Islamic terrorism
-
అఫ్గాన్ పరిణామాలు మళ్లీ కశ్మీర్ మెడకేనా?
భౌగోళిక స్వరూపం, భిన్న తెగల సమ్మేళనం, కిరాయి సేనలతో యుద్ధాన్ని వృత్తిగా స్వీకరించిన స్థానిక ప్రభువుల ఉనికి అఫ్గానిస్తాన్‌కు ప్రత్యేకం. ఇవే ఆ చిన్న దేశాన్ని ఇస్లామిక్ ఉగ్రవాద ప్రయోగశాలగా మార్చాయి. అఫ్గాన్‌పై నాటి సోవియెట్ రష్యా దురాక్రమణ అనేక ఉగ్రవాద సంస్థలకు బీజాలు వేసింది. అవే అమెరికా దాడి, నిష్క్రమణ కాలాలకి శాఖోపశాఖలుగా విస్తరించాయి. అఫ్గాన్ వర్తమాన సంక్షోభం వీటికి పరాకాష్ట. ఒక సమస్యగా ఇది ఆసియా స్థాయిని దాటిపోయిందని ప్రపంచ దేశాలు భయపడుతుంటే, పాకిస్తాన్ అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల ఏకీకరణను తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉంది. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్, ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉబ్జెకిస్తాన్, ఈస్ట్రన్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ వంటి సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. ఈ అవాంఛనీయ ఏకీకరణతో అయినా కశ్మీర్ సాధించుకోవాలని పాక్ తలపెటిన పథకం వెల్లడైంది. తాలిబన్ ముట్టడి తరువాత ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ నాయకురాలు నీలమ్ ఇర్షాద్ షేక్ ఒక టీవీ చానల్లో ‘పాకిస్తాన్ సైన్యానికీ, తాలిబన్‌కీ మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్‌ను సాధించడంలో తాలిబన్లు మాకు తోడ్పడతారు.’ అని చెప్పారు. తాలిబన్ నేత బరాదర్ కాందహార్ వచ్చిన తరువాత ఐఎస్ఐ ప్రస్తుత అధిపతి ఫైజ్ హమీద్, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ రహస్యంగా వెళ్లి అతడికి అభినందనలు తెలిపి వచ్చిన సంగతి కూడా బయటపడింది. అమెరికా మీద విజయం సాధించాం కాబట్టి జిహాద్‌ను విస్తరించి, ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్, లిబియా, మొరాకో, అల్జీరియా, మారిటానియా, ట్యునీసియా, సోమాలియా, యెమెన్ల ‘విముక్తి’కి తరువాత ప్రాధాన్యం ఇవ్వాలంటూ పిలుపునిచ్చిన అల్‌కాయిదాకు, దాని అనుచర తాలిబన్‌కు పాకిస్తాన్ బహిరంగంగా ఇస్తున్న మద్దతు ఇది. జిహాద్‌తో ‘విముక్తం’ చేయవలసిన ప్రాంతాలలో కశ్మీర్ కూడా ఉంది. తాలిబన్ ఆధిపత్యంలోకి వచ్చిన అఫ్గాన్‌లో హక్కాని నెట్వర్క్ కమాండర్లు కీలక బాధ్యతలు చేపట్టారు. హక్కాని నాయకుడు ఖలీల్ ఉల్ రెహమాన్ హక్కాని కాబూల్ కొత్త సెక్యూరిటీ చీఫ్ అయ్యాడు. హక్కాని నెట్వర్క్ వ్యవస్థాపకుని కొడుకు జలాలుద్దీన్ హక్కానికి తాలిబన్ దళాలకు ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసే బాధ్యత ఇచ్చారు. దీనితో తాను నిర్ణాయక శక్తిగా అవతరించవచ్చునని పాకిస్తాన్ నమ్ముతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాంటి మాటలు చెప్పినా, అల్‌కాయిదా సహా, ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న ఏ ఒక్క సంస్థనీ, ప్రస్తుత పరిస్థితిలో తాలిబన్లు దూరం