israel attack
-
ఇరాన్ యుద్ధం.. ప్రధాని మెలోని సంచలన నిర్ణయం
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రతీ దాడులో ఇరాన్ సైతం విరుచుకుపడుతోంది. పలు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది. -
ఆధునిక ఇస్ఫహాన్.. మన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్–అమెరికాలు ఇరాన్ మీద దాడి ప్రారంభించినప్పటి కంటే ఓ నగరం మీద బాంబుల వర్షం కురిపించినప్పుడు ‘హైదరాబాద్ నగరం’మనసు కలుక్కుమనే ఉంటుంది. అక్కడి చారిత్రక నిర్మాణాలకు నష్టం వాటిల్లిందన్న విషయం తెలిసినప్పుడు మరింత ఆవేదనకు గురై ఉంటుంది. ఆ నగరమే ఇస్ఫహాన్. దాదా పు 3 వేల కి.మీ. దూరంలో ఉన్న ఆ నగరంపై బాంబులేస్తే హైదరాబాద్‌కు ఉలుకెందుకంటే... 22 ఆర్చి ద్వారాలతో అద్భుత శైలితో నిర్మితమైన పురానాపూల్, ఎత్తయిన నాలుగు మినార్లతో గంభీరంగా ఉండే చార్మినార్... షియా సంప్రదాయ కట్టడం బాద్షాహీ అషూర్ఖాన్... ఇవన్నీ ఆ ఇస్ఫహాన్ నగర ప్రభావంతో రూపొందినవే. వీటికి మూలం గోల్కొండ సామ్రాజ్య పేష్వాగా దశాబ్దాల పాటు కొనసాగిన మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ.ఆయన మాట ల్లో... ‘హైదరాబాద్ అంటే ఆధునిక ఇస్ఫ హాన్’. ఆయ నకు ఇస్ఫహాన్ అంటే మక్కువ ఎందుకంటే.. ఆయనది ఇస్ఫహానే. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రా యెల్–అమెరికా దాడులతో ఆ నగరం అతలా కుతల మవుతోంది. పర్షియన్ సంస్కృతి సంప్రదా యాలు, నిర్మాణాలను నిలువెల్లా అద్దుకున్న ఆ దేశం నిలువునా వణికిపోతోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మిసైల్ విధ్వంసం సృష్టిస్తుందోనని అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. కానీ, ఆ దేశంలో మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్కు నష్టం జరిగిందని తెలిసి హైదరాబాద్ గుండె బరువెక్కింది. ఇస్ఫహా న్‌తో ప్రస్తుతం హైదరాబాద్‌కు వాణిజ్య సంబంధాలు పెద్దగా లేకున్నా, హైదరాబాద్ పుట్టుకలో ఆ నగర ప్రభావమే కీలకం కావటం విశేషం.కులీ కుతుబ్‌షా పాలనలో..కులీకుతుబ్‌షాహీ పాలకుల్లో ఐదోవాడిగా పట్టాభిషిక్తుడైన మహమ్మద్ కులీకుతుబ్‌షా పాలనలో హైదరాబాద్ నగర నిర్మాణం మొద లైంది. అప్పటి వరకు గోల్కొండ పట్టణం ఒక్కటే ఉండేది. ప్రస్తుతం పాతనగరం ఉన్న ప్రాంతంలో కొన్ని ఊళ్లు మాత్రమే ఉండేది. నాలుగో రాజు ఇబ్రహీం కులీకుతుబ్‌షాహీ కాలంలోనే గోల్కొండ ఇరుకుగా మారటంతో మూసీకి ఆవల కొత్త నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన మొదలైంది. కానీ, పనులు ప్రారంభం కాలేదు. ఇబ్ర హీం ఆదేశాలతోనే మూసీ దాటేందుకు వీలుగా వంతెన నిర్మాణం మొద లైంది. అప్పుడు నగరంలోకి ఓ వ్యక్తి కాలు మోపాడు.ఆయనే మీర్ ముహమ్మద్ మొమిన్ అస్తరాబాదీ. ఈయన ఇరాన్ సఫావిద్ రాజ్య రాజధాని ఇస్ఫహాన్కు చెందిన ప్రముఖ పండితుడు. అక్కడి అస్తరాబాద్లో పుట్టినప్పటికీ, సఫా విద్ రాజకుమారుడు హైదర్‌కు ట్యూట ర్గా పనిచేసేవాడు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, వైద్యం, ఆధ్యాత్మికం... ఇలా పలు అంశాల్లో నైపుణ్యం ఆయన సొంతం. అక్కడి రాజు మృతితో ఆయన హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడి కుతుబ్‌షాహీ పాలకులు పర్షియాకు చెందిన వారే కావటంతో అప్పటికే పర్షియాకు చెందిన ఎంతోమంది నిపుణులు హైదరాబాద్‌కు వస్తు ండేవారు. అలా వచ్చిన ఆయన తన నైపుణ్యంతో వెంటనే పాలకులను ఆకట్టుకున్నాడు.పురానాపూల్ ...సరిగ్గా అది నగర నిర్మాణానికి ఏర్పాట్లు జరు గుతున్న తరుణం. అప్పటికే పురానాపూల్ వంతెన సిద్ధమవుతోంది. వెంటనే తన నైపుణ్యాన్ని దానిమీద ప్రయోగించారు. పర్షియన్ ఆర్కి టెక్చర్ నమూనాను చొప్పించి అప్పటికే ఉన్న డిజైన్‌ను మార్పించారు. ఇరాన్లో 13వ శతా బ్దంలో నిర్మించిన వంతెన డిజైన్‌తో దీనికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఇస్ఫహాన్‌లో పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న వంతెనలు (కొన్ని పురాన్ పూల్ తర్వాత కట్టినవి) అచ్చు పురానాపూల్ వంతెనను స్ఫురిస్తాయి.చార్మినార్..హైదరాబాద్ నగర సంతకం చార్మినార్ ప్రధాన డిజైన్ ఈయనదే. భారీ మినార్లతో కట్టడాలుండటం పర్షియన్ పద్ధతి. అక్కడి మసీదులకు ఎత్తయిన మినార్లు ఉంటాయి. వాటి మీదకు ఎక్కి ప్రార్థనలకు స్థానికులను గట్టిగా అరిచి పిలిచేవారు. ఇస్ఫహాన్‌లో 1316లో నిర్మించిన మినార్ ఏ జొంబన్ మసీదు నమూనాతో చార్మినార్‌కు డిజైన్ చేశారు. దానిలాగే ఆర్చి, అలాగే మినార్లు (మినార్ ఏ జొంబన్కు రెండే) డిజైన్ చేశారు.అప్పటికే ఆయన్ను పేష్వా (ప్రధానమంత్రి)గా నియమించారు. 1590లో మొదలైన హైదరాబాద్‌ను మరో ఇస్ఫహాన్ తరహాలో రూపొందించాలని నిర్ణయించి మొమిన్ తన మార్కు చూపించారు. అలా 40 ఏళ్లపాటు ఆయన పేష్వాగా కొనసాగారు. మళ్లీ ఇస్ఫహాన్కు వెళ్లకుండా ఇక్కడే ఉండి చనిపోయారు. ఆయన రూపొందించిన మీర్ మొమిన్ కా దాయరాలోనే ఆయన్ను ఖననం చేశారు. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడ ఉంది. భారత సంప్రదాయాలను ధ్వంసం చేసి పర్షియా పద్ధతులను రుద్దినప్పటికీ, నగర నిర్మాణంలో ఆయన పాత్ర మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. చనిపోయే ముందు ఆయన రాసిన పుస్తకంలో హైదరాబాద్‌ను మరో ఇస్ఫహాన్గా అభివర్ణించారు. అందుకే హైదరాబాద్ చరిత్రలో ఇస్ఫహాన్కు అంత ప్రాధాన్యం. యుద్ధంలో ఇస్ఫహాన్ దెబ్బతింటే హైదరాబాద్ మనసుకు గాయమైంది అందుకే. -
ఇరాన్‌కు ఎదురుదెబ్బ
దుబాయ్: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడిభుజంగా పనిచేసిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీతోపాటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)కు చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ తమ దాడుల్లో మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. ఇరాన్ నాయకత్వం వెన్నుముక విరిచేశామని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ సైన్యం సోమవారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై విరుచుకుపడింది.అత్యున్నత సైనికాధికారులు నివాసం ఉండే కీలక స్థావరాలపై క్షిపణలు, డ్రోన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో అలీ లారిజానీ, ఘోలమ్రెజా సులేమానీ సహా పలువురు మృతిచెందారు. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఇంకా ధ్రువీకరించలేదు. ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఇరాన్ తమ అగ్రశ్రేణి అధికారులను కోల్పోవడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ సైన్యం వైమానిక దాడులు కొనసాగింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ రెండు క్షిపణుల ప్రయోగించిట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. యూఏఈలోని దుబాయ్‌పై ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చాయి. దాంతో ముందుజాగ్రత్తగా దుబాయ్ గగనతలాన్ని కొద్దిసేపు మూసివేశారు. అబూదాబీపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ మిస్సైల్‌ను అబూదాబీ సైన్యం కూల్చివేసింది. ఈ శకలాల కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై దాడి గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. పుజైరా తీరంలో నిలిచి ఉన్న చమురు ట్యాంకర్‌పై తాజాగా డ్రోన్‌తో దాడికి దిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు విడవడం లేదు. అక్కడ చమురు రవాణాపై ఆంక్షలు కొనసాగించడం తప్ప మరో మార్గం లేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలిబాఫ్ తేల్చిచెప్పారు. తమ దేశంపైకి రాకెట్లు, క్షిపణులు దూసుకొస్తున్నాయని, తాము ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండిపోవాలా? అని ప్రశ్నించారు.