రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కు రాజ్‌నాథ్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఐసిస్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఎన్కౌంటర్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీస్ కీలక పాత్ర పోషించింది. రెండు నెలల నుంచి ఐసిస్ కూర్సన్ మాడ్యుల్‌ని రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. లక్నో–భూపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడు అనంతరం కూర్సన్ మాడ్యుల్ ఉగ్రవాదులు బస్ ఎక్కి పారిపోయినట్లు కౌంటర్ సెల్ పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)కు ఈ సమాచారాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇవ్వడంతో వారు ఆపరేషన్ కూర్సన్ ప్రారంభించారు.
ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాది సైఫుల్లా మృతి చెందగా.. మిగతా ఇద్దరు ఫైజాన్, ఇమ్రాన్‌ను ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక సమాచారం ఇచ్చి భారీ ఉగ్రముప్పు నుంచి కాపాడిన రాష్ట్ర పోలీస్ శాఖను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం అభినందించారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మకు కేంద్ర హోంశాఖ మంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.