చేసుకునే స్థితిలో లేరు. పాక్‌లో తర్ఫీదు పొందిన ఉగ్రవాదులను తాలిబన్‌తో కలసి పనిచేయడానికి ఈ తాజా సంక్షోభంలోనూ ఐఎస్ఐ పంపించింది. అందుకే పదిరోజులలోనే 70,000 నుంచి 1,10,000కు అక్కడి ఉగ్రవాదులు పెరిగినట్టు అంచనా. హక్కాని, తాలిబన్లు 1980 నుంచి పాకిస్తాన్‌తో, ఐఎస్ఐతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. తాలిబన్‌ను అదుపులో ఉంచుకోవడానికి పాకిస్తాన్‌కు హక్కాని అవసరం ఉంది. పైగా ఇది భారత వ్యతిరేక సంస్థ. కొన్ని అంతర్జాతీయ నిఘా సంస్థల అంచనా ప్రకారం 1,500 నుంచి 2,000 వరకు లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాదులు, దాదాపు 2,500 మంది జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు తాలి బన్లతో కలసి ఇంతకాలం జిహాద్లో శ్రమించారు. నేడు వారే ఆక్రమిత కశ్మీర్‌లోని వాళ్ల శిక్షణ సంస్థలకి చేరుకుంటున్నారు. ఇది కశ్మీర్‌కు సరికొత్త బెడద. ఇప్పుడు ఐసిస్ (ఖొరాసన్) పేరు తెర మీదకు రావడం కూడా కొత్త ప్రశ్నలకు తావిచ్చేదే. దాదాపు 170 మందిని బలి తీసుకున్న కాబూల్ విమానాశ్రయం బాంబుదాడి (ఆగస్ట్ 26) వీళ్ల పనే. 2015 జనవరిలో అఫ్గాన్‌లో ఐఎస్ స్థాపించుకున్న అనుబంధ సంస్థ ఇస్లామిక్‌స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్. ఇదే ఐఎస్ఐఎస్ కె. ఇందులో ఎక్కువ మంది ఒకనాటి తెహ్రీక్ ఇ తాలిబన్ సంస్థ సభ్యులే. ఇస్లామిక్ సిద్ధాంతాల అమలు పట్ల నేతలు ఏమాత్రం మెతక వైఖరి చూపినా చాలామంది తాలిబన్ ఐసిస్కెలోకి ఫిరాయిస్తారని వినికిడి. అఫ్గాన్‌లో తాలిబన్ పైచేయి కావడంతోనే అసలు పని మొదలైం దని పాక్ భావిస్తున్నది. ఆ వార్త తెలియగానే ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అజహర్ అనే పాక్ ఉగ్రవాద నేత వెళ్లి తాలిబన్ ప్రముఖులు ముల్లా బరాదర్, ముల్లా యాకూబ్‌లను కాందహార్‌లో కలుసుకున్నాడు. మేం చేసిన సాయానికి మీరు కూడా ప్రత్యుపకారం చేసే సమయం వచ్చేసిందని గుర్తు చేయడానికే రవూఫ్ అజహర్ వెళ్లాడని విశ్లేషకుల అంచనా. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ ఆగస్ట్ 16న ‘మంజిల్ కి తరఫ్’ అని పోస్ట్ పెట్టాడట. దానర్థం ‘గమ్యం వైపు’. అంటే అఫ్గాన్‌తో వారి లక్ష్యం పూర్తి కాలేదా? మరి లక్ష్యం ఏమిటి? అల్‌కాయిదా జిహాద్‌తో విముక్తం కావలసిన దేశాల జాబితాలోనే దీనికి జవాబు ఉంది. కాబట్టి అఫ్గాన్ మతోన్మాదశక్తుల ఏకీకరణ నుంచి పాక్ కోరుకునే లబ్ధి అంతా కశ్మీర్ సాధనకేనని అనుకోవచ్చు. డాక్టర్ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ‘ మొబైల్ : 98493 25634 -
సరిహద్దు భద్రతే కీలకం