ఇరాన్ మంగళవారం ఉదయం పదుల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించిందని, వాటిని మధ్యలోనే తుత్తునియలు చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. ఖతార్‌లో భారీ ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణుల దండును విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ రక్షణశాఖ తేల్చిచెప్పింది. అయితే, క్షిపణుల శకలాలు నేలకూలడంతో మంటలు చెలరేగాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపైనా దాడి జరిగింది. నాలుగు డ్రోన్లను ఎంబసీ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలిటెంట్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడికి దిగారు. పలు డ్రోన్లు ప్రయోగించారు. లెబనాన్‌లో ఇద్దరు జవాన్లకు గాయాలు ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. టెహ్రాన్‌తోపాటు లెబనాన్ రాజధాని బీరూట్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. కమాండ్ సెంటర్లు, మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడికి దిగింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ సేనలు దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకొస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇరుపక్షాల మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇజ్రాయెల్‌తో ప్రత్యక్షంగా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు లెబనాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, లెబనాన్ సైన్యం అందుకు ఒప్పుకోవడం లేదు. ఖమేనీకి నీడలా లారిజానీ అలీ లారిజానీ ఘనమైన నేపథ్యం ఉంది. ఇరాన్లో ప్రముఖ రాజకీయ కుటుంబంలో జని్మంచారు. పార్లమెంటరీ స్పీకర్‌గా పనిచేశారు. ఇరాన్ సాంస్కృతిక మంత్రిగా వ్యవహారించార. ప్రజలపై ఆంక్షలను కఠినతరం చేశారు. ప్రభుత్వానికి విధానపరమైన సలహాదారుగా సేవలందించారు. అణ్వాయుధాల అంశంపై అమెరికాతో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఖమేనీకి సలహాదారుగా నియమితులయ్యారు. అత్యున్నత భద్రతా విభాగమైన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా ఎదిగారు. ఖమేనీకి నీడగా నిలిచారు. తత్వశాస్త్రంపై లారిజానీ ఆరు పుస్తకాలు రాశారు.కరడుగట్టిన బసిజ్ మిలీíÙయా ఫోర్స్ చీఫ్ సులేమానీ 1965లో జని్మంచారు. ఇటీవల ఇరాన్లో జరిగిన నిరసన కార్యక్రమాలను ఉక్కుపాదంలో అణచివేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థ ప్రజలపై హింసకు పాల్పడిందని, అరెస్టులు చేసిందని ఇజ్రాయెల్ సహా పశి్చమ దేశాలు పేర్కొన్నాయి. బసిజ్ మిలీషియా ఫోర్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ముద్రవేసింది. సులేమానీ మరణంతో ఆ దళం చాలావరకు బలహీనపడినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారిద్దరూ గ్యాంగ్‌స్టర్ అసిస్టెంట్లులారిజానీ మృతిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపర్చి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రజల భవిష్యత్తు వారి చేతుల్లో ఉండాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. అలీ లారిజానీతోపాటు బసిజ్ చీఫ్ సులేమానీని హతమార్చామని ప్రకటించారు. వారిద్దరూ గ్యాంగ్‌స్టర్(అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లు అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని విమర్శించారు. -
ఇరాన్‌పై బాంబుల వర్షం
దుబాయ్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్–అమెరికా సోమవారం కూడా ఇరాన్‌పై భారీగా దాడులు కొనసాగించాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇస్ఫహాన్ తదితర నగరాలపై ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిపించాయి. వందలాది లక్ష్యాలపై ముమ్మరంగా దాడులు చేశాయి. ఇస్ఫహాన్, నతాంజ్‌లోని అణు కేంద్రాలపైనా దాడులు జరిగాయి. ఇరాన్‌వ్యాప్తంగా డ్రోన్ తయారీ ఫ్యాక్టరీలు, సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యం చేసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలు నేలమట్టమై ఇరాన్ యుద్ధపాటవం ఇప్పటికే విపరీతంగా క్షీణించినట్టు చెప్పారు. దాడుల్లో టెహ్రాన్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ క్లినిక్ బాగా దెబ్బ తిన్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఇరాన్ క్షిపణి లాంచర్లలో 70 శాతానికి పైగా తమ దాడుల్లో ఇప్పటికే కుప్పకూలినట్టు ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నడావ్ షొహానీ తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు 85 శాతం దాకా తుడిచిపెట్టుకుని పోయాయన్నారు.ఇజ్రాయెల్ ఒక్కటే ఇరాన్లో ఇప్పటిదాకా ఏకంగా 7,600పై చిలుకు లక్ష్యాలను నేలమట్టం చేసినట్టు చెప్పారు. ఇంకా వేలాది లక్ష్యాలను సర్వనాశనం చేయనున్నట్టు వెల్లడించారు. యుద్ధం, హార్మూజ్ జలసంధి మూత తదితర పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నానాటికీ ఎగబాకుతూ గుబులు రేపుతూనే ఉన్నాయి. చమురు బ్యారెల్ ధర సోమవారం కూడా 100 డాలర్లకు పై స్థాయిలోనే కొనసాగింది. గల్ఫ్ దేశాలపైనా...ఇరాన్ డ్రోన్ దాడులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి వణికించాయి. ఒక డ్రోన్ పేలుడుతో చమురు ట్యాంక్‌కు మంటలంటుకుని భారీ పేలుళ్లు సంభవించాయి. వాటిని ఆర్పేందుకు చాలాసేపటిదాకా శ్రమించాల్సి వచ్చింది. దాంతో విమానాశ్రయంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. యూఏఈలోని ఫుజైరా పారిశ్రామిక జోన్‌పైనా డ్రోన్ దాడులు జరిగాయి. అక్కడ పలుచోట్ల మంటలు చెలరేగాయి.తమ దేశ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా సోమవారం ఇరాన్ ప్రయోగించిన 35 డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా, ఆరు క్షిపణులు, 21 డ్రోన్లను కూలి్చనట్టు యూఏఈ వెల్లడించాయి. తమ దేశంపై నాలుగు క్షిపణులు, మూడు డ్రోన్లు పడ్డట్టు బహ్రెయిన్ తెలిపింది. అబుదాబిపై జరిగిన క్షిపణి దాడిలో ఒక పాలస్తీనా పౌరుడు మరణించినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది.అటు ఇజ్రాయెల్‌పైనా ఇరాన్ పెద్దపెట్టున దాడులు కొనసాగించింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో ప్రజలు బంకర్లకేసి పరుగులు తీశారు. చాలా క్షిపణులను, డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. క్షిపణి తాలూకు కూల్చేసిన భాగాలు పడి జెరూసలేం పాత నగరంలో ఓ ప్రార్థనాలయం దెబ్బ తిన్నట్టు తెలిపింది. ఖర్గ్ దీవిపై దాడుల కోసం పలు గల్ఫ్ దేశాల్లోని పోర్టులు, డాక్‌లను అమెరికా వాడుకున్నట్టు ఇరాన్ తాజాగా ఆరోపించింది. లెబనాన్‌లోకి పదాతి దళాలు లెబనాన్‌పై దాడుల తీవ్రతను సోమవారం ఇజ్రాయెల్ మరింత పెంచింది. రాజధాని బీరూట్‌తో పాటు పలు ప్రాంతాలు క్షిపణి, బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. దక్షిణాది ప్రాంతంలో జరిగిన వైమానిక దాడులకు ఫార్ సర్ గ్రామంలో ఏడుగురు బలైనట్టు ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. వారిలో ఇద్దరు వైద్య సిబ్బందని వెల్లడించింది. అంతేగాక పలు హెజ్బొల్లా స్థావరాలను దెబ్బ తీసేందుకు లెబనాన్‌లోకి అదనపు పదాతి దళాలను పంపినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. లెబనాన్‌లో ఐరాస శాంతి పరిరక్షక దళాలపై హెజ్బొల్లా కాల్పులను ప్రుభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్‌కు ఇరాన్ షరతులు! హార్మూజ్ గుండా భారత నౌకలను సురక్షితంగా సాగనిచ్చేందుకు ఇరాన్ తాజాగా షరతులు విధించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. గత ఫిబ్రవరిలో జప్తు చేసిన మూడు ఇరాన్ నౌకలను విడుదల చేయాలని, అత్యవసరంగా ఔషధాలు, ఔషధ పరికరాలు సరఫరా చేయాలని ఆ దేశం కోరినట్టు తెలిపింది. తప్పుడు గుర్తింపుతో ప్రయాణిస్తున్నందుకు ఆ నౌకలను నిర్బంధించాల్సి వచి్చందని భారత్ పేర్కొంది. అంతేగాక అవి సముద్ర మధ్యంలో అక్రమంగా సరుకుల బదిలీకి పాల్పడ్డట్టు తెలిపింది. చమురుకు కొత్త మార్గం: ఇరాక్ పశ్చిమాసియా నుంచి చమురు రవాణాకు మరో కొత్త మార్గాన్ని వారంలో అందుబాటులోకి తేనున్నట్టు ఇరాక్ పేర్కొంది. ఉత్తరాది నగరమైన కిర్కుక్ నుంచి తుర్కియేకు పైప్‌లైన్‌ను ప్రారంభిస్తామని ప్రకటించింది. దాని సామర్థ్యం రోజుకు 2.5 లక్షల బ్యారెళ్లని ఇరాక్ చమురు శాఖ మంత్రి హయాన్ అబ్దుల్ గనీ తెలిపారు. యుద్ధానికి ముందువరకు బస్రా రేవు నుంచి ఇరాక్ రోజుకు 34 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతి చేసేది. చికిత్స కోసం రష్యాకు మొజ్తబా! ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీని శస్త్రచికిత్స నిమిత్తం రహస్యంగా రష్యాకు తరలించినట్టు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం తొలి రోజు ఇజ్రాయెల్ దాడుల్లో తండ్రి ఖమేనీతో పాటు ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలు రావడం తెలిసిందే. అందుకు తగ్గట్టే నేటిటిదాకా మొజ్తబా బయటి ప్రపంచానికి కనిపించలేదు. దాడుల్లో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలైనట్టు చెబుతున్నారు. ‘‘దాంతో మొజ్తబాకు వైద్య సాయానికి మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చారు. రష్యా సైనిక విమానంలో మొజ్తబాను మాస్కో తరలించారు’’అంటూ పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.ఖమేనీ విమానం ధ్వంసంఇరాన్ దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ విమానాన్ని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై జరిపిన దాడుల్లో అది పూర్తిగా ధ్వంసమైందని తెలిపింది. ఖమేనీతో పాటు అత్యున్నత పౌర, సైనికాధికారులు దేశీయ, విదేశీ ప్రయాణాలకు ఆ విమానాన్ని తరచూ వాడేవారని ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ వివరించింది. ఎల్పీజీ నౌక వచ్చేసింది46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలతో కూడిన భారత నౌక శివాలిక్ సోమవారం గుజరాత్ చేరింది. 20 వేల టన్నులను అక్కడి ముంద్రా రేవులో దించిన అనంతరం కర్నాటకలోని మంగళూరుకేసి బయల్దేరింది. దక్షిణాది అవసరాలను తీర్చే నిమిత్తం మిగతా 26 వేల టన్నుల ఎల్పీజీని అక్కడ అన్ లోడ్ చేయనున్నారు. మరో 45 వేల టన్నుల ఎల్పిజీతో మరో చమురు నౌక నందాదేవి కూడా మంగళవారం భారత్ చేరుకోనుంది. దీంతో దేశం ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరత కాస్త తగ్గనుంది. అలాగే 80 వేల టన్నుల చమురుతో కూడిన జగ్ లాడ్కీ నౌక కూడా మంగళవారం భారత తీరానికి చేరనుంది. మరోవైపు, సోమవారం ఒక పాక్ చమురు నౌక కూడా హార్మూజ్‌ను దాటింది.నెతన్యాహు కాఫీ వీడియో ఫేక్!క్షేమంపై మరిన్ని అనుమానాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బతికే ఉన్నారా, లేదా అన్న అనుమానాలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా శుక్రవారం విడుదల చేసిన వీడియో ఫేక్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. అందులో నెతన్యాహు కుడిచేతికి ఆరు వేళ్లున్నట్టు కన్పించడం మరింత కలకలం రేపింది. ‘‘అది ఫేక్ వీడియో. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారు. ఆ వాస్తవాన్ని దాచిపెట్టేందుకు ఇజ్రాయెల్ ఫేక్ ఏఐ వీడియో రూపొందించి విడుదల చేసింది’’అంటూ కామెంట్లతో ఇంటర్నెట్ హోరెత్తిపోయింది.దానికి స్పందనగా నెతన్యాహు పేరిట ఆదివారం మరో వీడియో విడుదలైంది. అందులో ఆయన ఒక కఫేలో ఉల్లాసంగా కాఫీ సేవిస్తూ కన్పించారు. తన మృతి వార్తలపై వ్యంగ్యంగా స్పందించారు కూడా. కానీ అది కూడా ఫేక్ వీడియోనేనని ప్రముఖ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ తాజాగా తేల్చడం కలకలం రేపుతోంది! దానితో పలువురు ఎక్స్ యూజర్లు కూడా గళం కలిపారు. నెతన్యాహు చేతిలోని కప్పులో కాఫీ పరిమాణం ఆయన సిప్ చేసిన తర్వాత కూడా అలాగే ఉండటాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. అంతేగాక ఆ వీడియోలో నెతన్యాహు ముఖం తీరుతెన్నులు చాలా తేడాగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. హార్మూజ్‌పై ఆచితూచి..⇒ ట్రంప్ పిలుపుకు స్పందించని దేశాలు ⇒ మరింత స్పష్టత కావాలి: ఈయూ ⇒ ముందు యుద్ధం ఆపాలన్న చైనా ⇒ యుద్ధ విస్తరణలో భాగం కాలేం: బ్రిటన్వాషింగ్టన్/బ్రసెల్స్/లండన్/బీజింగ్: హార్మూ జ్ జలసంధిని తెరిపించే ప్రయత్నాల్లో కలిసి రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపుకు ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. హార్మూజ్ వద్దకు తక్షణం యుద్ధ నౌకలను పంపాల్సిందిగా చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలకు ఆయన విజ్ఞప్తి చేయడం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు బ్రసెల్స్‌లో భేటీ కానున్నారు. హార్మూజ్‌ను తెరిపించే విషయంలో రెండు రకాల చర్యలు తమ దృష్టిలో ఉన్నట్టు ఈయూ విదేశీ విధాన సారథి కజా కలాస్ తెలిపారు. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ వ్యూహాల గురించి ఈయూ దేశాలు మరింత సమాచారం కోరుతున్నాయి.అమెరికా తెర తీసిన ఈ యుద్ధం మరింత విస్తరించేందుకు తాము కారణం కావాలని కోరుకోవడం లేదని అవి కుండబద్దలు కొడుతున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ట్రంప్ కోరినట్టు యుద్ధ నౌకలు పంపేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. హార్మూజ్‌ను తెరిపించేందుకు మాత్రం యూరప్ దేశాలతో కలిసి ఇప్పటికే పలు మార్గాలను అన్వేíÙస్తున్నట్టు చెప్పారు. పశ్చిమాసియాలో పోరుకు తక్షణం తెర పడాలని ఆకాంక్షించారు. ఇరాన్‌పై దాడులకు స్వస్తి పలికితేనే హార్మూజ్‌ను తెరిపించే విషయంలో ముందుకొస్తానని చైనా సంకేతాలిచ్చింది.విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ఈ మేరకు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్‌కు చైనా వెంటనే యుద్ధ నౌకలు పంపకపోతే తన చైనా పర్యటనను వాయిదా వేసుకోవడానికి వెనకాడబోనని కూడా ట్రంప్ పేర్కొనడం తెలిసిందే. తన పిలుపుకు స్పందించని దేశాలను గుర్తు పెట్టుకుంటానంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు! అయితే అధ్యక్షుని వ్యాఖ్యల ఉద్దేశం హార్మూజ్ విషయమై చైనాపై ఒత్తిడి పెంచడం కాదని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పుకొచ్చారు.యూఎస్‌తో చర్చించలేదు: భారత్ హార్మూజ్‌ను తెరిపించే ప్రయత్నాలను గురించి అమెరికాతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలూ జరపలేదని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. -
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి
కైరో: గాజాపై ఇజ్రాయెల్ ఆదివారం మరోసారి భీకర వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భవతి, 8 మంది పోలీసులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.సెంట్రల్ గాజాలోని నుసెయిరత్ శరణార్థుల శిబిరంలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఒక బాలుడు, కవలలతో గర్భవతిగా ఉన్న అతడి తల్లి సహా నలుగురు చనిపోయారని అల్ అక్సా మార్టిర్స్ ఆస్పత్రి, ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 14 మంది గాయపడ్డారని వెల్లడించాయి. జవైదా సమీపంలో పోలీసు వాహనంపై జరిగిన మరో దాడిలో సీనియర్ పోలీసు అధికారి సహా 8 మంది చనిపోయారు. -
దద్దరిల్లిన ‘ఖర్గ్’
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలనే గాక ఆ దేశంతో సంబంధమున్న చమురు వ్యవస్థలన్నింటినీ ఇకపై లక్ష్యం చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. తమపై అమెరికా దాడులకు ఉపయోగపడుతున్న గల్ఫ్ నగరాలన్నింటిపైనా ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.అమెరికా సేనలు మోహరించిన ప్రదేశాల నుంచి పౌరులంతా తక్షణం వెళ్లిపోవాలని సూచించింది! మరోవైపు ఖర్గ్పై భూతల దాడులకు కూడా అమెరికా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2,500 మందితో కూడిన నావికా దళాన్ని, మరిన్ని ఆంఫీబియస్ యుద్ధ నౌకలను హుటాహుటిన గల్ఫ్‌కు తరలిస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. వీటికి తోడు ఇరాన్‌తో యుద్ధం నిర్ణాయక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధ పరిధి మరింతగా విస్తరించడం ఖాయమని, తద్వారా మరింత జనహననం, ఆస్తి నష్టం తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు వ్యవస్థలు బుగ్గే: ట్రంప్ఇరాన్ చమురు నెట్‌వర్క్‌కు జీవనాడి వంటి ఖర్గ్ దీవిపై అమెరికా భారీ స్థాయిలో దాడులకు దిగింది. అక్కడ పదులకొద్దీ సంఖ్యలో భారీ పేలుళ్లు విని్పంచాయి. సముద్రంలో అమర్చే మందుపాతరల నిల్వ కేంద్రం, క్షిపణి నిల్వ కేంద్రం, బంకర్లతో పాటు మొత్తం 90కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. దీవిలోని కీలకమైన సైనిక స్థావరాలను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే కీలకమైన చమురు వ్యవస్థల జోలికి మాత్రం పోలేదని తెలిపారు.హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని ఇరాన్ నిరోధిస్తే వాటిని కూడా తుడిచి పెట్టేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టులు చేశారు. జపాన్ నుంచి తక్షణం పశ్చిమాసియాకు తరలాలంటూ 31వ మరీన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్, యాంఫిబియస్ షిప్ యూఎస్ఎస్ ట్రిపోలీకి ఆదేశాలు జారీ అయ్యాయి. యూఎస్ఎస్ అబ్రహంలింకన్తో పాటు అమెరికా ఇప్పటికే 12 యుద్ధ నౌకలను, 8 డి్రస్టాయర్లను గల్ఫ్‌లో మోహరించింది. అమెరికా దాడిలో ఖర్గ్‌లోని తమ చమురు వ్యవస్థలకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఇరాన్ పేర్కొంది.ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, నావల్ బేస్, విమానాశ్రయ కంట్రోల్ టవర్, ఒక చమురు కంపెనీ తాలూకు హెలికాప్టర్ హ్యాంగర్‌పై దాడులు జరిగినట్టు తెలిపింది. శనివారం ఇరాన్లో 200 పై చిలుకు లక్ష్యాలను తుడిచిపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిలో క్షిపణి కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలున్నట్టు తెలిపింది. అయితే ఖర్గ్ నుంచి చమురు ఎగుమతులు నిర్నిరోధంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది. లెబనాన్‌లో మృతులు 826 మంది లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. బీరూట్, శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 826 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది. వారిలో 31 మంది వైద్య సిబ్బందేనని తెలిపింది. దాడుల తీవ్రతకు ఐదు ఆస్పత్రులను మూసేయాల్సి వచ్చినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. మొజ్తబాపై 92 కోట్ల రివార్డు ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ జాడ తెలిపిన వారికి కోటి డాలర్ల (రూ.92.5 కోట్ల) రివార్డును అమెరికా ప్రకటించింది. విదేశాంగ శాఖ ఎక్స్‌లో ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ చీఫ్ అలీ హస్గర్ హెజాజీ, భద్రతా విభాగం ఉన్నతాధికారి అల లరిజానీ తదితరుల పేర్లను కూడా పేర్కొంది. వాళ్లకు సంబంధించిన సమాచారం అందించే వారికి తగిన పారితోíÙకంతో పాటు పునరావాసం కూడా కలి్పస్తామని పేర్కొంది.గల్ఫ్‌పై క్షిపణుల వర్షంఖర్గ్పై అమెరికా దాడులకు తమ ప్రతీకారం ఊహించని స్థాయిలో ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘెర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. కనీవిని ఎరుగని రీతిలో పూర్తిస్థాయి దాడులకు దిగుతామన్నారు. అందుకు తగ్గట్టే ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపైనా దాడుల తీవ్రతను ఇరాన్ యథాతథంగా కొనసాగించింది. శనివారమంతా వాటిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌పై క్షిపణి దాడికి దిగింది. తీవ్ర నష్టానికి సంకేతంగా అక్కడినుంచి భారీగా పొగలు వెలువడ్డాయి.ఇరాన్ డ్రోన్ దాడిలో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడి నుంచి వెలువడే పొగలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బ్యాంకులు, ఇతర వ్యవస్థలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు జరుపుతోంది. దుబాయ్‌లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, పుజైరా నౌకాశ్రయాలను విడిచి వెళ్లాల్సిందిగా సిబ్బందిని, ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాటిపైనా భారీ దాడులు తప్పవని భావిస్తున్నారు. 9 బాలిస్టిక్ క్షిపణులను, 33 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.నిమిషాల్లో 1,430 క్షిపణులు! ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా దాడితో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌పై శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1,430 క్షిపణులు ప్రయోగించింది! ఇజ్రాయెల్ వైద్య సేవా విభాగానికి చెందిన మాగెన్ డేవిడ్ ఆడొమ్ దీన్ని ధ్రువీకరించారు. ఈలట్ నగరంలో చాలా ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఎంతోమంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు కూడా క్షిపణుల మోతతో దద్దరిల్లిపోయాయి.హార్మూజ్‌కు యుద్ధనౌకలు పంపండి ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తిహార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పలు దేశాలు ఇప్పటికే అమెరికాకు దన్నుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని చెప్పారు. హార్మూజ్‌ను త్వరలో తెరిపించి అక్కడినుంచి అంతర్జాతీయ రవాణా యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.గల్ఫ్ దేశాలపై దాడులొద్దు ఇరాన్‌కు హమాస్ పిలుపు గల్ఫ్ దేశాలపై దాడులకు ఇరాన్ స్వస్తి పలకాలని పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ విజ్ఞప్తి చేసింది! పొరుగు దేశాలపై దాడులు మానుకోవాలని హితవు పలికింది. యుద్ధానికి తక్షణం తెర దించేలా దేశాలన్నీ కృషి చేయాలని కూడా పిలుపునిచి్చంది. ఇరాన్‌కు హమాస్ అత్యంత సన్నిహితమన్నది తెలిసిందే. దానికి ఇరాన్ పూర్తిస్థాయిలో సాయుధ, ఆర్థిక సాయం చేస్తుంటుంది. హమాస్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.మరో ఐదు విమానాలను నష్టపోయిన అమెరికా! ఇరాన్ దాడుల్లో అమెరికా గత రెండు రోజుల్లో మరో ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలను నష్టపోయినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు కేసీ–135 స్ట్రాటో ట్యాంకర్ రీ ఫ్యూయలింగ్ విమానాలకు భారీ నష్టం వాటిల్లినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేపట్టారని ఇద్దరు అమెరికా సైనికాధికారులను ఉటంకిస్తూ కథనం వెలువరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. ఇదంతా అమెరికా ఓటమిని కోరుకునే కొన్ని పనికిమాలిన మీడియా సంస్థల దిగజారుడు ప్రచారమేనంటూ మండిపడ్డారు. ‘‘నాలుగు విమానాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. ఇరాన్‌పై దాడుల్లో అవి చురుగ్గా పాల్గొంటున్నాయి. ఒక్క రీ ఫ్యూయలింగ్ విమానానికి స్వల్ప నష్టం జరిగింది. మా సైన్యం దానికి వెంటనే మరమ్మతు చేసింది కూడా’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
కుప్పకూలిన రీఫ్యూయలింగ్ విమానం
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లుతోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన కేసీ–135 రీఫ్యూయలింగ్ విమానం పశ్చిమ ఇరాక్‌లో గురువారం కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న మొత్తం ఆరుగురు సిబ్బంది మరణించారు. యూఎస్ మిలటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం ఓ ప్రకటనలో ఈ విషయం నిర్ధారించింది. విమానం కూలిపోవడానికి శత్రువుల దాడి గానీ, ఫ్రెండ్లీ ఫైర్ గానీ కారణంగా కాదని తేల్చిచెప్పింది. రెండు కేసీ–135 విమానాలు పక్కపక్కనే ప్రయాణిస్తూ ప్రమాదవవశాత్తూ పరస్పరం ఢీకొన్నాయని తెలియజేసింది.వాటిలో ఒకటి కూలిపోగా, మరొకటి స్వల్పంగా దెబ్బతిని ఇజ్రాయెల్‌లో క్షేమంగా ల్యాండైనట్లు స్పష్టంచేసింది. పశ్చిమాసియాలో ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొంటున్న తమ సైన్యానికి మద్దతుగా ఈ విమానాలను అమెరికా రంగంలోకి దించినట్లు సమాచారం. అయితే, పశ్చిమ ఇరాక్‌లో యూఎస్ కేసీ–135 ఎయిర్‌క్రాఫ్ట్‌ను తామే కూల్చేశామని ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరించే ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది.ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమాసియాలో అమెరికా విమానాలు కూలిపోవడం ఇది నాలుగోసారి. కేసీ–135 రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను గగనతలంలో యుద్ధ విమానాల్లో ఇంధనం నింపడానికి ఉపయోగిస్తారు. ఇదొక భారీ చమురు ట్యాంకర్ అని చెప్పొచ్చు. కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ అని పిలుస్తుంటారు. కేవలం చమురు నింపడానికే కాకుండా, సైనిక ఆపరేషన్లలో గాయపడిన జవాన్లను చికిత్స కోసం తరలించడానికి వాడుతుంటారు. -
