Islamists
-
పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ మంటలు
ఇస్లామాబాద్/రావుల్పిండి : పాకిస్తాన్లో ఇస్లామిస్ట్ నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసనకారుల దాడిలో ఒక పోలీస్ మృతి చెందారు. ఇస్లామిస్ట్ నిరసనకారులు శనివారం ఇస్లామాబాద్, రావుల్పిండి నగరాల్లో నిరసనలకు దిగారు. ఇస్లామిస్ట్ నిరసనకారులను చెదరగొట్టేందుకు శుక్రవారం నుంచి ఫ్రాంటియర్ కానిస్టేబుల్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారుల మీద టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను పోలీసులు ప్రయోగించారు. సైన్యం బలప్రయోగానికి దిగడంతో.. ఆగ్రహించిన ఇస్లామిస్ట్ నిరసనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులు మూకుమ్ముడిగా సైన్యం మీద భౌతిక దాడులకు దిగారు. అల్లర్లను రెచ్చగొడుతున్న 50 మంది ఇస్లామిస్ట్ నిరసనకారులను సైన్యం అదుపులోకి తీసుకుంది. భారీగా బలగాలు ఇస్లామాబాద్‌లో 2 వేల మంది నిరసనకారులను నియంత్రించేందుకు ప్రభుత్వం భారీగా సైన్యాన్ని బరిలోకి దింపింది. 8,500 మంది ఎలైట్ పోలీసులు, పారామిలటరీ బలగాలతో అల్లర్లను అదుపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పలువురికి గాయాలు ఇస్లామిస్ట్ నిరసనలు పాకిస్తాన్లో మిన్నంటాయి. ఈ నిరసన అల్లర్లలో 130 మంది గాయపడినట్లు పాకిస్తాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పదులో సంఖ్యలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లర్లలో ఒక పోలీస్ మృతి చెందారు. మీడియాపై నిషేధం పాకిస్తాన్ మీడియా రెగ్యులేటింగ్ చట్టాన్ని టీవీ చానళ్లు అతిక్రమించాయన్న కారణంతో..శనివారం ప్రయివేట్ టీవీ ఛానళ్లపై అధికారులు నిషేధం విధించారు. ఇస్లామిస్ట్ నిరసనకారులపై సైనిక చర్య జరుగుతున్న సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు చేయరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ టెలివిజన్ ప్రసారాలు కొనసాగాయి. MEDIA COVERAGE OF SIT-IN AT FAIZ-E-ABAD, ISLAMABAD pic.twitter.com/YqEGTWpFIR — Report PEMRA (@reportpemra) November 25, 2017 -
ఈజిప్టులో ఆగని హింస
కైరో: పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీకి మద్దతుగా ముస్లిం బ్రదర్హుడ్ సాగిస్తున్న నిరసనలను ఒకవైపు ప్రభుత్వ బలగాలు అణచివేసేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు మిలిటెంట్లు సైతం ప్రభుత్వ బలగాలపై తిరగబడుతుండటంతో ఈజిప్టులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈజిప్టులోని సరిహద్దు నగరమైన రఫాలో మిలిటెంట్లు జరిపిన దాడిలో 25 మంది పోలీసులు మరణించారు. పోలీసులపై దాడిని ఈజిప్టు తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరోవైపు కైరో జైలులో ఉన్న 612 మంది తమ సభ్యులను విడిపించేందుకు ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులు విఫలయత్నం చేశారని, వారి దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. వారిని అబు జాబాల్ జైలుకు తరలిస్తుండగా, సాయుధలైన ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులు దాడికి దిగారని, ఖైదీల్లో కొందరు ఒక మిలటరీ అధికారిని బందీగా పట్టుకున్నారని తెలిపాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, ‘బ్రదర్హుడ్’ సభ్యులకు నడుమ జరిగిన పరస్పర కాల్పుల్లో, తొక్కిసలాటలో 36 మంది ఖైదీలు (బ్రదర్హుడ్ సభ్యులు) మరణించారని ఈజిప్టు అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఖైదీలు ట్రక్కులో ఉండగానే ప్రభుత్వ బలగాలు వారిని కుట్రపూరితంగా హత్య చేశాయని, ‘బ్రదర్హుడ్’ ఆరోపించింది. అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. ముబారక్ విడుదలకు కోర్టు ఆదేశాలు: పదవీచ్యుత ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ విడుదలకు కైరోలోని ఒక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక అవినీతి కేసులో ముబారక్‌పై విచారణ పెండింగులో ఉండగా, ఆయన విడుదలకు కోర్టు ఆదేశించడం గమనార్హం. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ముబారక్ ఈ వారంలోనే విడుదల కానున్నారు. ముబారక్ విడుదలతో ఈజిప్టులో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.