హ్యూస్టన్: కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాకు సరిహద్దు భద్రతే అత్యంత కీలకమని చెప్పారు. హౌడీ మోదీ కార్యక్రమంలో ఆయన 25 నిమిషాలపాటు ప్రసంగించారు. భారత్–అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసే దిశగా త్వరలో పలు రక్షణ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. తమ పౌరులను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం భారత్, అమెరికాకు ఉందన్నారు. అలాగే మన సరిహద్దులను రక్షించుకోవాలన్నారు. సరిహద్దు భద్రత భారత్‌కు కీలకాంశమని, దాన్ని అమెరికా గుర్తించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ దక్షిణ సరిహద్దు(మెక్సికో) రక్షణకు కనీవినీ ఎరుగని చర్యలు చేపడుతున్నామని, అక్రమ వలసలకు సమర్థంగా అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. అక్రమ వలసలతో ముప్పు తప్పదని హెచ్చరించారు. మాకు గర్వకారణం మోదీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణను ట్రంప్ ప్రశంసించారు. ఈ సంస్కరణలతో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. భారత్, అమెరికాలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని నిర్మూలించడంలో ఎన్నడూ లేనంతగా ప్రగతి సాధిస్తున్నారన్నారు. అమెరికాలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ట్రంప్ వివరించారు. టెక్సాస్‌లో తయారీ రంగంలో 70 వేల కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. అమెరికా నుంచి ఏటా 5 మిలియన్ టన్నుల ఎన్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఇండియా కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. దీనివల్ల రాబోయే రోజుల్లో వందల కోట్ల డాలర్ల విలువైన ఎల్ఎన్జీని తాము భారత్‌కు ఎగుమతి చేయబోతున్నామని అన్నారు. భారత్ అమెరికాలో ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ పెట్టుబడులు పెట్టలేదన్నారు. అమెరికా కూడా భారత్‌లో పెట్టుబడుల వరద పారిస్తోందన్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర మరువలేనిదని ట్రంప్ శ్లాఘించారు. తమ సంస్కృతిని, విలువలను వారు మరింత సుసంపన్నం చేస్తున్నారని కొనియాడారు. వారు అమెరికన్లుగా ఉండడం తమకు గర్వకారణమని చెప్పారు. -
ఐసిస్ వద్దు బాబోయ్.. వెనక్కొచ్చేస్తా..!!
న్యూఢిల్లీ : అమెరికా సేనలు ఉక్కుపాదం మోపడంతో ఐసిస్ ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన యువత తిరుగుముఖం పడుతోంది. తిండీ తిప్పలు కొరవడిన దారుణ పరిస్థితుల నుంచి బయటపడేందుకు యువత యత్నిస్తోంది. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు స్వదేశానికి తిరిగొస్తానని కుటుంబీకులకు మొరపెట్టుకున్నాడు. వివరాలు.. ఇస్లాం రాజ్యస్థాపన భ్రమలతో ఐసిస్‌లో చేరేందుకు కేరళ నుంచి 12 మంది యువకులు 2016లో పయనమయ్యారు. వారంతా అఫ్గాన్ చేరుకోగా.. ఫిరోజ్ అలియాస్ ఫిరోజ్‌ఖాన్ (25) మాత్రం అక్రమంగా సిరియాలో చొరబడ్డాడు. అయితే, వారి అంచనాలు తల్లక్రిందులయ్యాయి. తీవ్రవాద అంతానికి అగ్రరాజ్యం అమెరికా గట్టి చర్యలు తీసుకోవడంతో ఐసిస్ సంక్షోభంలో పడింది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దారిద్ర్యంలోకి ఆ ఉగ్రసంస్థ చేరింది. దాంతో అక్కడే ఉంటే ప్రాణాలు నిలుపుకోవడం కష్టమనుకున్న ఫిరోజ్‌ఖాన్ గతనెలలో ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి తిరిగొస్తానని, పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అక్కడే మలేషియా అమ్మాయితో తనకు వివాహం చేశారని, తర్వాత ఆమె తనను విడిచి వెళ్లిపోయిందని తల్లితో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, అతను, ఎప్పుడు ఎక్కడ లొంగిపోతాననే విషయం వెల్లడించలేదని తెలిసింది. ఇక ఫిరోజ్ ఫోన్‌కాల్ గురించి తెలిసిందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ‘కుంటుంబ సభ్యులతో ఫిరోజ్ టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. గతంతో బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి వారిని ఐసిస్‌లో చేర్పించేందుకు యత్నించాడనే సమాచారముంది. ఐసిస్‌లో చేరండని కాసర్గాడ్ యువతను ప్రలోభపెట్టిన కేసులో అతను కూడా నిందితుడు’ అని సెక్యూరిటీ ఉన్నతాధికారులు తెలిపారు. కన్నూర్ జిల్లా నుంచి 35 మంది వరకు ఐసిస్ బాట పట్టారని, వారిలో చాలామంది అమెరికా సేనల దాడిలో ప్రాణాలు విడిచి ఉండొచ్చని అన్నారు. కన్నూర్ జిల్లాలోని కూడలి ప్రాంతానికి చెందిన షాజహాన్ (32) టర్కీ మీదుగా సిరియా వెళ్తూ పట్టుబడ్డాడని భద్రతా అధికారులు వెల్లడించారు. -
వెలివేతతో ఇస్లామిక్ తీవ్రవాదానికి ఊతం
లండన్: ఇస్లామిక్ తీవ్రవాదం పేట్రేగిపోవడానికి సామాజిక బహిష్కరణ లేదా వెలివేత కూడా ఓ కీలక కారణమని తాజా అధ్యయనంలో తేలింది. మెడికల్ సైన్స్, న్యూరోఇమేజింగ్ పద్ధతుల ద్వారా తీవ్రవాదానికి ఆకర్షితులైన వ్యక్తులను విశ్లేషించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న నఫీస్ హమీద్ మాట్లాడుతూ..‘ సామాజిక బహిష్కరణకు గురైనప్పుడు తీవ్రవాదంవైపు మొగ్గుచూపే ఆలోచనలు పెరుగుతున్నాయని గుర్తించాం. 2017లో స్పెయిన్‌లోని లాస్ రమ్బ్లాస్ జిల్లాలో జరిగిన ఇస్లామిక్ స్టేట్ దాడిలో 13 మంది చనిపోగా దాదాపు 100 మంది గాయపడ్డారు. ఆ నేపథ్యంలో 535 మంది ముస్లిం వ్యక్తులను పరిశోధనకు ఎంపిక చేసుకున్నాం. ముగ్గురు సభ్యులు ఆడే వర్చువల్ గేమ్ ‘సైబర్ బాల్’లో వీరిని భాగస్వాములు చేశాం. ఆ ఆటలో ఇద్దరు స్పెయిన్ పౌరుల ముఖకవళికలతో ఉన్న ఆటగాళ్లు వీరిని నిర్లక్ష్యం చేసేలా చేసి వారి మెదళ్లను స్కాన్ చేయడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించాం. ఇందులో పాల్గొన్న వ్యక్తులు పాఠశాలల్లో ఇస్లామిక్ బోధన, మసీదులు కట్టడం వంటి విషయాలు ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో 38 మంది మొరాక్ సంతతి వ్యక్తులు హింసను ప్రేరేపించేందుకు అంగీకరించారు’ అని పేర్కొన్నారు. -
