isdc
-
కస్తూర్బావజ్రాలు
మట్టిలో మాణిక్యాలను గుర్తించి వాటికి మెరుగుపెడితే మరింత ప్రకాశిస్తాయి. రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ అధికారులు ఇదే చేశారు. జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 8, 9 తరగతులు చదివే నిరుపేద బాలికల్లో ఉన్న ప్రతిభా పాటవాలను గుర్తించా రు. వీరిలోని శాస్త్ర సాంకేతిక రంగాల పటిమకు పదును పెట్టారు. కేవీపల్లి, పుంగనూరు, బైరెడ్డిపల్లి, రొంపిచెర్ల కేజీబీవీలకు చెందిన తొమ్మిది మంది బాలికలు నాసా నిర్వహించే ఐఎస్డీసీకి ఎంపికయ్యారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలకు ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు లభించింది. గతంలో ఎన్నడూ రానంత పేరు ప్రఖ్యాతులు ఈ విద్యాలయాలు సొంతం చేసుకున్నాయి. ఇందుకు కారణం మన జిల్లా బాలికలే. జిల్లాలోని కేవీపల్లి, పుంగనూరు, బైరెడ్డిపల్లి, రొంపిచర్ల కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో 8, 9 తరగతులు చదివే 9 మంది బాలికలు నాసా సభలకు ఎంపికై జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేశారు. మే 24 నుంచి జూన్ 2 వరకూ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ (ఐఎస్డీసీ)లో ‘అంతరిక్షంలో ఆవాసాలు’ అనే అంశంపై పోస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎంపికైంది వీరే.. వెలగా ప్రత్యూష(కేవీపల్లి), కె.రెడ్డిరాణి (కలకడ), సీహెచ్ స్నేహ (గంగవరం), గుజ్జల దివ్య (కేవీపల్లి), ఎస్కే రోషిణి (పుంగనూరు), కే. ప్రీతి( బైరెడ్డిపల్లి), టీ సాయిశ్రీ (రొంపిచెర్ల), ఎం.పూజ (కేవీపల్లి), వీ.సైదాభాను (పుంగనూరు) ఎంపికైన వారిలో ఉన్నారు. వీరంతా టెన్త్ లోపు విద్యార్థులే. అంతరిక్షంలో నివాస ప్రాంతాలు, వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు, ఆవాసాలు, మొక్కల పెంపకం, ఆహారం, గాలి, ఉష్ణోగ్రతలు, గురుత్వాకర్షణ శక్తి వంటి అంశాలపై ప్రతిభ చాటారు. అంతరిక్షంలో మానవ మనుగడ ఎలా అన్నదే అందరి సంయుక్త పరిశోధన కానుంది. హైదరాబాద్లోని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. రఘునందన్కుమార్ విద్యార్థులకు ఎంతగానో సహకారం అందించారు. శాటిలైట్ ల్యాంచింగ్ లేబొరేటరీ, ఆస్ట్రోనాట్స్తో ముఖాముఖి వంటి అంశాలను చిన్నారులకు నేర్పారు. నెల రోజుల కిందట తిరపతిలోని నెహ్రూ మున్సిపల్ స్కూల్లో చిన్నారులకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఇక్కడే వీరికి తగిన శిక్షణ కూడా ఇచ్చారు. అందరిదీ గ్రామీణ నేపథ్యమే.. ఎంపికైన విద్యార్థినులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. పేద, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్లేందుకు ఆరాట పడుతున్న భావి మేధావులు. తొలిసారి విమానంలో అమెరికా వెళ్లబోతున్నామన్న ఆనందం, నాసా వర్క్షాప్ ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ వీరిలో కనిపిస్తోంది. -
అమ్మకు ఏ కష్టమొచ్చిందో..
‘అమ్మ’తనం ఎన్నో జన్మల బంధం అంటాం..‘అపురూపమైనదమ్మ ఆడజన్మ అని’ ఎన్నో విధాలుగా ‘ఆ’డ జన్మ గురించి చెప్పుకుంటుంటాం..‘కని’పెంచే దేవత అమ్మ.. కన్నబిడ్డలను ఆదరించడమే తెలుసు..పేగు తెంచుకు పుట్టిన బిడ్డను అపు‘రూపం’గా చూసుకుంటుంది. లాలిస్తుంది.. పాలిస్తుంది..కళ్లలో నలుసు పడినా తన కంట్లో పడిందని ‘హృదయం’ తల్లిడిల్లిపోతుంది.. కష్టమొస్తే ఓదారుస్తుంది.. కన్నీళ్లు వస్తే తుడుస్తుంది.. బిడ్డ చెట్టంత ఎదిగినా ఇసుమంతైనా ప్రేమ తరగదు.. ఓ తల్లికి ఏకష్టమొచ్చిందో ఏమో.. నవమాసాలు మోసింది... పండంటి మగబిడ్డకు హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో జన్మనిచ్చింది.. పాలిచ్చి..లాలించాల్సిన అమ్మకు కన్నపేగుపై మమకారం తెగిపోయింది.. పాలు తాగాల్సిన పసిగుడ్డు గుక్కపట్టి ఏడుస్తుంటే.. అక్కున చేర్చుకొని ఒడిలో లాలించాల్సిన అమ్మ.. బిడ్డ వద్దని వారించింది.. హిందూపురం అర్బన్: పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడానికి కన్న తల్లి నిరాకరించింది. చేసేదిలేక ఆ పసిగుడ్డును ఐసీడీఎస్ అధికారులు సంరక్షణాలయానికి చేర్చారు. వివరాల్లోకెళితే... రెండురోజుల క్రితం రాత్రి బెంగళూరుకు వెళ్తున్న రైలులో ఓ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. ప్రయాణికుల సమాచారం మేరకు రైల్వే అధికారులు హిందూపురం రైల్వేస్టేషన్లో ఆమెను దింపివేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ అర్థరాత్రివేళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ఆమె పక్కనే çపడుకోపెట్టినా పాలు పట్టలేదు. బిడ్డ ఏడ్పుతో అక్కడి వారు వైద్యులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు వచ్చి ఆమెకు ఎంతగానే సముదాయించినా తనకు బిడ్డ వద్దని భీష్మించింది. వెంటనే ఈ విషయాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ నాగమల్లేశ్వరికి తెలిపారు. సీడీపీఓ వెంట నేతన సిబ్బందితో వచ్చి బిడ్డను తమ సంరక్షణలోకి తీసుకుని బాలింతలతో పాలుపట్టించారు. బిడ్డ దూరమైతే ఆ తల్లి బాధపడి బిడ్డను చేరదీస్తుందని భావించారు. రెండురోజులైనా ఆమెలో ఎలాంటిమార్పూ రాలేదు. చివరకు అనంతపురం శిశు సంరక్షణాలయ అధికారులకు తెలియజేశారు. ఐసీపీఎస్ సూపర్వైజర్ దుర్గా ఆస్పత్రికి చేరుకుని ఐసీడీఎస్ అధికారులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్ఎంఓ రుక్మిణిల ఆధ్వర్యంలో చట్టపరంగా బిడ్డను తమసంరక్షణాలోకి తీసుకున్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఆనందమ్మ, దస్తగిరమ్మ వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
పెద్దషాపూర్ బాలికకు 'నాసా' ఆహ్వానం
శంషాబాద్ రూరల్: కెనడాలో ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవెలప్మెంట్ కాన్ఫరెన్స్(ఐఎస్డీసీ)కి మండలంలోని పెద్దషాపూర్ బాలిక, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అంకతి పావనికి 'నాసా' నుంచి ఆహ్వనం అందుకుంది. ట్రిపుల్ ఐటీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుకున్న పావని, వారి బందం సభ్యులతో పాటు కెనడా పర్యటనకు అయ్యే ఖర్చు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తూ చెక్కులు జారీ అయ్యాయి. స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్, కల్యాణి దంపతుల కూతురు అయిన పావని 7వ తరగతి వరకు శంషాబాద్లోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుకుంది. గచ్చిబౌలిలోని జవ హర్ నవోదయ పాఠశాలలో పదో తరతగి పూర్తి చే సుకున్న ఆమె మెరిట్ మార్కుల ఆధారంగా 2013లో బాసర్ ట్రిపుల్ ఐటీలో చేరింది. నాసా ఆహ్వానం మేరకు అంకిత కెనడా వెళ్లనుంది.