ర్యాలీపై దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. శుక్రవారం నగరం నడిరోడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి. దాంతో రాజధాని మీదుగా ఎటు చూసినా దట్టమైన పొగ అలముకుని కన్పించింది.అయితే దాడులకు ఇరానీలు వెరవలేదు. పేలుళ్ల అనంతరం కూడా వేలాదిగా టెహ్రాన్ వీధుల్లో ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ‘అమెరికాకు, ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ గులాం హుసేన్ మొహసెనీ ఎజెయ్, రక్షణ శాఖ ఉన్నతాధికారి అలీ లరిజానీ తదితరులు కూడా అందులో భాగస్వాములయ్యారు. పేలుళ్లలో చాలామందే మరణించినట్టు భావిస్తున్నారు. ఇరాన్ మాత్రం ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పాలస్తీనావాసులకు మద్దతుగా ఇరాన్ ఏటా ఖుద్స్ డే జరుపుతూ వస్తోంది. ఇరాన్‌వ్యాప్తంగా క్షిపణి, ఇజ్రాయెల్–అమెరికా బాంబు దాడులు శుక్రవారమూ కొనసాగాయి. ప్రధానంగా సైనిక, క్షిపణి కమాండ్ వ్యవస్థలనే లక్ష్యం చేసుకున్నారు.ఇరాన్ కూడా భారీ స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. మద్యధరా ప్రాంతంలో మోహరించిన అమెరికాకు చెందిన భారీ విమానవాహక యుద్ధ నౌక అబ్రహం లింకన్‌పై ఏకంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ‘‘అత్యంత కచ్చితత్వంతో కూడిన మా దాడుల్లో నౌకకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అది పని చేయడం లేదు. యుద్ధరంగం నుంచి వెనుదిరిగి వెళ్లిపోతోంది’’ అని పేర్కొంది. అమెరికా మాత్రం ఈ వార్తలను ఖండించింది. ఒక ఇరాన్ పడవ కేవలం తమ నౌకకు అతి సమీపానికి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.అమెరికాకు చెందిన మరో విమానవాహక యుద్ధ నౌక గెరాల్డ్ ఫోర్డ్లోనూ మంటలు చెలరేగడం కలకలం రేపింది. దీనికి యుద్ధంతో సంబంధం లేదని అమెరికా తెలిపింది. ‘‘లాండ్రీ ప్రదేశంలో చెలరేగిన మంటల్లో ఇద్దరు నావికులకు గాయాలయ్యాయి. నౌకకు నష్టమేమీ వాటిల్లలేదు. ఎప్పట్లాగే చురుగ్గా యుద్ధంలో పాల్గొంటోంది’’ అని వెల్లడించింది. మరోవైపు లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు నిర్నిరోధంగా కొనసాగాయి. దాంతో 60 మందికి పైగా గాయపడ్డారు.గల్ఫ్‌పై దాడులే దాడులు అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ తీవ్రస్థాయిలో దాడులు కొనసాగించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం మరోసారి డ్రోన్ దాడులు జరిపింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. నలుగురు గాయపడ్డట్టు సమాచారం. దుబాయ్ పారిశ్రామిక ప్రాంతంపైనా దాడులు జరిగాయి. దాంతో దుబాయ్ ఇంటర్నేషనల్ పైనాన్షియల్ సెంటర్లో ఒక భవనం భారీగా దెబ్బ తిన్నది. అబుదాబి విమానాశ్రయ సమీపంలో కూడా డ్రోన్ దాడులతో మంటలు చెలరేగాయి. తమపైకి దూసుకొచి్చన 7 ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను, 27 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.ఒమన్‌లోని సొహర్ నగరంపై రెండు డ్రోన్ దాడులు జరిగాయి. వాటిలో ఒకటి అల్ అవీ పారిశ్రామిక ప్రాంతాన్ని తాకడంతో అక్కడ పని చేస్తున్న ఇద్దరు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వారిలో 10 మంది భారతీయులేనని తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఇప్పటిదాకా మరణించిన భారతీయుల సంఖ్య 5కు చేరింది. ముజ్తాబాకు తీవ్ర గాయాలు: హెగ్సెత్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గాయాలతో మొజ్తబా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారని ఆయన చెప్పారు. ఇరాన్లో ఇప్పటిదాకా 15 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు తెలిపారు. మా టార్గెట్ ముజ్తబా: నెతన్యాహుఇరాన్పై దాడులు ఊహించిన దాని కంటే గొప్పగా సాగుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ జీవితానికి గ్యారంటీ లేదన్నారు. ఆయనతో పాటు హెజ్బొల్లా నేత నయీం ఖాసీంను కూడా లక్ష్యం చేసుకున్నట్టు వెల్లడించారు.ఇరాన్ లొంగుబాట: ట్రంప్‘‘ఇరాన్ ఇప్పటికే లొంగుబాట పట్టింది. మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్‌ను నిర్మూలించాను’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జీ7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగ్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్‌కు సూచించారు. అంతకుముందు ట్రూత్‌సోషల్ పోస్టుల్లో ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఈ మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తూండండి! వారి నేవీ, ఎయిర్‌ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి.సర్వమూ నాశనమవుతోంది. నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయమిది!’’ అని చెప్పుకున్నారు. ఇరాన్ వద్ద పోగుపడ్డ యురేనియం నిల్వల స్వా«దీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నారు. యుద్ధంలో ఇరాన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాయం చేస్తున్నారని కూడా ట్రంప్ అనుమానాలు వెలిబుచ్చారు. -
నౌకా విలాపం..
రణక్షేత్రంలో శత్రుసేన తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తుంటే సైనికుడు రక్షణగా దాక్కోడానికి కందకాల వంటి ఏర్పాట్లు ఉంటాయి. కనీసం కొండప్రాంతాల్లో పెద్దరాళ్ల మాటున నిలబడి ప్రతిదాడి చేయొచ్చు. కానీ సువిశాల సముద్రంలో నిరాయుధంగా వెళ్లే నౌకలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దాంతో పశ్చిమాసియా యుద్ధంలో ముడి చమురు, సరకు రవాణా నౌకలు సులభంగా చిక్కి శత్రుదాడుల్లో దారుణంగా ధ్వంసమవుతున్నాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా దాడిచేస్తే ఆ తర్వాతి రోజు నుంచే నౌకలపై దాడుల పర్వం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిరోజూ ప్రత్యర్థిదేశ దాడులతో దారుణంగా దెబ్బతింటూ శి«థిలమయమై ఎలాగోలా కొన్ని హార్బర్లకు చేరుకుంటున్నాయి. మరికొన్ని నీటమునిగి సముద్రగర్భానికి చేరుకుంటున్నాయి. మార్చినెల తొలిరోజు నుంచీ దాదాపు 19 నౌకలపై దాడులు జరిగాయి.మార్చి 1: ఒమన్ రాజధాని మస్కట్‌కు 50 నాటికల్ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్న చమురునౌక ‘ఎంకేడీ వ్యోమ్’పై దాడి జరిగింది.ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమా పోర్ట్‌కు 17 నాటికల్ మైళ్ల దూరంలో గిబ్రాల్టన్ జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ‘హెర్కులస్ స్టార్’పైనా దాడి జరిగింది. ఒమన్‌లోని కుమ్జార్ సమీప హార్మూజ్ జలసంధిలో పలావూ జెండాతో వెళ్తున్న ట్యాంకర్ ‘స్కైలైట్’మీదా దాడి జరిగింది.మార్చి 2 : బహ్రెయిన్ నౌకాశ్రయంలో అమెరికా జెండాతో నిలిచి ఉన్న సరకుల నౌక ‘స్టెనా ఇంపరేటివ్’పై దాడి జరిగింది. అగ్నికీలలను వెంటనే ఆర్పేశారని యునైటెడ్ కింగ్డమ్ మ్యారటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) తెలిపింది.మార్చి 3 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా పోర్ట్‌కు 10 నాటికల్ మైళ్ల దూరంలోని మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ‘లిబ్రా ట్రేడర్’, పనామా జెండాతో ఉన్న చమురు నౌక ‘గోల్డ్ ఓక్’పైనా దాడి జరిగింది.మార్చి 4: ఒమన్‌కు ఉత్తరాన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మాలీ్టస్ జెండాతో ఉన్న కంటైనర్ నౌక ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’పై దాడి జరిగింది. దీంతో నౌక నుంచి అందరూ సముద్రంలోకి దూకేశారు.మార్చి 5: ఇరాక్‌లోని ఖోర్ అల్ జుబేర్ పోర్ట్‌లో లంగరేసిన చమురునౌక ‘సోనాంగోల్ నమీబే’పై దాడి జరిగింది. బహమాస్ జెండాతో వెళ్తున్న మరో నౌకను ఇరాన్ పేలుడుపదార్థాలున్న పడవను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రిస్తూ ఢీకొట్టించింది. దీంతో నౌక ధ్వంసమైంది.మార్చి 6: మార్చి నాలుగోతేదీన ధ్వంసమైన ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’కు మరమ్మత్తులు చేసేందుకు సిబ్బందితో వచ్చిన టగ్బోట్ పైనా దాడి జరిగింది.ఒమన్‌కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మార్చి 7: సౌదీ అరేబియాలోని జుబేల్‌కు ఉత్తరంగా 10 నాటికల్ మైళ్ల దూరంలో మరో నౌకపై దాడి జరిగింది. నౌక అగి్నకి ఆహుతి అవుతుండటంతో సిబ్బంది అంతా సముద్రంలో దూకారు.మార్చి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘మయూరి నారీ’హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌక పైభాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్‌ఖైమా నౌకాశ్రయం నుంచి ఉత్తరంగా 29 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో జపాన్ జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘వన్ మ్యాజిస్టీ’పైనా ఇరాన్ దాడిచేసింది. దుబాయ్‌కు ఉత్తరంగా 92 కిలోమీటర్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో మార్షల్ దీవుల జెండాతో వెళ్తున్న ‘స్టార్ గేనిత్’నౌక మీదా ఇరాన్ దాడిచేసిందని నౌకల భద్రతా సంస్థ వ్యాన్‌గార్డ్ ప్రకటించింది.మార్చి 12: ఇరాక్‌లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో భారతీయుడు చనిపోయారు. మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక పై ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దాడులు ఉధృతం
