isi agent arrested
-
శ్రీకాకుళంలో ఐఎస్ఐ ఏజెంట్?
శ్రీకాకుళం: జిల్లాలోని కంచిలి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేసిన వ్యక్తి ఐఎస్ఐ ఏజెంటేనా అనే విషయమై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి జిల్లాలో ప్రవేశించాడని, అతను ఐఎస్ఐ ఏజెంట్ అయి ఉండవచ్చని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అజ్ఞాత వ్యక్తి పోలీసు నిఘా వర్గాలకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ రాష్ట్రంలోకి ప్రవేశించాడని చెబుతూ అతనికి చెందిన సెల్ నెంబర్‌ను పోలీసులకు తెలియజేశాడు. ఆ నెంబర్‌ను ఇంటెలిజెన్స్ వర్గాలు ట్రేస్ చేయడం ప్రారంభించాయి. అ ప్పటికే అతను శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించినట్లు కొనుగొన్నారు. జిల్లా పోలీసులను అప్రమత్తం చేశా రు. పోలీసులు రణస్థలం, చిలకపాలెం, మడపాం, టెక్కలి, పలాస, ఇలా.. ఇచ్ఛాపురం వరకు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. పోలీసులు కార్లు, జీపులు వంటి వాటిపైనే దృష్టి పెట్టడంతో పలాస వరకు తప్పించుకోగలిగాడు. అటు తరువాత లారీలను సైతం తనిఖీలు చేయాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ఆ పనిలో పడ్డారు. దీంతో కంచిలి వద్ద ఓ లారీలో వెళుతున్న అష్రాఫ్ సయ్యద్ అనే వ్యక్తి వద్ద పోలీసులకు అందిన సెల్ నెంబర్ ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే లారీలో ఉన్న మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అష్రాఫ్ చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందినవాడుగా తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ ఘటన గురించి పెదవి విప్పడం లేదు. -
పోలీసుల అదుపులో ఐఎస్ఐ ఏజెంట్
సాక్షి, న్యూఢిల్లీ : సైనికులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న ఐఎస్ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని జలంధర్‌లో పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని ఫజాలికా ప్రాంతానికి చెందిన రామ్ కుమార్‌గా గుర్తించారు. కుమార్ నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తాను డబ్బుకు ఆశపడి పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉంటున్నానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఇండో-పాక్ సరిహద్దులో భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ ఏజెంట్లతో పంచుకుంటానని చెప్పాడని వెల్లడించారు. సరిహద్దుల్లో భారత జవాన్ల కదలికలపైనా నిందితుడు నిఘా వేసేవాడని చెప్పారు. జమ్మూ కశ్మీర్ సైనిక ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి అందిన సమాచారం మేరకు అతడి కదలికలను పసిగట్టి స్ధానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం తదుపరి విచారణ కోసం నిందితుడిని పోలీసులు చండీగఢ్‌కు తరలించారు. -
రైలు ప్రమాదాలు: ఐఎస్ఐ ఏజెంటు అరెస్టు
-
రైలు ప్రమాదాలు: ఐఎస్ఐ ఏజెంటు అరెస్టు
భారతదేశంలో వరుసపెట్టి మూడు రైలు ప్రమాదాలు సంభవించి పలువురు మరణించారు. ఈ మూడు ప్రమాదాలకు కారణం రైలు పట్టాల మీద పేలుడు పదార్థాలు పెట్టడమేనని అనుమానాలున్నాయి. సరిగ్గా ఇదే కేసులో ప్రధాన నిందితుడు, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంటు అయిన షమ్సుల్ హుడాను నేపాల్‌లో అరెస్టు చేశారు. దేశంలో జరిగిన వరుస రైలు ప్రమాదాల కేసులను విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇతడిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. నవంబర్ నెలలో కాన్పూర్‌లో జరిగిన రైలుప్రమాదంలో ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 14 బోగీలు పట్టాలు తప్పడంతో 150 మంది మరణించారు. ఈ కేసులో హుడా హస్తం ఉందని భావిస్తున్నారు. అతడి ఆదేశాల మేరకే ఈ రైలు వెళ్లే మార్గంలో పట్టాల మీద బాంబులు పెట్టారని, గ్యాస్ కట్టర్లతో పట్టాలు కోవారని అంటున్నారు. ఇటీవల జరిగిన అన్ని రైలు ప్రమాదాల వెనక ఐఎస్ఐ హస్తం ఉందని చెబుతున్నారు. బిహార్‌లో మోతీ పాశ్వాన్, ఉమాశంకర్ పటేల్, ముఖేష్ యాదవ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, విచారించగా అప్పుడు షమ్సుల్ హుడా పాత్ర బయటపడింది. బిహార్‌లోని మోతిహారీ ప్రాంతంలో జరిగిన ఇద్దరు యువకుల హత్యకేసులో వాళ్లను విచారించగా, రైలు ప్రమాదాల కోణం అనుకోకుండా బయటకు వచ్చింది. నేపాల్‌కు చెందిన బ్రిజ్ కిశోర్ గిరి అనే వ్యక్తి కూడా రైలు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్నాడు. హుడా అతడికి చెప్పి, ఇద్దరు యువకులతో బాంబులు పెట్టించాడని అంటున్నారు. వాళ్లు బాంబులు పెడుతూ దొరికిపోవడంతో బిహార్‌కు చెందిన ముగ్గురితో ఆ ఇద్దరిని హుడా చంపించాడు. ఈ మొత్తం వ్యవహారం అంతా బిహారీల అరెస్టుతో బయటపడింది.