ITF tourny
-
ఫైనల్లో విష్ణువర్ధన్ జోడీ
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచాడు. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన సెమీస్‌లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ జంట 7–6 (7/3), 6–0తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్ (జర్మనీ) జోడీపై గెలిచింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ‘సూద్ బ్రదర్స్’ చంద్రిల్–లక్షిత్ జంటతో విష్ణువర్ధన్ జోడీ తలపడుతుంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో విష్ణువర్ధన్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో విష్ణు 7–6 (9/7), 5–7, 3–6తో సామి రెన్‌వెన్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
క్వార్టర్స్‌లో అనిరుధ్–విఘ్నేశ్ జంట
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు ముందంజ వేశారు. డబుల్స్ విభాగంలో అనిరుధ్ బ్రదర్స్ జోడీ, విష్ణువర్ధన్ జోడీ క్వార్టర్స్‌కు చేరుకోగా... సింగిల్స్ విభాగంలో రిషబ్ అగర్వాల్ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్– విఘ్నేశ్ ద్వయం 6–4, 0–6, 10–7తో అన్విత్ బెంద్రె–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ జంట 6–1, 6–3తో నిక్షేప్ రవికుమార్– సూరజ్ ప్రబోధ్ జోడీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో తేజస్ చౌకుల్కర్–నికి కలియండ పూనచ (భారత్) జంట 6–4, 7–6 (5)తో విజయంత్ మలిక్–సిద్ధార్థ్ రావత్ జోడీపై, వశిష్ట్ చెరుకు–ప్రజ్వల్ దేవ్ (భారత్) జంట 7–6 (4), 6–3తో అర్జున్ మరియప్ప–దక్షిణేశ్వర్ సురేశ్ జోడీపై గెలుపొందాయి. రిషబ్ ముందంజ మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రిషబ్ అగర్వాల్ 6–0, 6–3తో ఆదిత్య హరి ససోంగ్కో (ఇండోనేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మోహిత్ మయూర్ జయప్రకాశ్ 3–6, 6–4, 6–4తో నికి కలియండ పూనచపై, విజయ్ సుందర్ ప్రశాంత్ 6–4, 7–5తో జతిన్ దహియాపై, సిద్ధార్థ్ రావత్ 6–3, 7–5తో అభినవ్ సంజీవ్ షణ్ముగమ్పై, శశికుమార్ ముకుంద్ 6–3, 6–1తో జేసన్ పాట్రోంబోన్ (ఫిలిప్పీన్స్)పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. -
శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు
ఐటీఎఫ్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్– 5 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు మాచెర్ల తీర్థ శశాంక్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నేపాల్‌లోని ఖట్మాండులో జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్ సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరగా... డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో తీర్థ శశాంక్ 6–3, 7–5తో మిచెల్ వోజ్నాక్ (పొలాండ్)పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. మరోవైపు డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో శశాంక్– కబీర్ మన్రాయ్ (భారత్) ద్వయం 4–6, 4–6తో భారత్‌కే చెందిన పీయూశ్ సలేకర్ – ఆదిత్య అయ్యర్ జంట చేతిలో ఓటమి పాలైంది. -
నిధి పరాజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి నిధి చిలుముల పోరాటం ముగిసింది. పుణేలో బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో నిధి 2-6, 2-6తో టాప్ సీడ్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోరుుంది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిధి తన ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి... తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయింది. ఇతర మ్యాచ్‌ల్లో కర్మన్‌కౌర్ థండి 6-2, 1-6, 6-2తో గసనోవా (రష్యా)పై గెలుపొందగా... నటాషా పల్హా 2-6, 4-6తో పొలీనా మొనోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది.