలెట్‌కు వెళ్లాలని అనిపిస్తుంది కడుపులో గ్యాస్ నిండిపోవడం, నొప్పి రావడం - మల విసర్జనం చేస్తే హాయిగా ఉండటం. ఉదయం లేవగానే త్వరగా విసర్జనానికి వెళ్లాల్సి రావడం, ఎక్కువగా ప్రయాణాలు చేసినప్పుడు, ప్రయాణానికి ముందు, ఇంటినుండి బయటకు వెళ్లేముందు టాయిలెట్‌కి వెళ్లాల్సి రావడం తినగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం...దాంతో తినాలంటే భయం కొన్నిరకాల పదార్థాలను తీసుకోగానే, విరేచనాలు అయిపోవడం తరచుగా నీళ్లవిరేచనాలు అవడం అజీర్తి, కడుపులో గ్యాస్ నిండిపోవడం తలనొప్పి, ఒళ్లు నొప్పులు
వ్యాధి నిర్ధారణ: మల పరీక్ష చేయటం ద్వారా బ్యాక్టీరియా, అమీబిక్ సిస్ట్లు ఉన్నాయేమో తెలుస్తుంది. అలాగే జీర్ణం కాని ఆహార పదార్థాలు వస్తున్నాయా అనేది తెలుస్తుంది. దీనిద్వారా సిలియాక్ డిసీజ్, మాల్ అబ్జార్ప్షన్ ఉందా అనేవి తెలుస్తాయి. ఇఆ్క ఉఐఖ లివర్ ఫంక్షన్ టెస్ట్ ్ఖఎ అబ్డమెన్ కొలనోస్కోపీ పరీక్ష ద్వారా పెద్దపేగుల్లో ఇన్ఫెక్షన్లు తెలుసుకోవచ్చు. క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ జబ్బులు ఉన్నాయా లేదా తెలుస్తుంది.
జాగ్రత్తలు: ఎక్కువ మసాలాలు, కారంగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు ఎక్కువగా జీర్ణాశయాన్ని ప్రేరేపించే పదార్థాలు, కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు పాలు, పాలపదార్థాలు తక్కువగా తీసుకోవాలి ఏ ఆహారం తీసుకుంటే సమస్య అధికమవుతుందో గ్రహించి, వాటికి దూరంగా ఉండాలి అతి చల్లని లేదా అతి వేడి పదార్థాలు తీసుకోకూడదు కాఫీ, ఆల్కహాల్, ధూమపానం మానేయాలి ఆహార పదార్థాల ద్వారా ఇన్ఫెక్షన్స్ సోకకుండా, శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. బయటి ఆహారం తీసుకోకూడదు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. టాయిలెట్‌కి వెళ్లివచ్చిన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మలబద్దకంతో కూడిన ఐఆ ఉంటే, ఎక్కువగా పళ్లు, పీచు పదార్థాలు, ఎక్కువ నీరు తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి.
హోమియో వైద్యం: హోమియోలో మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే మందులు ఇస్తారు. వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి మందులు ఇస్తారు. తద్వారా ఈ వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చు.
కొన్ని మందులు ఐఆకి ఉపకరిస్తాయి.
అర్జెంటినమ్ నైట్రికమ్: తీవ్రమైన ఆందోళన, గాబరా ఎక్కువగా ఉండటం, బయటికి వెళ్లేముందు మలవిసర్జనకి వెళ్లాలని అనిపించటం. ఎక్కువ తీపి పదార్థాలు ఇష్టపడతారు. పదిమందిలోకి వెళ్లాలంటే గాబరా పడతారు. నక్స్‌వామికా: విపరీతమైన కోపం, చిరాకు ఉంటుంది. ఎక్కువగా మసాలా, టీ, ఆల్కహాల్‌ని ఇష్టపడతారు. మలబద్దకం ఉంటుంది. టాయిలెట్‌కి వెళ్లినప్పుడు మలం వచ్చినట్లుండి రాకపోవడం ముఖ్యలక్షణం. ఆర్సెనిక్ ఆల్బమ్: ఏదైనా బయటి ఆహార పదార్థాలు తినగానే విరేచనాలు అవుతాయి.
ఇవేకాకుండా పల్సటిల్లా, అల్ సోకట్రినా, లైకోపోడియం మందులు ఉపకరిస్తాయి.