ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బాబు బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బాబు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 1979 ఐఆర్ఎస్ బ్యాచ్ అధికారి అయిన సురేశ్ బాబు.. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ పూర్తి చేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన గతంలో ఐఆర్ఎస్ అధికారిగా ఏపీ, ముంబై, చెన్నై, నాగ్‌పూర్, విశాఖపట్నంలో పలు హోదాల్లో పని చేశారు. 2012లో చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి పొంది తొలుత బెంగళూరు అనంతరం హైదరాబాద్‌లో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ లకు ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా నియమితులయ్యారు.