దుబాయ్: పశ్చి మాసియా యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది. అమెరికాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు ఉధృతం చేస్తోంది. యుద్ధం మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బహ్రెయిన్ రాజధాని మనామాపై ఇరాన్ విరుచుకుపడింది. ఓ భవనంపై జరిగిన క్షిపణి దాడిలో ఒక మహిళ(29) మరణించగా, 8 మంది గాయపడ్డారు. ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. ఆరు డ్రోన్లు నేలకూల్చి నట్లు కువైట్ నేషనల్ గార్డు దళం వెల్లడించింది.యూఏఈలో పారిశ్రామిక నగరమైన రువాస్పై ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు బాంబులు, సైరన్ల మోతతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. జెరూసలేం, టెల్ అవీవ్‌లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. మరికొన్ని క్షిపణులు లక్ష్యాలను తాకినట్లు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్‌లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. తమవైపు దూసుకొచ్చిన ఇరాన్ మిస్సైళ్లను తుత్తునియలు చేశామని ఖతార్ రక్షణ శాఖ తెలియజేసింది. హొర్మూజ్‌పై ఇరాన్ గురి ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలపై కేవలం మిస్సైళ్లు, డ్రోన్ల దాడులతో సరిపెట్టకుండా హొర్మూజ్ జలసంధిపై ఇరాన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇక్కడ చమురు రవాణా నౌకలను అడ్డుకుంటోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలు పెరిగేకొద్దీ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరగడం తథ్యమని, ఫలితంగా ఆ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని ఇరాన్ అంచనా వేస్తోంది. ముడి చమురు బ్యారెల్ ధర 90 డాలర్లు దాటేసింది. ఫిబ్రవరి 28 నాటి ధరతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. హొర్మూజ్‌లో చమురు రవాణా నౌకలపై ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో ఏడుగురు నావికులు మరణించారు. మంగళవారం పర్షియన్ గల్ఫ్‌లో యూఏఈ తీరంలో చమురు రవాణా నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. హెజ్బోల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అండదండలతో దాడులకు తెగబడుతున్న హెజ్బోల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మిలిటెంట్లు హతం కాగా, నలుగురు గాయపడినట్లు తెలిసింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని దక్షిణ లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. హెచ్బొల్లాపై భీకర దాడులు చేయడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటివరకు 1,230 మంది మరణించారు. లెబనాన్‌లో 397 మంది, ఇజ్రాయెల్‌లో 11 మంది మృతిచెందారు. అలాగే ఏడుగురు అమెరికా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మధ్యవర్తిత్వానికి సిద్ధం: రష్యా యుద్ధాన్ని ముగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని, మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నా మని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికాలకు సూచించారు.ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు: హెగ్సెత్ ఇరాన్‌పై అత్యంత భీకర దాడులు చేయబోతున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. ఈరోజే ఈ దాడులు జరుగబోతున్నాయని మంగళవారం ప్రకటించారు. ఇరాన్‌పై గరిష్ట సంఖ్యలో ఆయుధాలు ప్రయోగిస్తామన్నారు. ఇరాన్ సైన్యం గత 24 గంటల్లో స్వల్పంగానే క్షిపణులు ప్రయోగించిందని తెలిపారు. ఇరాన్ ఆయుధ బలం క్షీణిస్తోందని తెలిపారు. బెదిరింపులకు భయపడం: ఇరాన్యుద్ధంలో తగ్గేదేలే అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఎక్స్’లో పోస్టుచేశారు. కాల్పుల విరమణ కోసం ఎదురు చూడడం లేదని, శత్రువులకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ సైనికాధికారి అలీ లరిజానీ ఉద్ఘాటించారు. హొర్మూజ్‌లో చమురు రవాణాను అడ్డుకుంటే 20 రెట్లు బలంగా దెబ్బకొడతామన్న ట్రంప్ హెచ్చరికలను కొట్టిపారేశారు. అమెరికా కంటే బలమైన దేశం కూడా ఇరాన్‌ను ఏమీ చేయ లేన్నారు. ‘మిమ్మల్ని మీరు నాశనం చేసుకో కుండా జాగ్రత్తగా ఉండండి’ అంటూ అమెరికాకు సూచించారు. ఇరాన్ ప్రజలకు సహకరిస్తాంనియంతృత్వం, రాక్షస పాలన నుంచి బయటపడడానికి ఇరాన్ ప్రజలకు సహకరిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అంతిమంగా రాజకీయ, పాలనాపరమైన మార్పును సాధించుకోవడం వారి చేతుల్లోనే ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రయత్నాలతో ఇరాన్ నాయకత్వం బలహీనపడుతోందని పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం వెన్నుముక విరిచేశామని, ఇప్పటికీ తాము క్రియాశీలకంగా ఉన్నా మని వ్యాఖ్యానించారు. ఇరాన్లో శాశ్వతమైన మార్పు రావాలన్నదే తమ ఉద్దేశమన్నారు. -
చమురు నిల్వలే లక్ష్యం!
దుబాయ్: పశ్చిమాసియాలో పోరు బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చమురు నిల్వలపై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ మరింతగా పెంచింది. ఆదివారం 4 కేంద్రాలపై దాడులు చేయగా సోమవారం ఏకంగా 30 చమురు నిల్వ డిపోలపై బాంబుల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా భారీగా మంటలు చెలరేగి భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ క్షిపణి, అణు కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్, అమెరికా తీవ్రస్థాయిలో దాడులను కొనసాగించాయి. దాంతో నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు, పరిసర ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ఇస్ఫహాన్‌లోని రివల్యూషనరీ గార్డ్ కమాండ్ కేంద్రాలు, దాని అనుబంధ సంస్థ బసీజ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం భారీగా దెబ్బతిన్నాయి.రాకెట్ ఇంజిన్ల తయారీ కేంద్రంతో పాటు క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూడా నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై కూడా రోజంతా ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వలనే లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడుల్లో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి భారీగా నిప్పంటుకుంది. బహ్రెయిన్‌లోని ఏకైక చమురు రిఫైనరీ కూడా మంటల్లో చిక్కింది. సౌదీ అరేబియాలో అతి పెద్దదైన షైబా చమురు క్షేత్రంపైనా పలు డ్రోన్ దాడులు జరిగాయి. వాటిని అడ్డుకున్నట్టు సౌదీ ప్రకటించింది. అయినా షైబా వైపు దశలవారీగా డ్రోన్లు దూసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇరాన్ తీరు బాధ్యతారహితమంటూ మండిపడింది.అరబ్ దేశాలపై ఇలాగే దాడులు కొనసాగిస్తే అంతిమంగా అందరికంటే భారీగా నష్టపోయేది ఆ దేశమేనంటూ తీవ్రంగా హెచ్చరించింది. అటు ఇజ్రాయెల్‌పైకి కూడా ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. దాడుల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఆదివారం తమపై ఇరాన్ జరిపిన దాడుల్లో మరణించిన ఇద్దరిలో ఒక భారతీయుడు ఉన్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని సౌదీ అరేబియా పేర్కొంది. బహ్రెయిన్‌లో 32 మందికి గాయాలు యూఏఈ, బహ్రెయిన్, కువైట్, దోహా, ఖతర్ తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు భారీ స్థాయిలో కొనసాగాయి. బహ్రెయిన్‌లో ఓ పౌర ఆవాస ప్రాంతం కుప్పకూలడంతో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురు చిన్నారులున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఏఈపై కూడా 15 బాలిస్టిక్ మిసైళ్లు, 18 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. తమ దేశంపైకి దూసుకొచ్చిన 17 క్షిపణులు, ఆరు డ్రోన్లను అడ్డుకున్నట్టు ఖతర్ పేర్కొంది. పర్షియన్ గల్ఫ్ తీర సమీపంలో అమెరికా యుద్ధ నౌకలతో పాటు చమురు నౌకలను కూడా లక్ష్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.