జేఎన్యూకు మైనారిటీ కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లామిక్ ఉగ్రవాదంపై కోర్సు ప్రారంభించాలనే ప్రతిపాదనకు సహేతుక కారణం వెల్లడించాలని కోరుతూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రిజిస్ర్టార్‌కు ఢిల్లీ మైనారిటీ కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ప్రతిపాదిత కోర్సుపై వచ్చిన వార్తలపై సుమోటోగా మైనారిటీ కమిషన్ స్పందిస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఏ ప్రాతిపదికన యూనివర్సిటీ కోర్సు ప్రారంభిస్తుందో వివరణ ఇవ్వాలని రిజిస్ర్టార్‌కు ఇచ్చిన నోటీసులో కమిషన్ పేర్కొంది. జేఎన్యూకు నోటీసులు జారీ చేసిన విషయాన్ని కమిషన్ ఛైర్మన్ జఫరుల్ ఇస్లాం ఖాన్ నిర్ధారించారు. కాగా సెంటర్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌ను ఏర్పాటు చేసి దాని పర్యవేక్షణలో ఇస్లామిక్ ఉగ్రవాదంపై కోర్సును ప్రారంభించాలని జేఎన్‌యూ అకడమిక్ కౌన్సిల్ ప్రతిపాదనను ఆమోదించింది. గత వారం వర్సిటీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సమావేశానికి హాజరైన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. అయితే ఈ కౌన్సిల్ భేటీలో ఇస్లామిక్ ఉగ్రవాదం కోర్సును చేర్చేందుకు ఏదైనా సిద్ధాంత పత్రం, నిర్థిష్ట ప్రతిపాదన ముందుకొస్తే వాటి నకలును సమర్పించాలని జేఎన్‌యూను మైనారిటీ కమిషన్ కోరింది. కోర్సుకు సంబంధించిన సమగ్ర వివరాలను, కౌన్సిల్ భేటీ అజెండాను, హాజరైన సభ్యుల వివరాలను తెలపాలని కోరింది. -
లేత నెత్తుటి సాక్షిగా ఉగ్ర సవాల్
కాలువలో ఒక పుట్టి మునగడం నుంచి తుపానైనా, ఉప్పెనైనా, కరువైనా, కాటకమైనా, జాతుల పోరాటాలైనా, ఉన్మాదమైనా, ఉగ్రవాదమైనా... మొదట బలయ్యేది పిల్లలు, మహిళలు, ఇతర బడుగు, బలహీన వర్గాలే. పసికందులు నిష్కారణంగా బలైన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. పెషావర్‌లో ఏ పాపం ఎరుగని పసిబిడ్డలు శవాల కుప్పలుగా మారడం అందరినీ కలచివేసింది. ఇది ప్రతీకార చర్య అని తాలిబన్లు సమర్థించుకున్న తీరు దుర్మార్గమైనది. హానిచేయని ఏ జీవికీ శిక్ష విధించరాదని ఖురాన్ నొక్కి చెబుతోంది. కాబట్టి ఇది రాక్షసత్వమవుతుంది తప్ప, ఇస్లామిక్ తీవ్రవాదం కూడా కాజాలదు! ఉగ్రవాదానికి హృదయమే కాదు, కళ్లూ ఉండవని పాకిస్తాన్‌లోని పెషావర్ మారణకాండ మరోమారు స్పష్టం చేసింది. కల్లాకపటమెరుగని పసిరక్తం పారిం చి ఉగ్రమూక మానవ చరిత్రనే మలినం చేసింది. అన్నెంపున్నెం ఎరుగని పిల్లల్ని లక్ష్యం చేసుకొని సాగించిన ఈ దురాగతం, ఒక దుర్ఘటనగా కన్నా భవితకు సంబంధించిన అత్యంత ప్రమాదకర సంకేతం. అటు దేశానికి హితం చేయక, ఇటు మతానికి మేలు చేయక... మౌడ్యంతో పెట్రేగే రక్కసి ఉగ్రవాదం పసికూన లను తన లక్ష్యాలుగా మార్చుకోవడం అత్యంత ప్రమాదకరం, హేయం! అరుదైన ఘటనలుగా కాక ఇటువంటి దుశ్చర్యలు వ్యవస్థీకృతంగా జరిగితే ప్రపంచ మానవాళే గడగడ వణకాల్సిన పరిస్థితి. ఏ రక్షణ కవచం లేకుండా సాగే సరస్వతీ నిలయాలపై మున్ముందు ఇలాగే ముష్కర దాడులు సాగితే భావి ప్రపంచ పౌరుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలవాల్సిందేనా? ఈ తీవ్రతను గుర్తించి, దుస్థితిని తప్పించే మార్గాన్వేషణ చేయాలి. అంతే తప్ప, మనం ఇంకా రాజకీయ ఉదారవాదంతో ఖండనలు, ప్రకటనలతో సరిపెట్టే సమయం కాదని విశ్వ సమాజం, ముఖ్యంగా పాక్ పాలకులు గుర్తించాల్సిన తరుణమిది. ఉగ్రవా దాన్ని పెంచి పోషిస్తూ తాము పులిపైస్వారీ చేస్తున్నామన్న నిజాన్ని గ్రహించే స్థితిలో పాక్ పాలకులు లేరు. అంతకన్నా దారుణమైన విషయం... ఎక్కడో, పాక్ భూభాగానికి దూరంగా కూర్చుని ఇంకా రాజకీయ వ్యాఖ్యలతో పబ్బం గడుపుతున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ప్రకటన. పాకిస్తాన్ ప్రజల్ని ఇంకా ఓటు బ్యాంకులుగానే భావిస్తూ, ఎలాగైనా మభ్యపెట్టగలననే భ్రమల్లో బతుకుతున్న ఆయన, తాలిబన్ల వెనుక భారత ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఉందనే చచ్చు పుచ్చు ప్రకటన చేశారు. ఈ విషయంలో పాకి స్తాన్ ప్రభుత్వం కూడా ఏం తక్కువ తినలేదు. భారత్ విషయంలో దాని వైఖరే ఇందుకు నిదర్శనం. ఎప్పుడు సంఘటన చోటు చేసుకుంటే అప్పుడు, ఎవరికి నష్టం జరిగితే ఆ దేశం అన్న పద్ధతిన ఎక్కడికక్కడ చేపట్టే చర్యలు ఉగ్రవాదాన్ని అణచడంలో ఫలితాలనివ్వవు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రచిస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రక టించి 24 గంటలు గడవలేదు ఆ సమీకృత కృషికి గండిపడింది. తాజా దాడికి బాధ్యులమని ప్రకటించుకున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాక్ నేత ఫజ్లుల్లాను తమ కు అప్పగించాలని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రహీల్ షరీఫ్ ఒక వైపు అప్ఘానిస్తా న్ను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ముంబై ఉగ్రదాడుల కేసు నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్తాన్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లఖ్వీకి బెయిలు తాలిబన్ల డిమాండ్ కావడం దురదృష్టకరం! పాక్ పాలకుల ఈ ద్వంద్వ వైఖరి తరచూ కనిపిస్తున్నదే. భారత్‌లో విధ్వంస చర్యలకు పాల్పడే ముష్కర మూక లకు పాకిస్తాన్ సురక్షిత స్థావరమౌతోంది. ముంబై దాడుల్లో కుట్రదారులైన హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంలను అప్పగించాలని భారత్ తాజాగా మరో మారు పాకిస్తాన్‌ను కోరింది. ఎల్లలెరుగని హింసోన్మాదంతో తీవ్రవాదులు పేట్రేగిపోతూనే ఉంటారు, నాయకులు రాజకీయ ప్రకటనలతో పబ్బంగడుపు తూనే ఉంటారు. ఇది రివాజయిన తంతుగా కొనసాగినంత కాలం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. పసికందులు బలిపశువులు చిన్న కాలువలో పుట్టి మునగడం నుంచి దేశాల మధ్య జరిగే పెను యుద్ధాల వరకు మొదట బలయ్యేది పిల్లలే! తుపానయినా, ఉప్పెనయినా, కరువైనా, కాటకమైనా, జాతుల పోరాటాలయినా, ఉన్మాదమైనా, ఉగ్రవాదమైనా.... ఏ ఉపద్రవం ముంచుకువచ్చినా నిష్కారణంగా మొదట బలయ్యేది పిల్లలు, మహి ళలు, ఇతర బడుగు, బలహీనవర్గాలే. మానవ ఇతిహాస పరిణామంలో అనేకా నేక దుర్ఘటనల్లో సంబంధం లేకపోయినా, కారకులు కాకున్నా... మంచి చెడు తెలియని పసి జీవితాలు బలైన సందర్భాలు కోకొల్లలు. పెద్దల ఉన్మాదపు చర్య లకు పిల్లలు బలికావడం కొత్తేమీ కాదు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా అణుబాంబులు విసిరినా, నాజీలు పిల్లల్ని యుద్ధ శిబిరాల్లోకి కవాతు