గృహోపకరణాల విక్రయాల్లోకి ఐటీ మాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ ఉపకరణాల విక్రయంలో ఉన్న ఐటీ మాల్ గృహోపకరణాల విభాగంలోకి ప్రవేశిస్తోంది. శాంసంగ్, ఎల్జీ బ్రాండ్లను తొలుత ప్రవేశపెడుతోంది. ఒకట్రెండు నెలల్లో సోనీ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభిస్తామని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల వంటి ఉపకరణాలను విక్రయిస్త్తామని చెప్పారు.
కొత్త విభాగం కోసం ఐటీ మాల్ రూ.6 కోట్లకుపైగా వ్యయం చేసే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన నిధులను బ్యాంకుల నుంచి సమీకరించనుంది. ఆపిల్ స్టోర్ ఏర్పాటుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదిరిందని అహ్మద్ పేర్కొన్నారు. మార్చికల్లా స్టోర్‌ను తెరుస్తామని వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్ 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సోనీ, శాంసంగ్, హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఏసూస్, తోషిబా, ఇంటెల్, ఏఎండీ ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు మాల్లో కొలువుదీరాయి.