తమ దేశ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్ ఖండాంతర క్షిపణిని నాటో డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసినట్టు టర్కీ ప్రకటించింది. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్‌ను నిర్వీర్యం చేసినట్టు ఇరాక్ వెల్లడించింది. మరోవైపు లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 486కు చేరినట్టు లెబనాన్ పేర్కొంది. ఎన్నికపై నిరసనలు! సుప్రీం నేత పదవిని వారసత్వంగా మొజ్తబాకు కట్టబెట్టడంపై ఇరాన్లో పలువురు రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1979లో వారసత్వ పోకడలపై పోరాడి రాచరికాన్ని కూలదోసి, ఇప్పుడు మళ్లీ అదే దారిలో వెళ్లడం ఏ మేరకు సరైందని వాళ్లు ప్రశి్నస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తోంది. ఇరాన్‌కు మా దన్ను: పుతిన్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇరాన్‌కు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తామని రష్యా ప్రకటించింది. నూతన సుప్రీం నేతగా ఎన్నికైన మొజ్తబాకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరాన్‌కు అన్నివిధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో పౌరులపై ఇరాన్ దాడులను జపాన్, ఈజిప్ట్ ఖండించాయి. మొజ్తబాకే ఓటుఅమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఫిబ్రవరి 28న తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. ఆయన వారసుడు ఎవరన్న సస్పెన్షన్‌కు ఇరాన్ సోమవారం తెర దించింది. ఊహించినట్టుగానే ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీనే సుప్రీం నేతగా ప్రకటించింది. 88 మంది మత పెద్దలతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఖమేనీపై జరిగిన దాడిలో 56 ఏళ్ల మొజ్తబా కూడా గాయపడ్డట్టు వార్తలు రావడం తెలిసిందే.ఖమేనీతో పోలిస్తే మొజ్తబా మరింత కరడుగట్టిన మతవాదిగా, అమెరికా విద్వేషిగా పేరుబడ్డారు. దీనికి తోడు తండ్రితో పాటు మొజ్తబా తల్లి, భార్య, చిన్న కుమారుడు కూడా ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. దాంతో ఆయన ప్రతీకారంతో రగిలిపోతున్నారు. దాంతో మొజ్తబా సారథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతిదాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు, ఖమేనీ వారసునిగా ఎవరిని ఎన్నుకున్నా మట్టుబెట్టి తీరతామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పోరు మరింత ముమ్మరం కావడమే తప్ప నెమ్మదించే పరిస్థితులు కని్పంచడం లేదు.ఎరిత్రియా దాకా వెళ్లి తిరిగొచ్చిన ఇండిగో విమానం న్యూఢిల్లీ: భారత్ నుంచి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎరిత్రియా నుంచే వెనక్కు తిరిగొచ్చింది. ఈ ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. విమానం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి మాంచెస్టర్ బయల్దేరింది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం అనంతరం, ఎరిత్రియా గగనతలంలోకి ప్రవేశించనుందనగా ఉన్నట్టుండి వెనుదిరిగి ఢిల్లీ చేరుకుంది.ఇందుకు దారితీసిన కారణాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఎరిత్రియా హఠాత్తుగా గగనతలాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుందని ఇండిగో వర్గాలు అంటున్నాయి. యూరప్ రూట్లలో నడిపేందుకు నార్వేకు చెందిన నోర్సే అట్లాంటిక్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన బోయింగ్ 787 విమానాలను ఇండిగో లీజుకు తీసుకుంది. ఇక్కడే ఎరిత్రియా ఎయిర్ ట్రాఫిక్ విభాగం అయోమయానికి లోనై అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రయాణాన్ని తిరిగి కొనసాగించేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.చమురు ధరలు దిగొస్తాయి: ట్రంప్పశ్చిమాసియా పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. అయితే రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు చూసి భయపడాల్సిన పనేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘‘చమురు నిల్వలకు కొరతేమీ లేదు. వాటి ధరలు త్వరలోనే దిగొస్తాయి’’ అని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. వెనెజువెలా చమురు సాయంతో పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు. ఇరాన్ క్షిపణి పాటవాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అతి దగ్గర్లో ఉన్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు.మరో అమెరికా సైనికుని మృతిమార్చి 1న కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల్లో గాయపడ్డ మరో సైనికుడు తాజాగా మృతి చెందాడు. అమెరికా సైన్యం సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 8కి పెరిగింది.ఇజ్రాయెల్‌లో గాయపడ్డ భారతీయుడుఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం క్షిపణి దాడుల సందర్భంగా టెల్ అవీవ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ‘‘మెడకు తీవ్ర గాయంతో విషమ పరిస్థితుల్లో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్నాడు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది’’ అని వెల్లడించారు. -
ఇజ్రాయెల్‌లోని అణు కేంద్రంపై దాడి చేస్తాం: ఇరాన్ సంచలనం
టెహ్రాన్: ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రంపై దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఉంచేందుకు టెహ్రాన్ గ్రాండ్ మోసల్లాలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఇరాన్ ప్రభుత్వ మీడియా పలు వివరాలు తెలిపింది.సుప్రీం లీడర్‌కు తుది వీడ్కోలు తెలపడంలో భాగంగా 3 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది సంతాపం తెలిపేందుకు మోసల్లా వద్దకు చేరుకునే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ మరణం తర్వాత సాధారణంగా “వీడ్కోలు కార్యక్రమం”, ఆ తర్వాత “అంతిమ యాత్ర” నిర్వహించడం అక్కడి ఆచారం.ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూల్చే ప్రయత్నం జరిగితే ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని గురువారం ఇరాన్ హెచ్చరించింది.ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ వస్తే అతడిని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిమోనా అణు కేంద్రాన్ని టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ హెచ్చరించడం గమనార్హం. ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలు, జెరూసలేం పరిసరాలు, పశ్చిమ తీర ప్రాంతం భాగాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఆపరేషన్ ప్రారంభించామని ఇరాన్ పేర్కొంది.అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన 7కు పైగా ఆధునిక రాడార్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఈ దాడులతో ఆ దేశాల నిఘా వ్యవస్థలు పనిచేయకుండా చేశామని పేర్కొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థను ఛేదించి మరీ దూసుకెళ్లి పలుచోట్ల తాకినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ భవనాల సముదాయం, బెన్ గురియన్ విమానాశ్రయం కూడా లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపింది.ఈ థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థ అమెరికాకు చెందింది. గగనతలంలో శత్రుదేశాల క్షిపణులను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఇది. వాటిని దాటుకుని మరీ తమ క్షిపణులు దూసుకెళ్లాయని ఇరాన్ అంటోంది. ఐఆర్జీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ కొనసాగిస్తున్న క్షిపణి-డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్లోఏని అనేక ప్రాంతాల్లో గంటల తరబడి సైరన్లు మోగాయి. ప్రజలు చాలాసేపు సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. -
రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే!