చేయిం చినా, చంకల్లో తుపాకులు పెట్టి శ్రీలంకలో ఎల్టీటీఈ బాల సైనికుల్ని తీర్చి దిద్దినా.. అమానవీయంగా బలయిపోయింది బాలలే! రువాండా అంతర్యుద్ధం లో నాలుగు నెలల్లోనే మూడు లక్షల మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారన్న ఐక్యరాజ్యసమితి లెక్క వినేవారికి కన్నీరు తెప్పించదా! ఉగ్రవాదమో, ఉన్మాద మో... వాటిని పెంచి పోషించిన, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఉపేక్షించిన పెద్దమనుషుల చేతులన్నీ పిల్లల రక్తంతో తడిబారినవే! పెషావర్‌లో ఉన్మాదుల మూకుమ్మడి కాల్పులకు ఏ పాపం ఎరుగని పసిబిడ్డలు శవాల కుప్ప లుగా మారడం ప్రతి మానవ హృదయాన్నీ కలచివేసింది. ఇది తమ ప్రతీకార చర్య అని, ఇందుకోసం కావాలనే సైనికుల పిల్లలనే లక్ష్యంగా ఎంచుకున్నామని సమర్థించుకున్న తాలిబన్ల అధికార ప్రతినిధి మహ్మద్ ఉమర్ ఖొరాసని మాట లు దుర్మార్గమైనవి. ‘‘మా కుటుంబాల్ని, భార్యాపిల్లల్ని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది, ఆ బాధేంటో వారికి తెలియజెప్పాలనే, మేం సైనికుల పిల్లల్ని ఎంపిక చేసుకున్నాం’’ అనే వాదన అత్యంత ప్రమాదకరమైంది. పిల్లలేం పాపం చేశారు? సైనికోద్యోగులేం తప్పు చేశారు? పాలకుల, ప్రభుత్వాల నిర్ణయాలను అమలుచేస్తూ దేశ రక్షణకోసం విధులు నిర్వర్తించేవారు సైనికులు. ఇంకా పచ్చి గా చెప్పాలంటే, జీవితాన్ని నెట్టేందుకు నాలుగు జీతం రాళ్ల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాస్తున్న అల్పజీవులు. అటువంటిది పొట్ట కూటి కోసం ఉద్యోగం చేస్తున్న సైనికుల పిల్లలపైన ప్రతీకారమేంటి? ఇస్లాంలో ఓ గొప్ప సందేశముంది. అదెంత చిన్నదయినా, పెద్దదయినా శిక్ష అనేది హాని చేయని ఏ జీవికీ విధించకూడదనే మౌలికాంశాన్ని ఖురాన్ నొక్కి చెబుతోంది. ప్రాణాల్ని బలితీసుకోవడమనే అతి తీవ్రమైన శిక్షను అమాయకులైన పసికూన లకు విధించడం ఇస్లాం పరంగా కూడా హేతుబద్ధం కానపుడు, వారిది పచ్చి రాక్షసత్వమవుతుంది తప్ప, ఇస్లామిక్ తీవ్రవాదం కూడా కాజాలదు! పాకి స్తాన్‌లో ఉంటూ ఆ దేశపు భావి పౌరుల్ని నిష్కారణంగా పొట్టనపెట్టుకున్నవారు దేశ హితంతో పనిచేస్తున్నట్టు కాదు. ఇస్లాం పేరు చెప్పుకొని రక్త పిపాసతో ఇస్లాం మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తున్నవారు ఇస్లాం ఉద్ధారకులూ కారు. చేతులు కాలాక ఆకులు పడితే మేలేంటి? పాకిస్తాన్లో బడిపిల్లలపై తాలిబన్ ఉగ్రవాదుల దాడులు కొత్తేమీ కాదు. వేర్వేరు సందర్భాల్లో, వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. పసిమొగ్గల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు కనీసం నాలుగుమార్లు పాఠశాల బస్సులపైదాడులు జరిపారు. ఇటీవల నోబెల్ శాంతి బహుమతి పొం దిన మలాలా యూసఫ్జాయ్పైన 2012లో జరిగిన దాడి ఈ పరంపరలోదే. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కనీసం నాలుగుమార్లు పాఠశాలలపై తాలిబన్లు దాడులు జరిపారు. ముఖ్యంగా వాయవ్య పాకిస్తాన్లో సాధారణ పౌరులకు కూడా రక్షణ లేకుండా పోయిందని పలుమార్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా హెచ్చరించింది. ఉగ్రవాదుల నుంచి పౌరులకు రక్షణ కల్పించే చర్యలు పాక్ ప్రభుత్వం చేపట్టాలని ఆమ్నెస్టీ డిప్యూటీ డెరైక్టర్ (ఆసియా-పసిఫిక్) డేవిడ్ గ్రిఫిత్ తరచూ చెబుతున్నారు. ఈ మధ్య పాక్ తమపై చేపట్టిన సైనిక చర్యకు ప్రతీకారమే పెషావర్ ఘాతుకమనే తాలిబన్ల వాదన ఏ రకంగానూ సమర్థనీ యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా, గడచిన వందేళ్ల చరిత్రలో పలుమార్లు విద్యా ర్థుల మీద, విద్యా సంస్థల మీద ఉగ్రదాడులు కోకొల్లలుగా జరిగాయి. కానీ, పదేళ్ల కింద రష్యాలోని బెస్లాన్‌లో చెచెన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల తర్వాత అంతటి పెద్ద నరమేధం ఇప్పుడు పెషావర్‌లోనే జరిగింది. పాక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? తన స్పందనని కార్యరూపంలో ఎలా చూపిస్తుంది? అన్న దే ఇప్పుడు కీలకాంశం. ‘మంచి తాలిబన్లు, చెడు తాలిబన్లు అని ఉండరు, అం తాచెడే, తాలిబన్లు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వారీ ప్రాంతపు శాంతికి ప్రమా దకారకులు, వారిని ఉపేక్షించేది లేదు’ అంటున్న పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాటలు ఎంత మేరకు ఆచరణ రూపం ధరిస్తాయో వేచి చూడాల్సిందే! అటు అఫ్ఘానిస్థాన్‌ను అస్థిరపరచడానికి, ఇటు భారత్‌ను చికాకు పరుస్తూ ఆధిపత్యం సాధించడానికి పాకిస్తాన్ పనిగట్టుకొని తాలిబన్లను పెంచి పోషిం చింది. కత్తితో వ్యవహరించేవాడు కత్తికే బలవుతాడనే చైనా సామెతను గుర్తుతె చ్చేదే పెషావర్ ఘటన. కానీ, తప్పు పాక్ పాలకులదైతే శిక్ష పసికూనలకెందు కన్నదే ఎవరికీ జీర్ణం కావడం లేదు. పాలకులు అది గ్రహించాలి. మరణశిక్షపై మారటోరియాన్ని ఇప్పుడు పాక్ ఎత్తివేసింది. ఉగ్రవాద పీచమణచడానికి కార్యా చరణ అంటోంది. ఈ ఇంగితం ముందే ఉండాల్సింది. బాలల్ని బలిపెట్టాక ప్రభుత్వానికి మెలకువ వచ్చింది. హిరోషిమాలో ఎందరో బాలలు హతమ య్యారు. ఎందుకంటే అణుబాంబులకు వివక్ష లేదు, విచక్షణ తెలియదు. గాజా లో చిన్నారులు మరణించారు. వారిని రక్షణ కవచంగా మిలిటెంట్లు వాడు కోవడంవల్ల. రువాండాలో పసిబిడ్డలు అసువులుబాశారు, వారు ఇతర గిరిజా తుల వారు కనుక. చెచెన్యాలో చంటిపాపలు మట్టిలో కలిశారు, ఎందుకంటే వారు పరదేశీయులు అయినందున. పెషావర్‌లో బడిపిల్లలు ప్రాణాలొదిలారు, వారు పాక్ సైనికులకు పుట్టినందున. ఎంత దుర్మార్గం? ఎంత అమానవీయం? మహాప్రస్థానం చేసిన మహాకవి శ్రీశ్రీ గుర్తొస్తున్నాడు. పాపం పుణ్యం, ప్రపంచ మార్గం/ కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ఏమీ ఎరుగని పూవుల్లారా,/ పాపల్లారా / మెరుపు మెరిస్తే,/ వానకురిస్తే/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా:/ మీదే మీదే సమస్త విశ్వం:/ మీరే లోకపు భాగ్యవిధా తలు:/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు: ఈమెయిల్: dileepreddy@sakshi.com - దిలీప్ రెడ్డి