బంగారం ధరలు అమాంతం పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాకిస్తున్న వేళ, వెండి రేటు కూడా కొండెక్కుతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, వెండి ధర పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటనేది ఇక్కడ, ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.దేశంలోనిఇతర ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. సాధారణంగా ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా కేజీ సిల్వర్ ధర రూ. 3.15 లక్షలకు చేరుకుంది.వెండి ధరలు పెరగడానికి కారణాలు➤ప్రస్తుతం సిల్వర్ ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం.➤యుద్ధం కారణంగా.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.➤యుద్ధం కాకుండా.. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ యాక్ససరీస్ వంటి రంగాల్లో వెండికి భారీ డిమాండ్ ఉంది.➤డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో.. దానికి తగిన విధంగా సరఫరా ఉండాలి. సరఫరా తగ్గితే.. ధరలు తప్పకుండా పెరుగుదల దిశగా పరుగులు పెడతాయి.రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల భారీగా పెరుగుతున్న వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్యులకు వెండి దూరమైపోతుంది. -
ఇరాన్‌పై ట్రంప్ ప్లానేంటి.. ఇరాక్ పరిస్థితి వస్తుందా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసి అమెరికా, ఇజ్రాయెల్.. అగ్రనేతను మట్టుబెట్టాయి. ప్రత్యర్థి దాడిలో ఖమేనీ అత్యంత సులువుగా హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతాయా?. ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యం నెరవేరిందా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఇరాన్ ప్రాక్సీ గ్రూపుల సంగతేంటి?. ఖమేనీ మృతిపై పగ తీర్చుకునేందుకు ఇరాన్ ఎలాంటి ప్లాన్ చేస్తోంది. భవిష్యత్‌లో అమెరికా ఎదుర్కొవాల్సిన పరిస్థితులేంటి?. 2003 నాటి ఇరాక్ యుద్దం ఏం చెబుతోంది? అని సంగతులు తెలియాల్సిందే.. సుప్రీం లీడర్ ఖమేనీ దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్‌ను శాసించిన అగ్రనాయకుడు. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(86) మరణించడంతో, ఆయన వారసుడిగా.. ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ (మత పెద్దల మండలి) అయతుల్లా అలీ ఖమేనీని ఎంపిక చేసింది. తదుపరి 30 ఏళ్లలో ఖమేనీ పార్లమెంటు, న్యాయవ్యవస్థ, పోలీసులు, మీడియా, మతపరమైన ఉన్నత వర్గాలతో సహా, తనకు విధేయులైన వారి నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలలో తన పట్ల భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఖమేనీ వ్యక్తిత్వ ఆరాధనను ప్రోత్సహించారు. రాజకీయ అణచివేత, ప్రత్యర్థుల అక్రమ అరెస్టులూ జరిగాయి. ఆయన చాలా అరుదుగా విదేశాలకు వెళ్లేవారు. ఖమేనీ తన భార్య, ఆరుగురు పిల్లలు, మనవరాళ్లు, మనవళ్లతో కలిసి సెంట్రల్ టెహ్రాన్‌లోని ఒక నివాస సముదాయంలో చాలా నిరాడంబరంగా జీవించేవారని రిపోర్టులున్నాయి.1999లో విద్యార్థుల నిరసనలు ఆయన అధికారానికి ముప్పుగా మారినప్పటికీ, వాటిని అణచివేయగలిగారు. ఒక దశాబ్దం తర్వాత, అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కొందరు తిరుగుబాటు చేయడంతో, వారిపై పెప్పర్ స్ప్రే వాడటం, కొట్టడం, కాల్పులు జరపడం వంటివి జరిగాయి. 2019లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా నిరసనలు మిన్నంటినప్పుడు, చట్టవిరుద్ధమైన ప్రదర్శనలను అడ్డుకోవడానికి ఖమేనీ రోజులు తరబడి ఇంటర్నెట్ను నిలిపివేశారు. మహిళా విద్యపై గత పాలకులు విధించిన అడ్డంకులను ఖమేనీ తొలగించారు. కానీ, ఆయనకు లింగ సమానత్వంపై ఏమాత్రం నమ్మకం లేదు. హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహిళలను అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఏకాంత కారాగారంలో ఉంచారు. వారికి మద్దతు ఇచ్చిన వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఒక మానవ హక్కుల న్యాయవాదికి 38 ఏళ్ల జైలు శిక్ష, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు.అమెరికాతో వివాదాలుఅమెరికాపై సెప్టెంబర్ 11 (2001) దాడుల తర్వాత, అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాన్‌ను విమర్శించారు. ఖమేనీ వాషింగ్టన్‌తో అటు రాజీ పడకుండా, ఇటు నేరుగా యుద్ధానికి దిగకుండా చాలా జాగ్రత్తగా విదేశీ విధానం అమలుచేశారు. అమెరికాతో అత్యంత ఘర్షణ వాతావరణం నెలకొన్న అంశం అణ్వాయుధాలు. ఇరవై ఏళ్ల కిందట ఖమేనీ.. అణ్వాయుధాలు ఇస్లాంకు వ్యతిరేకమని ప్రకటిస్తూ, వాటి అభివృద్ధిని నిషేధిస్తూ ఒక ‘ఫత్వా’ జారీ చేశారు. కానీ, ఆయన పాలనలో ఇరాన్ రహస్యంగా అణు ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలు బలంగా నమ్మాయి.2018లో ట్రంప్ అణు ఒప్పందం నుంచి వైదొలిగి, ఇరాన్‌ను కొత్త ఒప్పందానికి తీసుకువచ్చేందుకు ఆంక్షలు విధించారు. రెండు సంవత్సరాల తర్వాత, సుప్రీం లీడర్‌కు అత్యంత సన్నిహితుడైన టాప్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసీం సులేమానీని ఇరాక్‌లో హతమార్చాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఖమేనీ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, రష్యా, చైనాలతో మరింత సన్నిహితంగా మెలిగారు. అలాగే, జూన్ 2025లో ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి నిల్వలు, అగ్రశ్రేణి సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినప్పుడు, ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ నగరాలపైకి క్షిపణుల వర్షం కురిపించింది.ఈ యుద్ధంలో అమెరికా కూడా చేరి, ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై దాడులు చేసినప్పుడు, ఖమేనీ లొంగిపోబోనని శపథం చేశారు. అనంతరం, ఇరాన్ తన అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందానికి అంగీకరించకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు. కానీ, ఖమేనీ యురేనియం శుద్ధిని ఆపడానికి నిరాకరించారు. దీంతో, ట్రంప్ ఆ ప్రాంతంలో అమెరికా సైనిక బలాన్ని పెంచాలని ఆదేశించారు. అనంతం, దాడుల్లో ఖమేనీ సహా కీలక నేతలు మృతి చెందారు.ట్రంప్ ప్లానేంటి? ఆత్మరక్షణ కోసమే ఇరాన్‌పై దాడులు చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రకటించాయి. అయితే ఇరాన్ మిలిటరీ బలాన్ని యూఎస్, ఇజ్రాయెల్‌తో పోలిస్తే అది పోటీనే కాదు. అలాంటప్పుడు ఇది ఆత్మరక్షణ ఎలా అవుతుందనేది ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇరాన్ మొత్తం ప్రపంచానికే ముప్పు అని తన వీడియో సందేశంలో ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు ఖమేనీ మృతితో ట్రంప్ ఏం చేస్తారు. అక్కడి కొత్త ప్రభుత్వం దిశగా ప్లాన్ చేస్తారా? కొత్త నాయకుడిని ఏర్పాటు చేస్తారా?. అయితే, ఇరాన్లో నాయకత్వ మార్పు అకస్మాత్తుగా జరిగే అవకాశం లేదు. ఇరాన్ వ్యవస్థ కూలిపోవడం కష్టమే. మతపెద్దలు, IRGC (Islamic Revolutionary Guard Corps) ముందుగానే contingency plans సిద్ధం చేసుకోవడం వల్ల, నాయకత్వం మారినా వ్యవస్థ కొనసాగుతుంది. ఇరాన్ వ్యవస్థ వ్యక్తి ఆధారంగా కాకుండా, సంస్థాగతంగా నిర్మించబడింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ ఏం చేయనుంది?.ఖమేనీ మృతి పట్ల ఇరాన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్, అరబ్ దేశాలను టార్గెట్ చేసింది. అమెరికాను సైతం హెచ్చరించింది. ప్రతి దాడులు చేస్తామని.. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అందులో భాగంగానే ఇరాన్.. ఇప్పటికే సౌదీ అరేబియా, దుబాయ్, ఇజ్రాయెల్, బహ్రెయిన్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇరాన్‌తోడు తాజాగా హెచ్‌బొల్లా దళాలు కూడా రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్నాయి. దీంతో, ఇరాన్‌కు మద్దతు పెరిగి మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది.ఇరాన్ ప్రాక్సీ నెట్వర్క్లుఇరాక్లోని మిలీషాలు, యెమెన్‌లోని హౌతీలు వంటి గ్రూపులు బలహీనపడినప్పటికీ ఇంకా చురుకుగా ఉన్నాయి. వీటి ప్రధాన పాత్ర.. అమెరికా బేస్‌లు, ఇజ్రాయెల్ లక్ష్యాలు, గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత సృష్టించడం. హౌతీలు గతంలో కూడా రెడ్ సీ షిప్పింగ్ మార్గాలను దాడి చేశారు, ఇది ప్రపంచ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారింది. మరోసారి ఇలాంటి దాడులు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లనుంది.2003 ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)2003 మార్చి 20న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నేతృత్వంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పోలాండ్ వంటి దేశాలు ఇరాక్‌పై దాడి చేశాయి. ఇరాక్ వద్ద Weapons of Mass Destruction (WMDs) ఉన్నాయని, అలాగే అల్-ఖైదా వంటి ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తోంది అనే ఆరోపణలతో దాడులు చేశాయి. కేవలం మూడు వారాల్లోనే అమెరికా నేతృత్వంలోని బలగాలు బగ్దాద్‌లోకి ప్రవేశించి, సద్దాం హుస్సేన్ 30 ఏళ్ల పాలనను ముగించాయి. ఏప్రిల్ 2003లో బగ్దాద్‌లోని సద్దాం విగ్రహాన్ని కూల్చడం యుద్ధానికి ప్రతీకగా నిలిచింది. దీంతో, సద్దాం హుస్సేన్ పాలన ముగిసింది. యుద్ధం తర్వాత ఇరాక్‌లో సెక్టారియన్ హింస, ఉగ్రవాదం, ISIS ఉద్భవం వంటి సమస్యలు పెరిగాయి. 2003–2011 మధ్య US బలగాలు ఇరాక్‌లో ఉండి, చివరికి వెనక్కి వెళ్లాయి. అయితే, ఇలాంటి పరిస్థితులు ఇరాన్లో ఉండకపోవచ్చు.ఇరాక్ vs ఇరాన్ పోలికఇరాక్ (2003): వ్యక్తి ఆధారిత పాలన (సద్దాం హుస్సేన్). నాయకుడిని తొలగించగానే వ్యవస్థ కూలిపోయింది.ఇరాన్ (ప్రస్తుత వ్యవస్థ): వ్యక్తి ఆధారంగా కాకుండా, మతపెద్దల సంస్థాగత వ్యవస్థ. ఒక నాయకుడు లేకపోయినా, Assembly of Experts, Guardian Council, IRGC వంటి సంస్థలు పాలన కొనసాగిస్తాయి. అందువల్ల, ఇరాన్‌ను ఇరాక్‌లా త్వరగా కూల్చడం కష్టమవుతుంది.


